Thursday, October 30

చిన్న మాట.....


నా బ్లాగ్ చదివేవాళ్ళు కొంతమంది నేను ద్రవ్యోల్బణానికి, కాంగీరేసు గవర్నమెంట్ కీ లింకు పెడితే, ఇంకేదో అన్నారు!

ఒక సంగతి మరచి పోకండి! యూఎస్ బ్యాంకులు దివాలా తీయడానికి చాలా ముందే మన ద్రవ్యోల్బణం రెండంకెలని చేరుకుంది!

శ్రీ వై.వి.రెడ్డిగారు యేమీ చెయ్యనివ్వలేదని బాధపడ్డారు!(ట)

శ్రీ దువ్వూరివారు మొట్టమొదట తీసుకోవలసిన చర్యగా బ్యాంకుల సీఆరార్ పెంచుతే, మర్నాడే ఆయనచేత ఆయన పెంచిన 0.5 శాతమే కాకుండా ఇంకో 1 శాతం తగ్గించేలా చేశారు మన విత్త మంత్రి!

అదీ నేను వ్రాసింది! కాదంటారా?

ఇంక సబ్ ప్రైం గురించి నేను వాడిన "రీజనబుల్ అమౌంట్ (ఇన్ దెయిర్ వ్యూ)" అనే మాటల్ని 'దయా ధర్మంగా' అన్వయించుకున్నారు కొందరు!

ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు చెల్లించిన మొత్తాలు, వారి దృష్టిలొ 'రీజనబుల్ ' అని నా వుద్దేశ్యం! అది ఏ విధంగానూ వాటి అసలు విలువకి చాలా తక్కువేనని, దీంతో అవి డబ్బుచేసుకోవాలనే ఆ పని చేశాయని అర్థం! గమనించండి.

Tuesday, October 28

జబ్తక్ రహేగా లాలూ.......

(ఇండియాకి మోక్షం లేదు)

నిన్న (27.10.2008) న్యూస్ క్లిప్పింగ్స్ లో రెచ్చిపోతున్న బీహార్ రైల్వేల మంత్రి లాలూ ప్రసాద్ ని చూశారా?

బీహారీ కుర్రాడు ‘బెస్ట్ ‘ బస్ లో తుపాకి తో వీరంగం వెయ్యడాన్ని ఖండించకపోగా, మహారాష్ట్ర గవర్నమెంటు మీద నిప్పులు చెరుగుతున్నాడు!

నిజానికి శ్రీ రాజ్ ఠాక్రే కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నాడు గాని, అసలు నిప్పు లేకుండా పొగ రాదు కదా?
రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు జరుగుతున్న నగరాలకి బీహార్ నించి ప్రత్యేక రైళ్ళలో యువతని తరలించి మరీ పరీక్షలు రాయించి, వాళ్ళకే రైల్వే ఉద్యోగాలు కట్టబెడుతున్న సంగతి బహిరంగ రహస్యమేకదా!

అన్నట్టు, లాలూగారు రైల్వేలని లాభాల బాట పట్టించిన ‘మేనేజ్మెంట్ గురు ‘ ట!

అసలు రైల్వేలకి నష్టాలెప్పుడొచ్చాయట?

రైళ్ళలొ రిజర్వేషన్ సౌకర్యాలు పెరగడంతో, టిక్కెట్ కొని ప్రయాణించే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఓ ముప్ఫై నించి ఇరవై యేళ్ళ క్రితం, ఇటు వైజాగ్ దాటాక, అటు జబల్పూరు, బలార్షా, అటు నాగపురు ఏ వైపైనా టిక్కెట్లు కొనే వాళ్ళని పిచ్చివాళ్ళ క్రింద చూసేవాళ్ళు—టీటీఈలు. టిక్కెట్ లేనివాళ్ళని ఓ ఐదు రూపాయలు తీసుకొని, (అప్పట్లో 500/- క్రింద లెఖ్ఖ!) వాళ్ళు దిగే స్టేషన్లో గేటు దాకా సాగనంపి, అక్కడ టీటీఈకి (నాకేసు అని) సైగ చేసి, వాళ్ళు భద్రంగా గేటు దాటాకే మళ్ళీ రైలెక్కేవారు!
మరి లాభాలు రావూ?

ఇంకా డీజెల్ బదులు చవగ్గా విద్యుత్ తో నడుస్తున్నాయి రైళ్ళు. చెక్క స్లీపర్ల స్థానం లో హెచ్చు మన్నికగల సిమెంటు స్లీపర్లు వచ్చాయి. కంప్యూటర్లవల్ల కమ్యూనికేషన్లు బాగా వృద్ధి చెంది, సమయపాలన బాగా పెరిగింది. ఇన్ని, ఇంకాకొన్ని కారణాల వల్ల లాభాలు ఎక్కువ వస్తుంటే, లాలూ చేసిందేమిటట?

అయినా, మీడియావాళ్ళు ఈ ‘గురు’ల్ని అనవసరంగా సృష్టిస్తున్నారు! ‘ఫేషన్ గురు’, 'మార్కెటింగ్ గురు’, 'మేనేజ్ మెంట్ గురు’, ఇలాంటివే కాకుందా, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు’ట.

మహాకవి శ్రీ శ్రీ గురించి వెబ్ లో వెతికితే, లక్షా తొంభైఆరు సైట్లు ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు పేరుతోనే వున్నాయి! యేమైనా, ఈ గురుకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ బాగా తెలుసు అని ఒప్పుకోవాలి!

Monday, October 27

నా ఇంకో బ్లాగ్ "ఎ సిటిజన్ అఫ్ ది వర్ల్డ్" లో వచ్చిన ఓ కామెంట్ కి నా సమాధానం ఇక్కడ ప్రచురిస్తున్నాను. చదవండి!

(Copied straight from the blog)

chaitanya said...
Hi... ur interest in banking may have driven you to write such an interesting article on it...now can you explain me the recent crisis in financial market following the lehman break down.... may be da reason is not just subprime mortgages!!
September 22, 2008 10:46 PM

Krishna Sree said...
dear Chaitu!Thank u for ur comment.The prime reason is Sub-Prime Lending itself!Because--what is done in sub-prime lending is--the monies, distributed (lent) by the Banks, through retail lending, could not be recovered by them! So, the investment Banks stepped in and took over the retail loans from the Banks by paying them reasonable (in their view) amounts to the Banks. So, the Banks are safe--but the investment Banks could not realise the mortgages, specifically in case of House mortgage loans due to lack of buyers! Hence the crisis.Added to this, the investment Bankers have invested in futures/derivatives trading carelessly. When the Oil prices began to sky rocket, there is a crisis! So, such trading is a bane to the economy of any country. Who dares to ban such trading?In India also, as I understand, some Banks like ICICI Bank are resorting to sub-prime lending in another way--i.e. lending through other agencies. They are lending large monies to private agencies who in turn are distributing the money through lending to the needy, retailly. Thats why they are in the news!
October 7, 2008 9:23 PM

ఈనాడు పత్రికలో ఇవాళ (27.10.2008) బిజినెస్ పేజీ లో శ్రీ కాట్రగడ్డ కృష్ణ ప్రసాద్ అనే నిపుణుడు 'తెలివైన మదుపరి ఏం చేయాలంటే' అనే శీర్షిక క్రింద ఇచ్చిన ఇంటర్వ్యూ చదవండి!
సబ్ ప్రైం గురించీ, సీడీవోల గురించీ చక్కగా చెప్పారు!
ఇంకా చదవకపోతే, పూర్తిగా చదవండి!
'విదేశీ మదుపరులు...........నిధులను తీసుకు వెళ్ళిపోయినప్పుడు సిసలైన మార్కెట్ ప్రాణం పోసుకొంటుంది.' అన్న సమాధానం గమనించండి! (అంటే వాపు తగ్గుతుందనేగా?)
మొన్న శుక్రవారం సెన్సెక్స్ పడిపోగానే, నాకు తెలిసిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచి మేనేజరు, మామూలు మాటల్లో, 'బాగా తగ్గాయి కదా షేర్లు, ఇప్పుడేవి కొంటే మంచిదంటారు?' అనడిగారు!
నా సమాధానం ఊహించగలరా? 'ఇప్పటివరకూ అందరూ చేతులే కాల్చుకున్నారు! ఇప్పుడు మార్కెట్లో దిగితే, ఒళ్ళూ ఇల్లూ కూడా కాల్చుకుంటారు! అప్పుడే దానిజోలికి వెళ్ళకండి!' అని.
తప్పంటారా? చూద్దాం!

Sunday, October 26

ద్రవ్యోల్బణం

స్థూలంగా చెప్పాలంటే, ద్రవ్యోల్బణం వ్యవస్థలో డబ్బు చలామణి ఎక్కువయితే వస్తుంది.

ఉదాహరణకి---ప్రజల ఆదాయాలు బాగా పెరగడం, లేదా ఖర్చులు తగ్గడం, బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు సరళంగా అప్పులివ్వడం, రిజర్వు బ్యాంకు / ప్రభుత్వం ఎక్కువ నోట్లని ప్రింటుచేయడం----ఇలాంటివి!

మరి మొదటిది ఎప్పుడు సాధ్యం?

1. రైతుకి గిట్టుబాటు ధర దొరుకుతోంది.
2. ఉద్యోగులకి జీతాలు బాగా ముడుతున్నాయి.
3. వర్తకులకి బాగా లాభాలు వస్తున్నాయి.
4. అందరూ కడుపు నిండా తినగా, ఇంకా ఎంతో కొంత డబ్బు మిగలడం.
5. ఫ్రజలందరూ ఏదో ఒక ఉపాధి ద్వారా సంపాదించగలగడం.

ఇంకా ఇలాంటివే---మీకు తోచేవి.

ధరలు తగ్గడం అంటే, ‘ద్రవ్య అనుల్బణం’ (ద్రవ్యోల్బణానికి వ్యతిరేకం)! అంటే, ఓపెన్ మార్కెట్ లో కిలో బియ్యం రూపాయకి దొరకడం లాంటివి!

మరి పైన అనుకొన్న పరిస్థితులేమున్నాయని ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది?

"కష్టపడి (లేదా ఇంకేదో చేసి) కొంత డబ్బంటూ సంపాదిస్తే, తరవాత అదే పిల్లల్ని పెడుతుంది" అనే సిద్ధాంతం బాగా ప్రాచుర్యం పొందడంవల్ల!

అంటే, దేశంలో సంపదంతా ఓ 10 శాతం మంది చేతుల్లోనే వుంది అంటారు. పోనీ, నేను ఓ 20 శాతం మంది అంటాను.

సరే, మరో 30 శాతం మంది ఎగువ మధ్య తరగతికి చెందుతారనుకుందాం. వీరిలో, గత 30 యేళ్ళుగా ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లొ ఎంతొ కొంత వెనకేసుకుని, తమ తరం, తమ పిల్లల తరం సౌకర్యంగా జీవించడానికి ఢోకా లేదు అని నిశ్చింతగా ఉండేవాళ్ళు.

ఇంకో 20 శాతం మంది దిగువ మధ్య తరగతికి చెందుతారు! వీరిలో, చిన్న ఉద్యోగులు, చిన్న రైతులు, కౌలుదార్లు, ఇతర వృత్తులవాళ్ళు, (ఖర్చుకి సరిపడా అదాయం దాదాపు సంపాదించగలిగినవాళ్ళు--నెలాఖర్లో అప్పులు చేసైనా)

ఈ రెండు మధ్యతరగతుల్నే బూర్జువాలు, పెటీ బూర్జువాలు అంటారు కమ్యూనిష్టులు.

ఇక మరో 20-25 శాతం ఱెక్కడితేగాని డొక్కాడని వాళ్ళు. దినసరి కూలీలు, రైతు కూలీలు, చేతి వృత్తుల పనివాళ్ళు, హాకర్లు మొదలైనవాళ్ళు.

మిగిలిన 5-10 శాతం 'పతితులూ, భ్రష్టులూ, బధాసర్పదష్టులూ!' వీరు జనాభా లెక్కల్లో వున్నారన్న సంగతి వాళ్ళతోపాటు అందరూ మరచిపోతూ వుంటారు--ఎలక్షన్లకి కొంతకాలం ముందు వీళ్ళని గుర్తు చేసుకొని మొక్కేవాళ్ళు తప్ప!

పై అన్ని వర్గాల్లోనూ, 50 శాతం స్త్రీలు! ఈమాట మాత్రం మరువకండి!

ద్రవ్యోల్బణంలోకి తరవాత ప్రవేశిద్దాం!
సూచన

భారతీయ బ్యాంకుల పరిస్థితి గురించి ఈనాడు పత్రికలో సంపాదకీయం ప్రక్కన డా.(శ్రీ) పి.ఎస్.ఎం. రావు గారు ఇవాళ (16.10.2008) చక్కగా వ్రాశారు.

చాలామంది చదివే వుంటారు. ఇంకా చదవకపోతే చదవండి!

Friday, October 24

"8701"---ఇంకో 702 చాలు!

చెప్పానా, సంతొషించే వాళ్ళలో మొదటివాడిని నేను అని! (సెన్సెక్స్ పడిపోతే). ఇవాళ్టి ఫిగరు 8701!
ఏదో పద్యం చెప్పావే------అంటున్నారా! వస్తున్నానక్కడకే!
ఓ పీనాసి, తన దగ్గరున్న బంగారాన్నంతా పద్యంలో చెప్పినట్టు ఓ గోతిలో పాతిపెట్టి, రోజుకోసారి వచ్చి చూసుకుంటుండేవాడట! తరవాత విషయం అందరికీ తెలుసు కదా?
కానీ ఈ కేసులో, బంగారం పిల్లల్ని పెట్టదు కదా?

ఇప్పుడు మోడర్న్ పీనాసులు--వాళ్ళ దగ్గరున్న కొద్దో గొప్పో డబ్బుని (కొంతమంది అప్పులు చేసి కూడా!) షేర్లలో పెట్టి, రోజూ సెన్సెక్స్ చూసుకొని, నా 'ఆస్తి ' ఇంత పెరిగింది....అంత పెరిగింది....అని ఆనందిస్తూ వుంటారు!

బిల్ గేట్స్, వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు తమ చెమటోడ్చి సంపాదించిన కాస్తో కూస్తొ డబ్బుతో ఓ కంపెనీ స్థాపించి, అది ఇంతింతై, వటుడింతై పెరుగుతుంటే, ఆనందిస్తూ, ఇంకా ఎక్కువ పెట్టుబడి అవసరమైతే, వాళ్ళ దగ్గర డబ్బు సరిపోక, కంపెనీలో కొంత షేర్ కేపిటల్ పబ్లిక్ ఆఫర్ చేస్తారు! ఆ షేర్లు లిస్టింగ్ అయ్యాక, వాటి విలువ పెరుగుతుంది (మార్కెట్ మాయాజాలం వల్ల--తగ్గినా తగ్గచ్చు!) కానీ, అసలు కంపెనీ పెట్టిన వాళ్ళు కొంత శాతం షేర్లు తమ దగ్గరే వుంచుకున్నారు కదా? వారి సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగినట్లు! (ఫోర్బ్స్ మేగజైన్ లాంటివి ప్రపంచంలో అత్యంత ధనికుడు అని ప్రకటిస్తూ వుంటాయి) కానీ, గోతిలో బంగారానికీ, వీటికీ తేడా యేమి వుంది? ఆ షేర్లు అప్పుడు అమ్మితే కదా--అంత డబ్బు వచ్చేది? అదీ సంగతి!

మరి చిదంబరానికీ నాకూ ఏ కంపెనీలున్నాయని సెన్సెక్స్ పెరిగితే అంత ఆనందం?

వాపుని బలుపుగా చూస్తూ, దేశ ఆర్ధిక వృద్ధి అంతా సెన్సెక్స్ మీదే ఆధారపడింది అనే విత్త మంత్రిని ఏమనాలి? అంత మేధావి అయిన మన ప్రధాని చెయ్యగలిగింది మాత్రం యేముంది? వేరే వుద్దేశ్యాలున్న వాళ్ళది కంట్రోల్!

నేను ముందే చెప్పినట్లు ఈ కాంగీరేసు పరిపాలనలోనే ఎందుకు వస్తున్నాయి.....ఈ దరిద్రాలన్నీ? జనతా పాలనలో, ఎన్.డి.ఏ. పాలనలో, వృద్ధి జరగలేదా? ద్రవ్యోల్బణం అదుపులో లేదా?
ఆలోచించండి!

బై ది బై, శ్రీ శ్రీ శత జయంతి సభల్లో కొన్ని చోట్ల, కొంత మంది ఆయన చెప్పిన కవితలూ, ఆయన ఆలోచనలూ ఇంకా, ఇప్పుడుకూడా వర్తిస్తాయా? అన్నారట! మీ అభిప్రాయం?
మరొకసారి వ్రాస్తా!

Friday, October 17

"I'm a citizen of the World"

"సెన్సె(షనల్)క్స్"

మళ్ళీ ఇవాళ (17-10-2008) కొన్ని వందల పాయింట్లు పడిపోయి, పదివేల దిగువకు వచ్చేసిందండోయ్ సెన్సెక్స్!
విత్తమంత్రిగారు ఇంకా ఏమీ అనలేదు! (వెవ్వెవ్వె!)

నీకంత ఆనందం యేమిటంటారా? చెప్పానుగా, కొన్నేళ్ళ క్రితం నవంబర్లోనో, డిసెంబర్లోనో సెన్సెక్స్ 8000 పాయింట్లు దాటగానే, 'వచ్చే మార్చి నెలాఖర్లోగా 16000 పాయింట్లు దాటి పోవచ్చు ' అని అత్యుత్సాహం ఒలకబోశారుగా విత్త మంత్రి గారు! 'దాని భావమేమి తిరుమలేశా' అని అప్పుడే ఆలోచించాను........ఓపెన్ గా మా కొలీగ్స్ తో చర్చించాను!
ఆ రోజు నించీ, ఈరోజు వరకూ, సెన్సెక్స్ 8000 పాయింట్లకి పడిపోతే సంతొషించే వాళ్ళలో మొదటివాడిని నేను! ఆ అనందం నాకు దక్కుతుంది చూస్తూ వుండండి!

అంటే, నీకిష్టంలేదు కాబట్టి, 'ఇన్వెస్టర్లు ' అనే ప్రజలు నష్టపోవాలా? అని అంటారా! అక్కడికే వస్తున్నాను!

ఎలిమెంట్రీ స్కూల్లోనే, తెలుగువాచకంలో ఓ పద్య పాఠం వుండేది........"ఊరి వెలుపల పాడు కోనేటి చెంత..........." ఎట్సెట్రా! మీలో చాలా మందికి గుర్తొచ్చి ఉండొచ్చు ఈపాటికే! '

'అయితేమాత్రం..........' అంటున్నారా?

వస్తా! నక్కడికే వస్తా!

Thursday, October 16

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనే సందట్లో
సడేమియా!

నిన్నటి పేపర్లో, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ని ఆదుకోడానికి, 'కేంద్రం' సూచనపై, అర్ బీఐ ఓ 20,000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది--అని వార్త! ఆర్థిక వ్యవస్థ లోకి బ్యాంకుల ద్వారా విడుదలైన 65,000 కోట్లు కాకుండా ఇది అధికం అన్నమాట.

నిన్న, స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ మళ్ళీ ఓ 674 పాయింట్లు పడిపోయేసరికి, ఇవాళ (16-10-2008) పేపర్లో--సీఆరార్ 6.5 శాతానికి తగ్గించి, మరో 40,000 కోట్లు బ్యాంకులకి విడుదల చేయడమే కాకుండా, ఋణ మాఫీ ఖాతాలొ, మరో 25,000 కోట్లు వెరశి 1,45,000 కోట్లు ఆర్థిక వ్యవస్థ లోకి విడుదలైనట్లు! ఈనిర్ణయాలతో, గౌ. దువ్వూరి సుబ్బారావు గార్ని ఢిల్లీకి, ముంబాయికి మధ్య పరుగులు పెట్టిస్తున్నారు! మరి ద్రవ్యోల్బణం మాటో? దేవుడెరుగు!

మొన్న, లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ-- క్రింద 14 రోజులకి 9% వార్షిక వడ్డీ కి వేలంపాట నిర్వహిస్తే, కేవలం 4 బిడ్లు, 3,500 కోట్లకి మాత్రమే దాఖలయ్యాయట! అంటే ద్రవ్య లభ్యత లో లోపం లేదు అన్నమాటే కదా?

మరి సమస్య ఎక్కడ?

ఎక్కువ ద్రవ్య నిల్వలున్న సంస్థలు, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకుల వద్ద కొన్ని (పదుల/వందల) కోట్లు ఇచ్చి, 'సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్' (సీ డీ లు) తీసుకుంటాయి! (బ్యాంకులు, వాటి అవసరాలనిబట్టి, అధిక వడ్డీ ఆఫర్ చేస్తాయి!). ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇస్తానంటే, ఆ బ్యాంకులో డిపాజిట్ చేస్తారన్నమాట! ఈ ఫండ్లకి వద్దంటే డబ్బు! ప్రజలదగ్గర ఎక్కువ డబ్బుండటంతొ, మ్యూచువల్ ఫండ్స్ లో, ఇన్సూరెన్స్ స్కీముల క్రింద దబ్బు వచ్చి పడిపోతోంది!
బ్యాంకుల సీ ఆర్ ఆర్ పెరిగినప్పుడు, ఇవి వాటితో, ఓ ఆట ఆడుకుంటాయి! మేమెక్కువ ఇస్తామంటే మేమెక్కువ ఇస్తాం అంటూ బ్యాంకులు వాటి వెంట పడతాయి!

మరి ఎక్కడ వచ్చింది సమస్య? అంటే, ఈ సీ డీ లు 14 రోజులకి జారీ చెయ్యబడతాయి! మధ్యలో కేన్సిలు చెయ్యడం కుదరదు! వాటి మీద అప్పు తీసుకునే సౌకర్యం కూడా లేదు!

కొంచెం వెలుగుతోందా!

ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పతనం అవుతోందో, ఈక్విటీ ఫండ్స్ నించి కొన్ని కోట్ల మంది తొలగిపోదామని చూస్తారు! వారందరికీ డబ్బివ్వడానికి ఫండ్స్ ఎక్కడనించి తెస్తాయి? వాళ్ళ నిధులన్నీ సీ డీ ల్లొ బ్లాక్ అయి వున్నాయి! రెండోరోజున కొన్ని కోట్లు ఇవ్వాలి జనానికి--14 రోజుల దాకా సీడీ దబ్బులు రావు! మరి మ్యూచువల్ ఫండ్స్ చేతులెత్తెయ్యవూ?

అదీ సంగతి! పెళ్ళయితేగాని పిచ్చి కుదరదు! పిచ్చి కుదిరితేగాని పెళ్ళవదు!

సడేమియా గురించి వేరే చెప్పక్కర్లేదు! (చిదంబరంగారికి మొన్ననే ప్రశ్న సంధించాం గదా!)

సామాన్యుడి పాట్లు X ద్రవ్యోల్బణం గురించి తరవాత.......

Tuesday, October 14

"చిదంబర రహస్యం" ఏమిటి?

ఓ రెండు సంవత్సరాల క్రితం అనుకొంటా! బిఎస్ ఈ సెన్సెక్స్ 8000 పాయింట్లకి చేరుకోగానే, 'వచ్చే మార్చి లోపల సెన్సెక్స్ 16000 పాయింట్లు దాటుతుంది!' అని సెలవిచ్చారు అమాత్యులు!

గౌ. శ్రీ వై. వేణు గోపాల రెడ్డి గార్ని రిజర్వు బ్యాంకు గవర్నరుగా వుండగా, ఇన్ ఫ్లేషన్ కి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా చేతులు కట్టేశారని స్వయంగా ఆయనే ఒక అంతర్జాతీయ వేదిక మీద వాపోయారు!

ఇప్పుడు, సీఆరార్ ని 3, 4 రోజుల వ్యవధిలో, ఏకంగా 0.5 + 1.5 అంటే 2% తగ్గించారు! గౌ. దువ్వూరి సుబ్బారావు గార్ని మాట్లాడనివ్వకుండా!

పైగా 'హామీ' ఇస్తున్నారు! మన ఆర్ఠిక వ్యవస్థ పటిష్టంగా వుంది! అని.

దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థలోకి విడుదల అయి పోతాయిట! ఎందుకంటే, స్టాక్ మార్కెట్ నిలదొక్కుకోవటానికట! అంటే, మళ్ళీ హర్షద్ మెహతాలూ, కేతన్ పరేఖ్ లూ మొ.వారు విజృంభించినా ఫరవాలేదు! బ్యంకులు వాళ్ళకి 60,000 కోట్లు అప్పులు ఇచ్చెయ్యవచ్చు! కాని స్టాక్ మర్కెట్ మాత్రం పడిపోకూడదు!

మరి చిదంబర రహస్యం ఏమిటి? (తమకెన్ని కోట్లున్నాయి? మార్కెట్లో? అని అడిగితే తప్పా!)

చెప్పు మిష్టర్ చిదంబరం!

Sunday, October 12

నచ్చే మాటన్నాడు!


తెరాస అధినేత చంద్రశేఖర రావు తెలంగాణ వస్తే మొదటి మూడు నెలలూ సైనిక పాలన విధిస్తానన్నాడు!

ప్రజాస్వామ్య దేశంలోని ఒక రాష్ట్రంలో ఇదెలావీలవుతుంది అని అడగద్దు! కాని, ఇది చాలా మంచిది అని మాత్రం అభినందిద్దాం!

ఇంకేమైనా సందేహాలుంటే దయచేసి చూడండి 'అద్దొయితం.కాం'

Tuesday, October 7

సరదా తిట్టు


మా హైస్కూల్ లో ఒక మాష్టారు వుండేవారు! ఆయనకి కోపం వస్తే ఇలా తిట్టేవారు!

"దొమ్మరి, దూదేకుల, కమ్మరి, కుమ్మరి, మేదరి, మాదిగ, సాలి, కంసాలి, యెట్టి, యానాది, ఈడిగ, పాకీ వెధవా"

ఇంకేవైనా మిగిలి పోయాయా అని మేము అలోచించేవాళ్ళం!

(ఇప్పుడు ఇలాంటివి చేస్తే, కులం పేరుతో దూషిస్తున్నాడంటారు)