"సూక్ష్మ" ఋణాలు - 9
ఓ పక్క సూ ఋ సంస్థలగురించి గోల జరుగుతూండగానే, ఇంతకు ముందు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ ఎల్ బీ సీ) లో నిర్దేశించిన మేరకు, మహిళా స్వ స సం లకి ఋణాలు ఇవ్వడానికి "ఆంధ్రా బ్యాంకు" ముందుకు వచ్చి, "గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ" (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవెర్టీ--ఎస్ ఈ ఆర్ పి)--(ఇది ప్రభుత్వ సంస్థో, ఎన్ జీ వో నో తెలీదు) తో 12-10-2010 న ఓ వొప్పందం కుదుర్చుకుందట!
ఈ "సెర్ప్" పోషిస్తున్న పాత్ర యేమిటో స్పష్టం కాలేదు కానీ, "గతంలో తీసుకున్న ఋణ వాయిదాలని స్వ స సం లు యెప్పటికప్పుడు చెల్లించే విధం గా తాను చూస్తాను" అని హమీ యిచ్చిందట.
ఈ సంస్థ ఒక సర్వే నిర్వహించి, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం లో 4.23 లక్షల స్వ స సం లు రూ.7,698 కోట్ల ఋణం పొందడానికి "అర్హులు" అని తేల్చి, ఆ జాబితాని బ్యాంకులకి అందజేసిందట. వీటిలో, ఆంధ్రా బ్యాంకు 64,271 సంఘాలకి రూ.1,238.86 కోట్లు "ఇవ్వాల్సి" వుందట. ఈ మేరకు వొప్పంద పత్రం మీద "సంతకాలు" చేసిందట.
కొన్ని బ్యాంకులతో ఇలాంటి వొప్పందాలు ఇప్పటికే జరిగితే, ఇంకొన్నిటితో జరగబోతున్నాయట!
ఆగస్టునాటికి రూ.2,200 కోట్లు సంఘాలకి అందాయని "సెర్ప్ అధికారులు" చెప్పారట.
14-10-2010 న సూ ఋ సంస్థల గురించి ప్రత్యేక ఎస్ ఎల్ బీ సీ సమావేశం జరగనుండగా, 12-10-2010 న ఈ బ్యాంకు ఈ వొప్పందం చేసుకోవడం లో మతలబేమిటో మరి.
ఇక మొన్న ముఖ్యమంత్రితో సమావేశం లో సూ ఋ సం ల బాధితులకు వాటినుంచి బయటపడడానికి సాయం చేస్తామని ఆవేశ పడ్డ బ్యాంకులకి, వాస్తవాలు వాటి ముఖం మీద కళ్లెర్రజెయ్యగనే, కాళ్లూ చేతులూ చల్లబడ్డాయట!
వాళ్లని బయట పడెయ్యాలంటే, 10 వేల కోట్ల పైమాటగా కొత్త ఋణాలు ఇవ్వాలనీ, అక్కడితో ఆగకుండా, ఒకళ్లకిస్తే అనేకమంది బ్యాంకులమీద దాడి చేసే అవకాశాలున్నాయనీ గ్రహించి, "ఇది జరిగేపని కాదు" అని తేల్చి చెప్పేశారట ప్రభుత్వానికి. హమ్మయ్య.
రిజర్వ్ బ్యాంకు కమిటీని కూడా యేర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది--చూద్దాం యేమి జరుగుతుందో!
4 comments:
కృష్ణ శ్రీ గారూ
నాకు ఒక చిన్న సందేహము వచ్చింది. ఎవరికన్నా డబ్బులు అప్పులుఇచ్చేటప్పుడు వాళ్ళు తీర్చగలరో లేదో నిర్ణయించి ఇవ్వరా? ఎవరికి బడితే వాళ్లకి అడగంగానే ఇస్తారా?
డియర్ Rao S Lakkaraju!
మీ చిన్న సందేహం ధర్మ సందేహమే. అందులో సందేహం లేదు.
మీరడిగింది "యెవరు" అప్పులు ఇచ్చేటప్పుడు? సూ ఋ సంస్థలా? బ్యాంకులా? బంగారం తాకట్టు వ్యాపారులా? ప్రైవేటు వడ్డీ వ్యాపారులా? ఇళ్లదగ్గర చీటీలు వేసేవాళ్ళా?
ఇంతకీ "రామాయణం" పూర్తిగా విన్నారా?
మొదటి నించీ టపాలని శ్రధ్ధగా చదవండి. ఇంకా సందేహాలుంటే, వ్రాయడానికి సందేహించవద్దు. నేనెప్పుడూ సిధ్ధం వాటిని తీర్చడానికి!
ధన్యవాదాలు.
కృష్ణ శ్రీ గారూ నాకు చాల గందరగోళం గ ఉంది. ఎందుకు అప్పులు తీర్చలేక మనుషులు ప్రాణాలు తీసుకుంటున్నారో అర్ధము కావటల్లేదు. బాధ వేస్తుంది. అప్పులు తీసుకోవటం తీర్చటము తీర్చలేక పోవటము ఎప్పటినుండో జరుగుతూనే ఉన్నాయి.
నేను US లో ఉంటాను. అప్పు ఇవ్వాలంటే రూల్స్ ఉన్నాయి. అప్పు తీర్చ్తానికీ రూల్స్ ఉన్నాయి. అప్పు తీర్చక పోతే ఏమి చెయ్యాలి అనే దానికీ రూల్స్ ఉన్నాయి. అన్నీ స్మూత్ గ జరిగిపోతాయి. దీనికి మనుషులు చావాల్సిన గతి ఎందుకు పడుతుందో అర్ధం కావటల్లేదు.
మీరు చెప్పిన రకరకాల అప్పుల వాళ్ళు ఎవరు అప్పు ఇచ్చినా డబ్బు రూపములోనే కదా.డబ్బు అప్పు ఇవ్వటానికి ప్రభుత్వం లైసెన్సు ఇచ్చినప్పుడు, అప్పు తిరిగి ఇవ్వక పోతే నాగరికం గ ఏమిచెయ్యాలో చెప్పలేదా!ఎక్కడో ఏదో లోపం ఉంది. నేను చాలా జనరిక్ గ అడుగుతున్నాను. మీ పోస్టులు మీరు లాజికల్ గ ఆలోచింప చేస్తయ్యి కాబట్టి అడుగుతున్నాను.
నా ప్రశ్నలు మరీ అమాయకము గ ఉంటె వదిలేసేయ్యండి.
డియర్ Rao S Lakkaraju!
మీది నిజంగా చిన్నతనమా, అమాయకత్వమా అర్థం కాలేదు. అప్పు ఇవ్వడానికి 'లైసెన్స్', రూల్సు, తీర్చడానికి రూల్సు, నాగరికంగా యేమిచెయ్యలో......ఇలా......!
ముందు నా 9 టపాలూ చదవండి. ఇంకా మీకు ఇంగ్లీషు వచ్చే వుంటుంది కాబట్టి, "ఆర్థర్ హెయిలీ", "హెరాల్డ్ రాబిన్స్" లాంటివాళ్ల నవలలు చదవండి.
అమెరికాలో "పింక్ స్లిప్పింగ్", "సోషల్ సెక్యూరిటీ" ల గురించి తెలుసుకోండి.
మీరు 'జనరిక్' గా అడిగినా, యెవరైనా అరటి పండు వలిచి చేతిలో పెట్టగలరు గానీ, చెంచాలో పెట్టి, చందమామను చూపిస్తూ తినిపించరు అని తెలుసుకోండి!
Post a Comment