Tuesday, October 14

"చిదంబర రహస్యం" ఏమిటి?

ఓ రెండు సంవత్సరాల క్రితం అనుకొంటా! బిఎస్ ఈ సెన్సెక్స్ 8000 పాయింట్లకి చేరుకోగానే, 'వచ్చే మార్చి లోపల సెన్సెక్స్ 16000 పాయింట్లు దాటుతుంది!' అని సెలవిచ్చారు అమాత్యులు!

గౌ. శ్రీ వై. వేణు గోపాల రెడ్డి గార్ని రిజర్వు బ్యాంకు గవర్నరుగా వుండగా, ఇన్ ఫ్లేషన్ కి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా చేతులు కట్టేశారని స్వయంగా ఆయనే ఒక అంతర్జాతీయ వేదిక మీద వాపోయారు!

ఇప్పుడు, సీఆరార్ ని 3, 4 రోజుల వ్యవధిలో, ఏకంగా 0.5 + 1.5 అంటే 2% తగ్గించారు! గౌ. దువ్వూరి సుబ్బారావు గార్ని మాట్లాడనివ్వకుండా!

పైగా 'హామీ' ఇస్తున్నారు! మన ఆర్ఠిక వ్యవస్థ పటిష్టంగా వుంది! అని.

దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థలోకి విడుదల అయి పోతాయిట! ఎందుకంటే, స్టాక్ మార్కెట్ నిలదొక్కుకోవటానికట! అంటే, మళ్ళీ హర్షద్ మెహతాలూ, కేతన్ పరేఖ్ లూ మొ.వారు విజృంభించినా ఫరవాలేదు! బ్యంకులు వాళ్ళకి 60,000 కోట్లు అప్పులు ఇచ్చెయ్యవచ్చు! కాని స్టాక్ మర్కెట్ మాత్రం పడిపోకూడదు!

మరి చిదంబర రహస్యం ఏమిటి? (తమకెన్ని కోట్లున్నాయి? మార్కెట్లో? అని అడిగితే తప్పా!)

చెప్పు మిష్టర్ చిదంబరం!

5 comments:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

మేష్టారు,ఈ బ్యాంకుల,స్టాకుమార్కెట్ల,షేరుబజారుల గుట్లూ,మట్లూ,కనికట్లూ,ఇలాంటి వాటినివిప్పి చెప్పాల్సిన బాధ్యతమీ భుజాల మీద వుంది బ్లాగర్ల తరపున...:)

కొత్త పాళీ said...

కృష్ణాస్రీ గారు, ఇవాళ్ళ మీ బ్లాగు కనబడ్డం చాలా సంతోషం కలిగించింది.
మీ ఇంట్రోలో .. బేంకింగ్ పరిశ్రమలో పడీపోతున్న విలువలు అన్నారు. ఇక్కడ అమెరికాలో కూర్చుని మేమేంటో .. ఆహా భారతీయ బేంకులు కూడా అంతర్జాతీయ స్థాయికి వచ్చేశాయే అనుకుంటున్నాం.
ఈ పడిపోతున్న విలువలు ఎంటో శెలవిస్తే బాగుంటుంది మీ బ్లాగులో

Krishna Sree said...

రాజేంద్రగారూ!

మీ ఆసక్తికి సంతోషం! మీరు నా భుజా (స్కంధాలు అనే పెద్ద మాటెందుకులెండి) ల మీద పెట్టిన బాధ్యతని తప్పకుండా నెఱవేరుస్తాను! బ్లాగర్లందరికీ ఇది నా హామి! నా మిగిలిన బ్లాగులుకూడా చూస్తూ వుండండి.

Krishna Sree said...

కొత్తపాళీ కి మా పాతకలం నచ్చిందంటె.....చాలా సంతొషం!

'సెపితే శానా వుంది! ఇంటే ఎంతో ఉంది!' (అలాగని పాఠకులని ఎంకటసాములని చెయ్యడంలేదు)

తప్పకుండా వివరించడానికి ప్రయత్నిస్తాను! చూస్తూ వుండండి!

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

చూస్తున్నాము సార్,మీ మొత్తం టపాలన్నీ చదివా :)