"ఆథార్"
అయిపోయింది--అనుకున్నంతా అయిపోయినట్టే!
ఇవాళ (01-10-2010) ఈనాడు 'ఇదీసంగతి'లో శ్రీధర్ కార్టూన్ సర్వస్వం తేట తెల్లం చేస్తే, సంపాదకీయం మిగిలిందాన్ని నగ్నం గా నిలబెట్టింది!
కార్యక్రమం ప్రకారం ఓ పదిమందికి 12 అంకెల "ఆథార్" కార్డులు అందచేశారట మన ప్రథాని.
'వివిధ సంక్షేమ వ్యూహాల ఫలాల్ని సామాన్యులకి చేరవేస్తుందనీ', 'అనేక పత్రాలు సమర్పించే అగత్యాన్ని తప్పిస్తుందనీ' హోరెత్తిస్తున్నారు కానీ, ఇవి జారీ చేసే సంస్థలకి 'జనాభా లెఖ్ఖలూ, రేషన్ కార్డుల సమచారమే' అథారం ట!
పైగా ఈ సంఖ్యకీ ప్రణాళికా సంఘానికీ లంకెపెట్టి, 'మహా సమాచార నిధి ' తయారు చేసే బాధ్యత అప్పగించారు!
అంతేకాదు--ఇప్పటికే జారీ అయిన చెత్తా చెదారం కార్డులకి ఇది యేమాత్రమూ ప్రత్యామ్నాయం కాదట. అన్ని కార్డులూ చెల్లుబాటులో వుంటాయట.
చివరికి పెద్దాయన నందన్ నీలేకణి కూడా, 'సంక్షేమ పథకాల లబ్ధిదారుల్ని యెంపిక చేసే బాధ్యత రాష్ట ప్రభుత్వాలదే' అని తప్పించుకుంటున్నారట.
పైగా, ఆథార్ కార్డు కోసం యెవరైనా తప్పుడు సమాచారం ఇస్తే, ప్రభుత్వాన్నించి 'కఠిన శిక్షలు' వేస్తామని బెదిరింపోటి!
చట్టబధ్ధతేలేని సంస్థకి నాలుగేళ్లలో 45 వేల కోట్ల ప్రాజెక్టుని అప్పగించడం ఓ యెత్తైతే, వచ్చే అయిదేళ్లలో సుమారు నూరుకోట్లమందికి ఈ కార్డులు అందించడానికి యెంతవుతుందో?
మొట్టమొదట మన రాష్ట్రం లోనే, యేడు జిల్లాల్లో మూడుకోట్లమందికి జారీ చేస్తామనీ, మొదటి కార్డు మనరాష్ట్రం లోనే ప్రథాని జారీ చేస్తారనీ, చెప్పినవి వుత్తరకుమార ప్రఙ్ఞలే అని తేలిపోయింది.
ఇంతకీ, మన రాష్ట్రం లో ఈ కార్యక్రమానికి "టెండర్లు పిలవడం" మాత్రమే పూర్తయ్యిందట--మిగతాదంతా నత్తనడకే!
కొసమెరుపేమిటంటే, ఇది "భారతీయులకే ప్రత్యేకం" కాదుట--ఇప్పటికి దేశం లో వున్నవాళ్లందరికీ--వాళ్లేదేశం వాళ్లయినా--కేటాయిస్తారట!
మరింకెందుకో యీ ఆర్భాటం--కోట్లు దండుకోడానికి కాకపోతే!
19 comments:
http://krishnasree.blogspot.com/2010/09/blog-post_19.html
please read my comments and your comments @ mentioned URL :-)
డియర్ పానీపూరి123!
మీలాగే నేనూ వూహించాను కానీ.....మరీ నిరాశావాది అంటారేమోనని యేమూలో కాస్త ఆశ వుంచుకున్నాను! తీరి.....పోయింది.
ధన్యవాదాలు.
బాగున్నావా పినాకో!రిటైరయ్యావుగా.. ఇంక మీ ఇంట్లోవాళ్ళ దుమ్మురేపుతుంటావు.. పాపం
కృష్ణశ్రీ గారు:
>>>మీలాగే నేనూ వూహించాను కానీ.....మరీ నిరాశావాది అంటారేమోనని యేమూలో కాస్త ఆశ వుంచుకున్నాను! తీరి.....పోయింది.
అది నిరాశా వాదం కాదు. అనుభవం అంతే! ఓటు కార్డు అప్పుడు కూడా ఇలాగే చెప్పారు. తరువాత ఏమయిందో మనం చూసాం కదా! ఇదీ అంతే!
It is too early to talk in negative about the card. It is not easy to abolish all other cards issued by State Govts. Let the cards be issued to all citizens and after that you may express your opinions.
1) What is wrong in penalising those who give wrong information to Govt of India?!!
2) Nenekanti is not escaping, he has no authority to decide on who should get benefits of so called 'welfare' & reservations. It is for the elected govts to decide.
వూహించగలగటం స్వాగతించవలసిన మంచి పరిణామమే :)
ఒరే ముక్కూమొహం లేని 'Anonymous'!
నువ్వు ఏమిటో, నీ బతుకు ఏమిటో బయటపడి మాట్టాడరా.
గురువుగారు నిన్ను English పి నా కొ అన్నారు గానీ, నేను నిన్ను తెలుగు పి. నా. కొ (పిచ్చి నా కొడకా) అంటున్నాను. ముందు నీలాంటోల్ల దుమ్ము రేపుతున్నారుగా. ఇంక నోరు ముయ్యి.
ఓ Anonymous!
ఇదివరకు నీకు తెలిసిన తెలుగులో యేదో పేరుతో పిలిచినట్టున్నావు--మరిచావా?
అవునులే, ఆమాత్రం తెలివిడే వుంటే ఇంకా ఇలాంటి వ్యాఖ్యలెందుకు వ్రాస్తావు!
కాస్త సరస్వతీ లేహ్యమో, వూరపిచ్చుక లేహ్యమో పుచ్చుకోడం ప్రారంభించు. పోతిరెడ్డిపాడు వెళ్లవలసిన అవసరం తప్పుతుందేమో!
డియర్ AMMA ODI!
నిరాశ మాటెలావున్నా, బూడిదలో పోస్తున్న పన్నీరుని తలుచుకొంటే బాధేస్తుంది.
బై ది వే, పైన వాడి కామెంట్, నా జవాబు చూశారుగా?
ధన్యవాదాలు.
డియర్ snkr!
ముందుగా టపా శ్రధ్ధగా చదివి, చాలా మంది పట్టించుకోని కొన్ని అంశాల్ని యెత్తిచూపినందుకు చాలా సంతోషం.
స్టేట్ గవర్నమెంటులు ఇంకా యెన్నిరకాలకార్డులు జారీ చెయ్యాలి? రేషన్ కార్డులూ, వోటరు కార్డులూ, స్మార్ట్ కార్డులూ, వుపాధి స్మార్ట్ కార్డులూ, మత్స్యకారులకి స్మార్ట్ కార్డులూ--ఇలాంటి వాటినే చెత్తా చెదారం కార్డులన్నది.
వుదాహరణకి నాకు జారీ చేసిన పాన్ కార్డూ, డ్రైవింగ్ లైసెన్సూ, నా లేండ్ లైన్ బిల్లూ, మొబైల్ బిల్లూ--ఇలా వేటిలోనూ నా అడ్రెస్ ఇంతవరకూ సరిగ్గా నమోదు చేసిన వెధవ యెవడూ లేడు.
ప్రాజెక్ట్ ప్రారంభించిందే "ప్రతీ భారతీయుడికీ ఓ ప్రత్యేక గుర్తింపు సంఖ్య" కోసం. అందుకే దాన్ని "జాతీయ జనాభా రిజిష్టర్" కి లంకె వేశారు. అడ్డంగా దేశం లోకి ప్రవేసించినవాళ్లకి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వోట్ల కోసం రేషన్ కార్డులు జారీ చేసేస్తే, వాటి ఆధారం గా "ఆథార్" కేటాయిస్తే, ఇక జనాభా రిజిష్టరెందుకు?
ఈ (తప్పుడు) సమాచారాన్నే ఆథార్ కోసం వినియోగించుకుంటూ, రేప్పొద్దున్న "తప్పుడు సమాచారం" ఇచ్చారంటూ నాగరికుల మీద కేసులు పెట్టచ్చా?
నీలేకణి (నేనేకంటి కాదు) కి అప్పగించింది "సంఖ్యల కేటాయింపు" "జనాభా రిజిష్టరు" బాధ్యతలు మాత్రమే! దాన్ని యెలా వినియోగించుకుంటాయో ప్రభుత్వాల ఇష్టం.
సరైన వివరాలు సేకరిస్తాడనే ఆయనకి అంత బాధ్యత అప్పగిస్తే, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చిన వివరాల ఆథారంగానే సంఖ్యలు కేటాయిస్తామంటే--ఆ మాత్రానికి ఆయనెందుకు? బ్యాంకుల్లోనూ, ఇతర సంస్థల్లోనూ "డాటా ఎంట్రీ" కాంట్రాక్టులు తీసుకొనే "అవుట్ సోర్సర్లు" చాలు కదా?
45000 కోట్లు నాకు ఇస్తే, స్వంతం గా నిరుద్యోగుల్ని ఎన్యూమరేటర్లుగా నియమించుకొని, 3 సంవత్సరాల్లోనే--ఈ కార్యం సాధించగలను. నేనే కాదు--మీరైనా సాధించగలరు!
మరెందుకీ వెర్రి?
ధన్యవాదాలు.
డియర్ Ekalavya!
అఙ్ఞాతల్ని 'ఇగ్నోర్' చెయ్యండి, బహిష్కరించండి, తరిమెయ్యండి, వెలి వెయ్యండి అని చెపుతున్న నేనే వాళ్ల వ్యాఖ్యలకి సమాధానం ఇవ్వకుండా వుండలేకపోతున్నానంటే--మీ ఆవేశాన్ని అర్థం చేసుకోగలను.
అయినా, అంతొద్దు. ఇలాంటివాళ్లకి 'బానిస ఇంగ్లీషూ', 'పిల్ల హీరోల' స్థాయీ చాలు--తెలుగూ, సంస్కృతమూ వేస్ట్!
వాడి ముక్కే పెరిగి, యెప్పుడో పాపం బద్దలయినట్టు బద్దలవుతుందేమో! మనకెందుకు!
Citizen IDs to cost Rs 1.5 lakh crore
http://timesofindia.indiatimes.com/India/Citizen-IDs-to-cost-Rs-15-lakh-crore/articleshow/4703794.cms
కృష్ణశ్రీ గారు,
మీరు చెప్పినది సబబే కాని మీ అభిప్రాయంతో ఏకీభవించలేక పోతున్నా. ఉదా. మీ కార్డ్ లో తప్పు చిరునామా వుంటే అది ప్రింట్ చేసిన వెధవది అయ్యుండవచ్చు. దానికి మీ భాధ్యత వుండదు. దరఖాస్తులో మీరు తప్పుడు చిరునామా ఇచ్చివుంటే అందుకు భాధ్యత మీదే.
నీలేకణి ఒక ఉద్యోగిలా భాధ్యత నెరవేర్చారు. అతనిపై విమర్శలు సరి కాదేమో
/45000 కోట్లు నాకు ఇస్తే../ :) రిటైరయ్యినారు, అంత బరువుభాధ్యతలు మోయగలరా? (మరీ అన్ని కోట్లు మీదేస్తే నిలదొక్కుకోగలరా? ) :ఫ్
మొదలు పెట్టారు, ఏమవుతుందో చూద్దాం. ఇంకో 20ఏళ్ళ తరువాతైనా ఇన్ని అట్టముక్కలు వుండవనే ఆశిద్దాము.
డియర్ snkr!
మీరు పట్టుకున్న 'లా' పాయింటు మీదే నిలబడి, అసలు పాయింట్ మరిచిపోతున్నారు!
ఆ పది మంది గిరిజనులూ, వాళ్లంతట వాళ్లు యే సమాచారం ఇవ్వలేదుగా?
నాకార్డు విషయం లో తప్పు--నా చిరునామాని వాడికి కావలసినట్టుగా కంప్యూటర్ లోకి యెక్కించినవాడిది! (ఆలాగే యెందుకు యెక్కించాడు అనడానికి వేరే కారణాలు వున్నాయి). దరఖాస్తులో తప్పు చిరునామా ఇచ్చే అగత్యం నాకు లేదు కదా? (మర్నాటినించీ బిల్లులు వగైరా నాకు ఆ చిరునామాకే రావాలి కదా?)
ఆథార్ విషయం లో దరఖాస్తుల ప్రసక్తే లేదంటున్నారు కదా?
నీలేకణిని విమర్శించడమంటే, ఆ వుద్యోగానికి ఆయన స్థాయి అవసరం లేదు అనీ, మొదట్లో ఆ స్థాయి అవసరం అనుకున్నా, తరవాత ఆయన చేతులు కట్టేశారనీ!
రిటైర్ అయినంత మాత్రాన బ్రెయిన్ డెడ్డో, మరేదో అయిపోలేదుగా! నేనన్నది 'వేసుకొనే' కోట్ల గురించి కాదు లెండి--అలాంటిది ఒక్క కోటిచ్చినా నేను వేసుకోను--యెందుకంటే ఇంతవరకూ నాకు (నేను డ్రామాల్లో ధరించిన పాత్రలతో సహా) కోటు వేసుకొనే అగత్యం రాలేదు.
హతోస్మి! ఇంకో 20 యేళ్లా! ప్రత్యేక గుర్తింపు వున్న భారతీయుడిగా గర్వంగా కొన్నేళ్లయినా బ్రతకాలని......ఆశించడం కూడా తప్పేనేమో!
మరోసారి ధన్యవాదాలు!
డియర్ తార!
సంతోషం. సమగ్రమైన ఇలాంటి ఆర్టికిల్స్ అన్నీ చదివే, ఇంత దృఢమైన అభిప్రాయాన్ని ప్రకటించగలుగుతున్నాను.
బ్లాగర్ల సౌలభ్యం కోసం లింక్ ఇచ్చినందుకు అభివందనాలు.
ముందు 15 లక్షల కోట్లని, మళ్లీ ఒకటిన్నర లక్షల కోట్లకి సవరించినందుకు కూడా సంతోషం.
ధన్యవాదాలు.
ఆధార్ ప్రస్తుతం అనవసరం అని అనడానికిలేదు, అలా అని, అవసరమా అంటే ఆలోచించాలి, ఇప్పుడు కాకపోయిన ఎప్పటికొప్పటికి కావాల్సిందే.
ఇంక ఎంత ఖర్చు పెట్టినా దానికి రెండింతల లాభం వస్తుంది, ఖర్చు బెంగలేదు..
భారతదేశంలో 6 నెలలకన్నా ఎక్కువ వుండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ కార్డ్ అవాస్రామ్ పడుతుంది, కాబట్టి విదేశీయులకి ఇవ్వొచ్చు, ఇవ్వాలి
మిగతావి చాలా రాయాలి, మరొకసారి.
డియర్ తార!
ఇప్పుడు అవసరమా, యెప్పటికయినానా అని కాదు.
ఓ నలభై ఐదేళ్ల క్రితమే, "బీటిల్స్" చతుష్టయానికి వాళ్ల దేశం కేటాయించిన "యూనిక్ కోడ్" నెంబర్లున్నాయని చదివినప్పటినించీ, మనకి కూడా అలా వుంటే బాగుండును అనిపించేది.
లాభం వచ్చినా రాకపోయినా ఖర్చు పెట్టవలసినదే--సవ్యమైన దిశలో.
సామాన్యం గా 6 నెలలు దాటి వుండాలి అనుకొనే విదేశీయులెవరూ వుండరు. ఒకవేళ వున్నా, వాళ్లకి ప్రత్యేక వీసాలు జారీ చెయ్యబడతాయి కాబట్టి, విదేశీయులెవరికీ ఈ సంఖ్య జారీ చెయ్యబడ కూడదు. ఇందులో రెండో అభిప్రాయానికి తావు వుండకూడదు.
మీరు చాలా వ్రాయండి--నా బ్లాగులో కాకపోయినా, మీ బ్లాగులోనయినా! లింకు మాత్రం నాకివ్వండి......మరువకండేం!
మరోసారి ధన్యవాదాలు.
>>ఒకవేళ వున్నా, వాళ్లకి ప్రత్యేక వీసాలు జారీ చెయ్యబడతాయి కాబట్టి,
వీసాలు వేరు, ఇవి వేరు కదా.. ఎందుకంటే..రేపు మీరు కొత్త ఫోన్ కనెక్షన్ కావాలి అన్నా, బ్యాంక్ ఎకౌంట్ తెరుచూకోవాలి అన్నా, చివరాకరకి విమానం ఎక్కాలి అన్నా ఈ నెంబర్ తప్పకుండా ఇవ్వాల్సిందే..
అప్పుడు వీసా గడువు తీరిపోయినా ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది, పనిలో పనిగా వెలి ముద్రలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఈ నేరం చేసిన వాళ్ళ వీసా అప్పుడే క్యాన్సిల్ చేసి మరొకసారి ఈ మార్గానా దేశంలోకి రాకుండా చేయవచ్చును. (ఒకే వ్యక్తికి ఎన్ని కావాలి అంటే అన్నీ పాస్పోర్త్లు ఇచ్చే అవకాశం సుబ్బరంగా ఉన్నది కొన్ని దేశాల్లో.).
డియర్ తార!
ఈ వీసాల గొడవ నాకు తెలీదు గానీ, "ఆరునెలలు దాటి" మన దేశం లో వుండిపోవాలనే విదేశీయులని అనుమానించాల్సిందేకదా? పైగా వాళ్లకి ఫోన్ కనెక్షనూ, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ లేకుండా వుండరుగా? విమానం యెక్కడం ఇదివరకు నించీ చేస్తున్నారుగా? (వాళ్ల విదేశీ పాస్ పోర్ట్ తోనో, భారత్ పాస్ పోర్ట్ తోనో)
యేది యేమైనాసరే......ఈ సంఖ్య మాత్రం భారతీయులకే ప్రత్యేకం కావాలి. అంతే.
కావాలంటే మీరు చెప్పిన, చెప్పబోయే కేసులకి ప్రత్యామ్నాయ యేర్పాట్లు చేసుకోవచ్చు.
మరోసారి ధన్యవాదాలు.
Post a Comment