Friday, October 15

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు - 4



వచ్చిన గొడవల్లా, ఋణ గ్రహీతల ఆదాయమెంత, ఖర్చు యెంత, పొదుపు యెంత, ఋణాలెంత, గ్రూపు సభ్యులా కాదా, గ్రూపుకి అప్పు వుందా--ఇలాంటివన్నీ వీళ్లకి అనవసరం.

యెందుకంటే, తమ దగ్గర మురుగుతున్న డబ్బుని, యెలాగోలా వితరణ చెయ్యాలి--చట్టబధ్ధం గా! దానికోసం తమ వుద్యోగులకి కూడా లక్ష్యాలు నిర్దేశించి, వాటిని అందుకునేదాకా చంపుకు తిన్నాయి! (ఈ వుద్యోగులకి కనిష్టం 500 నించి గరిష్టం 10 వేల వరకే జీతాలు! అందుకనే, ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తాయి--నగదు రూపం లో--లక్ష్యాలు చేరిన వాళ్లకి! అదే ఋణ వసూళ్లకైతే, లక్ష్యాలు చేరనివాళ్లకి జీతాలు కోస్తారు! మరి పాపం వాళ్లెలా ఛస్తారు?)

ఇంకేం? నెత్తిమీద జుట్టు కూడా లేనివాడికీ, అప్పటికే గ్రూపులలో వుండి, జుట్టు మాత్రమే కలిగి వున్న వాళ్ల ఆడాళ్లకీ, మేజర్లయిన కొడుకులకీ, కూతుళ్లకీ (కూతుళ్లు రేపు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోతారు!) కొండొకచో, మైనర్లకీ (తండ్రినో, తల్లినో గార్డియన్ గా పెట్టుకొని) సూ ఋ లు మంజూరు చేసేశారు!

ఇక నెల నెలా ఠంచనుగా ఋణ గ్రహీత అప్పు చేసిన తేదీ నాడే వాళ్ల చెక్కులని పూర్తి చేసి, బ్యాంకులలో దాఖలు చేస్తారు. (మొదట్లో ఓ ఐదారు వాయిదాలు బాగానే చెల్లిస్తారు--చేతిలో డబ్బులు బాగానే ఆడుతుండడంతో!) ఖాతాలో డబ్బు లేక, చెక్కు తిరిగి వెళితే, ఖాతా వున్న బ్యాంకు వారు ఓ 46 రూపాయలు (సర్వీస్ ఛార్జి + 13% టాక్స్) వసూలు చేస్తారు. సూ ఋ సంస్థ వారు తమకి ఆ నెలలో రావలసిన వాయిదా డబ్బు రాలేదు కాబట్టి, వడ్డీతో లెఖ్ఖగట్టి, మళ్లీ నెల చెక్కుని వాయిదా+వడ్డీ కి వ్రాసి, బ్యాంకులలో జమ చేస్తారు! ఆ నెలా చెక్కు తిరిగి వెళితే--షరా మామూలే!

ఇలాంటి సూ ఋ సంస్థలు మన దేశం లో 21 వుండగా, ఆంధ్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక లలో వ్యాపారం సాగిస్తున్నవి 16. వీటి వ్యాపారం కూడా ఆంధ్ర ప్రదేశ్ లోనే యెక్కువ. (ఇక్కడ విజయాలు సాధిస్తే, అక్కడ విస్తరణ చేసేవి!)

ఆ 16 సంస్థల లో, ప గో జి లో "హెచ్చు" వ్యాపారం చేస్తున్న 13 సంస్థల పేర్లు--1. ఎస్ కే ఎస్ (స్వయం కృషి) 2. అస్మిత 3. స్పందన 4. షేర్ 5. క్రీసా 6. ఫుల్లర్ టన్ ఇండియా (గ్రామ శక్తి) 7. ఎల్ & టీ 8. ఉండమ్మా, బొట్టు పెడతా 9. పంపు కింద బింది, 10. స్వయం 11. ప్రగతి 12. గృహలక్ష్మి 13.హెల్ప్.

వీటిలో ఎస్ కే ఎస్ సంస్థ యజమానులకీ, రాహుల్ గాంధీ కీ సంబంధం వుందని ఇటీవలి ఆరోపణలు!

మొన్నో రోజు ఒకే సారి యెనిమిదో యెంతమందో ఆత్మహత్యలు చేసుకోగానే, రాహుల్ మన మంత్రి వట్టి వసంత కుమార్ ని ఢిల్లీ పిలిపించుకొని, ఆరా తీశాడట! వట్టి యేదో సర్ది చెప్పాడట! ఇదో పిడకల వేట.

అన్నట్టు, ఎస్ కే ఎస్ సంస్థ పబ్లిక్ ఇస్యూ కి కూడా వెళ్లింది--రేపో మాపో లిస్టింగ్ అవుతుంది! ఇంకెంత విజృంభిస్తుందో! ఈ కంపెనీలో పనిచేస్తున్న "గుర్మన్" యేటా రెండు కోట్ల జీతం, 80 లక్షల బోనస్ తీసుకుంటున్నాడట! (చందా కొచ్చార్ కూడా యేడుస్తుందేమో! ఈ మాట వింటే)

ఇక ఆర్ బీ ఐ, సూ ఋ సంస్థల మీద నాకు ఆధిపత్యం లేదు, వడ్డీలు తగ్గించమని వాళ్లకి చెప్పలేను--అంటుంది!

సూ ఋ సంస్థలు, మేము ఎన్ బీ ఎఫ్ సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు) గా రిజర్వ్ బ్యాంకులో రిజిస్టర్ అయ్యాము, నువ్వెవడివిరా కోన్ కిస్కా? అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని!

(మనకి హర్షద్ మెహతా కుంభకోణం తరవాతో, కేతన్ పరేఖ్ కుంభకోణం ముందో కొన్ని వేల "లీజింగ్ & ఫైనాన్స్" కంపెనీలు పుట్టుకొచ్చాయి దేశ వ్యాప్తం గా--రెండు మూడేళ్లలో వాటా దారులనీ, ప్రజల్నీ మోసగించి, బోర్డులు తిప్పేశాయి! ఇంకా కొన్ని అదేపని చేస్తున్నాయి--వీటి సంగతి క్రమం లో.)

మన కొత్త తరం బ్యాంకులు విచ్చలవిడిగా "వ్యక్తిగత", "వాహన", "క్రెడిట్ కార్డు" ఋణాలిచ్చేసి, వాటి వసూలుకై "గూండాలని" రికవరీ యేజంట్లుగా వినియోగిస్తున్నాయి అని వార్తలు వచ్చినప్పుడే--గత మూడు సంవత్సరాలుగా నేను టపాలు వ్రాస్తూనే వున్నాను--ఇండియాలో "లోన్ షార్కింగ్" మొదలవుతోందనీ, త్వరలో అమెరికా, లాటిన్ అమెరికా, మెక్సికో దేశాల లెవెల్లో కాకపోయినా--ఇది "మాఫియా" లాంటి వాళ్ల చేతుల్లోకి వెళుతోందనీ!

యే దావూద్ ఇబ్రహీమో.........21 టినీ.....పాపం శమించుగాక....ఆ రోజు రాకూడదు!

12 comments:

కొత్త పాళీ said...

హమ్మ్ .. తెప్పలుగ చెరువు నిండిన ..

Anonymous said...

>>చేపలు కొనడానికి జనాలకి 'అప్పులు సుళువుగా దొరికే' మార్గం చూపించండి"--అని మధ్యేమార్గం గా చూపించి, నోబెల్ బహుమతి కొట్టేశాడో మహానుభావుడు--మహమ్మద్ యూనిస్ అనీ--ఆయన (తనకొచ్చిన నోబెల్ డబ్బుతో చేపలు కొని తినేశాడో, అమ్ముకున్నాడో, యెంతమందికి చేపలు కొనడానికి ఋణాలకి యేర్పాట్లు చేశాడో ఆయన దేశం లో--మనకి తెలీదు!)

మొదటి భాగంలోనే రాసిన ఈ లైను దురభిప్రాయమండి. యూనస్ ఆటోబయాగ్రిఫికల్ లాంటి పుస్తకం ఒకటి రాశారు. మీరు చదివి సూక్ష్మ ఋణాల వెనక ఆయన అసలు ఆలోచన కూలంకషంగా అర్ధం చేసుకొని రాస్తే, ఇలా ఉండకపోవచ్చు.

ఈ పద్దతిలో ఉన్న లోపాలని చూపించడంలో కాస్త బైయాస్డ్‌గా రాసేశారేమో నాకు తెలియదు. మీరు లేవనెత్తిన లోపాలు ఉన్నాయన్నది నిజం; వాటి గురించి ఆలోచించాల్సిందే.

మీరు బ్యాంకరుగాబట్టి,మొత్తానికి కాస్త సాధికారంగానే ఉన్నా, నాకు ఎక్కువ అసంతృప్తిని కలిగించింది. మరేం పర్లేదు. ఏకేద్దాం అనే తొందర పక్కన బెట్టి, కాస్త కాంసెప్టుల గూండా మళ్ళి రాస్తు వెళ్ళగలరేమో చూడండి.

>>-బ్యాంకులూ ముందుకు వచ్చాయి--తామిచ్చిన ఋణాలు తిరిగి వసూలవడమే ముఖ్యం వాటికి--దీనికి 'సంఘాల' గ్యారంటీ వుంటుంది కదా అని వాటి నిశ్చింత!

ఈ సంఘాల గ్యారెంటీ నిశ్చింత బ్యాంకులకి కాదు మైక్రోఫైనాన్స్ కంపెనీకి కదా. మీ ఉద్దేశ్యం , ప్రారంభంలో బ్యాంకులే స్వయంగా సూక్ష్మ ఋణాలను వితరణ చేసేవనా?

అలాగే GTB పూర్తిగా తుడుచి పెట్టుకు పోయింది మాత్రం 2004; 2000లో కాదు.

ఇలా కాస్త తిక్క తిక్కగా అనిపించింది అని మనవి.

Why don't you try to explain once again? it surely is the subject you can think for long enough.

నాలోనేను said...

The observations are good but demonstrate the lack of awareness about MFI.
Can you just figure out whether the servant maid working in the bank manager's house gets her monthly remuneration by way of a cheque from him? Does she has a bank account at the first place?
Does the bank give a loan of mere 5,000/ to the person who sells tea to the bank staff?

Hope the answers would provoke more thoughts.

A K Sastry said...

డియర్ rayraj!

సత్, దుర్ లని ప్రక్కనపెట్టిన నా అభిప్రాయం అది. అంతే.

పుస్తకాలు అందరూ వ్రాస్తారు....మార్క్స్, ఎంగెల్స్ లూ వ్రాశారు. ఆయన పుస్తకం వ్రాసేవరకూ ఆగఖ్ఖరలేకుండా ఆయన ముఖతః ఆయన 'అసలు ఆలోచనలు ' బలవంతం గా వినాల్సి వచ్చేది మాకు.

రెండు కోణాల్లో, ఒకదాన్ని సమర్థిస్తూ, రెండోదాన్ని అనవసరం గా విమర్శిస్తే--దాన్ని 'బయాస్ ' అనచ్చు. లోపాలంటారా వాటిని--మనరోడ్లమీద కనిపించే నిలువెత్తు గోతులు కావూ అవి?

యేకేద్దాం అనే తొందరేంలేదు నాకు. 'కాన్సెప్టుల గుండా'......కొంచెం వివరించండి.

సూ ఋ సంస్థలు పుట్టకముందే, బ్యాంకులు స్వ స సంఘాలకి ఋణాలు ఇవ్వడం మొదలెట్టాయి. ఇంకా అంతకు ముందు కూడా అనేక "గ్రూప్ గ్యారంటీ" ప్రయోగాలు చేశాయి ఋణాలలో--ముఖ్యం గా బలహీన వర్గాలకి.

"ఇవన్నీ జరిగింది 2000-2005 మధ్య" అని ముందే వ్రాశాను. నా 'లైన్ ఆఫ్ థాట్' ప్రయాణించిన డిశలో వ్రాస్తూ వుండగా, జీ టీ బీ 'పతన సరళి ' వివరించబోతే, ప్రక్కదారి పట్టినట్టు కాదూ?

శ్రధ్ధగా టపాలు చదివి, విలువైన అభిప్రాయాలని వెలిబుచ్చుతున్నందుకు నా ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ నాలోనేను!

మీ అభిప్రాయం ఇంకా స్పష్టం గా వ్రాస్తేగానీ, యేమి వ్రాశారో, యెందుకు వ్రాశారో తెలీదు కదా? (లేఖిని ద్వారా తెలుగు లో ప్రయత్నించ కూడదూ?)

ఎం ఎఫ్ ఐ ల గురించి నాకున్న అవగాహన చాలదేమో తమకి--మీరూ బ్యాంకరే కాబట్టి, మీ అవగాహన ని వివరిస్తే, సంతోషిస్తాను.

ఇందులో 'ఫిగర్ ఔట్' చెయ్యడానికేముంది? మొన్నటిదాకా నేను పనిచేసిన బ్రాంచ్ మేనేజరైతే, వాళ్ల ఇంటిపనీ, వంటపనీ చేసినందుకు 1000 రూపాయలూ, బట్టలు వుతికినందుకు 500 రూపాయలకీ పనమ్మాయితో మాట్లాడుకొని, 1000 రూపాయలతో ఆర్ డీ యెకవుంటూ, 500 అడ్వాన్సుతో ఎస్ బీ యెకవుంటూ పెట్టించాడు. నెలనెలా తనే కట్టి, అవసరాలకి ఎస్ బీ లోంచి 500 డ్రా చేసుకోమనేవాడు.

ఆవిడ డబ్బుకోసం బ్యాంకుకి వస్తే, ఆయన కేబిన్ లో యెంతమంది వీ ఐ పీ లు వున్నా, నేరుగా వెళ్లి "నా జీతం" అంటే, ఓ విత్ డ్రాయల్ ఫారం మీద ఆవిడ సంతకాలు తీసుకొని, క్యాషియర్ ని బతిమాలి 500 తీసుకొని, ఆవిడకి ఇచ్చి వెంటనే పంపించేసేంత వీ వీ ఐ పీ ట్రీట్ మెంట్ ఇచ్చేవాడు ఆమెకి!

ఇంకా, నీ బ్యాంకు అకవుంటూ వద్దు, అక్కడ జరిగే ఆలస్యమూ వద్దు, నా డబ్బు నా మొఖాన పారెయ్యి ఒకటో తారీకుకల్లా--అని తెగేసి చెప్పిన పని మనుషులు గల మేనేజర్లనీ చాలామందిని చూసాను.

ఇక బ్యాంకులో టీలు అమ్ముకొనే వాళ్లకి, నిబంధనలు వొప్పుకోక పోయినా, యే బలహీన వర్గాల ఖాతాలోనో, 5000 నించీ అప్పు ఇవ్వడం మొదలెట్టి, అది ఖచ్చితం గా గడువు లోపల తీరిపోతూండడం తో, అప్పు మొత్తాన్ని పెంచుకుంటూ వచ్చి, ఇప్పటికి 50 వేల వరకూ అప్పులు ఇస్తున్నవారు వున్నారు.

జవాబుల వల్ల మీ ఆలోచనలు 'ప్రజ్వరిల్లాయో' లేదో తెలియజేయండి.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ కొత్తపాళీ!

".....కప్పలు పదివేలు" వచ్చినా ఫరవాలేదు--అనకొండలు చేరితెనే.......!

ధన్యవాదాలు.

Anonymous said...

:)) హ హ హ హె హె హె...క్షమించండి. నేను బ్లాగు ముఖతగా ’తిక్క తిక్క’గా ఉంది అనేసై గలిగాను గాని, ’ఏమిట్రా తిక్క వెధవ?’ అని ఆ రోజుల్లో ముఖం మీద అనలేకపోయిన కసి అనమాట :))

ఒకె సార్ అర్ధమైంది. మీ అభిప్రాయంతో నాకు ఇబ్బంది లేదు గానీ నాకు అర్ధమైనంతలో ’చేపలు కొని తింటానికి’ ఆయన అప్పులు ఇమ్మనలేదు. అందుకని అలా ’దుర్’ అని వాడాను.

రెండో సారి చదివినప్పుడు సైతం మీ లైన్ ఆఫ్ థాట్ లోకి రాలేకపోవటం నా లోపమే. కానీ చదివి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడతాను. ఏమనుకోవద్దు. MFI ల మీద నాకున్న ముందస్తు జ్ఞానాజ్ఞానాలు కలిగిస్తున్న ఇబ్బంది ఇది. అందుకే ప్రభుత్వం పావలా వడ్డీ ఋణాలను ఎలా ఇస్తుంది? అని అయోమయంలో ఉన్నాను. దయచేసి ప్రభుత్వ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న MFI యాక్టివిటీనీ , విడిగా MFI యాక్టివిటీస్‌‍ని ఒక్క టపాలో విశదీకరించండి. ఎందుకు ప్రభుత్వం మాట ఈ విషయాల్లో వస్తోంది? అనేది ఇన్ని రోజుల నుంచి అర్ధంగాక అయోమయంలో ఉన్నాను.

ఇంతకీ MFIలు ఏ విషయాన్ని అడ్రెస్ చేసే ఉద్దేశ్యంతో వచ్చాయి? ఆయా సమస్యకి మీ సలహా ఏంటీ!?

@నాలోనేను : I can see a conceptual difference in the way Mr.Krishnasri is approaching it from opposite direction. And we have not discussed what is his opinon and suggested way to address issues of the weaker sections. Since you are also from Banking I think it is appropriate for you to share your awareness about MFI first and then use the ground for thought provoking discusssions. మీలో మీరే అయినా ’ఏంటో ఈ బ్యాంకింగ్’ అని అప్పుడప్పుడు అనుకోపోతే ఎలా!?

A K Sastry said...

డియర్ rayraj!

యేరోజులో, యెవరిని యెందుకు 'ఏమిట్రా తిక్క వెధవ?' అనలేకపోయారో, మీకింత కన్‌ఫ్యూజన్ యెందుకో అని నాక్కూడా హి హి హ్హి హ్హీ అని నవ్వు వస్తూంది.

మీకు అర్థమైనంతలో ఆయన దేనికి, యెవర్ని అప్పులు ఇమ్మన్నాడో చెపితే బాగుండేది కదా?

నా లైన్ ఆఫ్ థాట్ లోకి మీరు రానఖ్ఖరలేదు--అది తెగిపోకుండా--అనవసర విషయాలకి ప్రాథాన్యత ఇవ్వకుండా--యెలా వ్రాస్తున్నానో అనుసరిస్తూ చదువుకుంటే సరిపోతుంది.

ఎం ఎఫ్ ఐ లు అనేవి పూర్తిగా ప్రైవేటు సంస్థలు. వాటికీ, ప్రభుత్వాలకీ యే సంబంధం లేదు. అందుకని, "ప్రభుత్వ ఇన్వాల్వ్ మెంట్ వున్న ఎం ఎఫ్ ఐ యాక్టివిటీ" అనే ప్రసక్తే రాదు. ఇప్పుడు వ్రాస్తున్నదంతా "విడిగా ఎం ఎఫ్ ఐ యాక్టివిటీస్" గురించే.

ప్రభుత్వం పావలా వడ్డీయేకాదు--యే వడ్డీ ఋణాలూ ఇవ్వదు--బ్యాంకుల ద్వారా ఇప్పిస్తుంది--అంతే. దీనికోసమే యూనిస్ కాన్సెప్ట్ ని అరువు తెచ్చుకొని, మహిళా స్వ స సంఘాలు యేర్పరచుకోమని, వాటికి సూ ఋ లు ఇమ్మని బ్యాంకులని నిర్బంధిస్తోంది. (పావలా వడ్డీగురించి ఈ సూ ఋ సంస్థల మీద 'సిరీస్ ' అయిపోయాక వ్రాస్తాను)

ఇక యూనిస్ గురించి మన జే పీ యేమన్నాడో నా తరువాతి టపాల్లో వ్రాశాను చదవండి.

మొత్తం స్త్రీలందరినీ 'వీకర్ సెక్షన్' గా భావిస్తే తప్ప, పావలా వడ్డీ ఋణాలకీ, సూ ఋ సంస్థలకీ, ప్రభుత్వానికీ, బ్యాంకులకీ, వీకర్ సెక్షన్ సమస్యలతో సంబంధం లేదు అని గ్రహించండి.

ఇంకా సందేహాలుంటే, వ్రాయడానికి వెనుకాడవద్దు. ధన్యవాదాలు.

Anonymous said...

Due to a self-imposed restriction, I don't contact anybody via mails.Hence, I chose to leave a personal message, only to your eyes via this comment.It is about a post that i am going to publish.

Inadvenrtently, it looks like my comments were misundersood to be sarcastic here.And an idea is born in my mind to use this as an opportunity to gain some readership. I am trying this garb of "insult" for the first time; From my perception of this telugu blogging world, I feel it raises huge curiousity and thus brings the readers.

I could have played this trick without letting you know about it.But i sincerely don't want to hurt you.So i have decided to inform you clearly that i have no intention to insult you.

Nothing that i am going to write in my post is being directed at you; It is hitting a human characterstic; of mostly a mental projection of myself and it is Not at all You. I have deep respect for people who rise pertinent issues in telugu blogs. I value your contribution of writings on Microfinance more than anything else. In fact, every discerning reader will understand that i am berating myself in my blog and Not you. I am just trying to rise some curiousity in the readers.
That's all. Hope you understand it and have all the fun like everybody else.

Surely i am missing something in your posts. i am not getting how politics got into this? I will keep reading and try to understand.


You may publish following line if you like :)
నా బ్లాగులో వివరిస్తాను; వచ్చి , చదివి, చెప్పండి.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

చాలా బాగా రాశారండీ, అందరికీ అసలీ విషయం మీద అవగాహన వచ్చేలా రాస్తున్నారు.

As far as I understand, the microfinance idea is to help the rural people to become better financial managers and to provide enough help for them to prevent them from going into distress mode. When all these private entities entered this field, the idea is defeated and profit motive is in full play. What these companies are doing is similar to the sub prime lending that happens in westren countries..

am I understanding it correctly?

A K Sastry said...

Dear rayraj!

I do not understand any of this crap about the garb of insult etc. And this is not a place to have "fun" like a Nero.

Didn't you read that the govt. is goading the banks to finance SHGs? Didn't you read the lines--"pratI cellemmanI lakshAdhikArini cEstaam" anEdi mI cevullO pratidhvanimcaDam lEdU?

Still not getting how politics got into this? Then, GOH.

Continue reading.

Thanks and NamaskAram!

Incidentally, I have no control over publication of comments as I am not applying any comment moderation. Your comment is already published. (You should have used my E-mail address from my profile!)

A K Sastry said...

డియర్ Weekend Politician!

నా ప్రయత్నాన్ని అర్థం చేసుకొన్నందుకు అనేక ధన్యవాదాలు.

ఎం ఎఫ్ కాన్సెప్ట్ ని చక్కగా అర్థం చేసుకొన్నారు. బాగుంది.

ఇక్కడ జరుగుతున్నది, "అప్పులిచ్చేవాళ్లని" యెగదోసి ఇప్పించడం; అందరినీ "అప్పులు తీసుకోమని" యెగదొయ్యడం--వీటి మధ్య తమ పంట పండించుకోవడం--వాటిని మాఫీ చేయించి, తమ రాజకీయ పెట్టుబడిగా దాన్ని వుపయోగించుకోవడం! ఇదీ స్థూలంగా.

"సబ్ ప్రైం" కీ దీనికీ చాలా తేడా వుంది--అందులో ప్రభుత్వ/రాజకీయ జోక్యం వుండదు.

"లోన్ షార్కింగ్"కీ దీనికీ కూడా తేడా అదే--అది పూర్తిగా ప్రైవేటు మాఫియా వ్యవహారం. ప్రభుత్వాలు కూడా దీంట్లో జోక్యం చేసుకోడానికి భయపడతాయి!

మనవాళ్లు కనిపెట్టినది, మధ్యే మార్గం!

(లోన్ షార్కింగ్ గురించి "హెరాల్డ్ రాబిన్స్", "ఆర్థర్ హెయిలీ" ల్లాంటి ఫిక్షన్ రచయితల రచనలు చదవండి.)

ఇంకా, నా తరవాతి టపాలు కూడా చదవండి--సూ ఋ వ్యవహారం లో.