"సెన్సె(షనల్)క్స్"
మళ్ళీ ఇవాళ (17-10-2008) కొన్ని వందల పాయింట్లు పడిపోయి, పదివేల దిగువకు వచ్చేసిందండోయ్ సెన్సెక్స్!
విత్తమంత్రిగారు ఇంకా ఏమీ అనలేదు! (వెవ్వెవ్వె!)
నీకంత ఆనందం యేమిటంటారా? చెప్పానుగా, కొన్నేళ్ళ క్రితం నవంబర్లోనో, డిసెంబర్లోనో సెన్సెక్స్ 8000 పాయింట్లు దాటగానే, 'వచ్చే మార్చి నెలాఖర్లోగా 16000 పాయింట్లు దాటి పోవచ్చు ' అని అత్యుత్సాహం ఒలకబోశారుగా విత్త మంత్రి గారు! 'దాని భావమేమి తిరుమలేశా' అని అప్పుడే ఆలోచించాను........ఓపెన్ గా మా కొలీగ్స్ తో చర్చించాను!
ఆ రోజు నించీ, ఈరోజు వరకూ, సెన్సెక్స్ 8000 పాయింట్లకి పడిపోతే సంతొషించే వాళ్ళలో మొదటివాడిని నేను! ఆ అనందం నాకు దక్కుతుంది చూస్తూ వుండండి!
అంటే, నీకిష్టంలేదు కాబట్టి, 'ఇన్వెస్టర్లు ' అనే ప్రజలు నష్టపోవాలా? అని అంటారా! అక్కడికే వస్తున్నాను!
ఎలిమెంట్రీ స్కూల్లోనే, తెలుగువాచకంలో ఓ పద్య పాఠం వుండేది........"ఊరి వెలుపల పాడు కోనేటి చెంత..........." ఎట్సెట్రా! మీలో చాలా మందికి గుర్తొచ్చి ఉండొచ్చు ఈపాటికే! '
'అయితేమాత్రం..........' అంటున్నారా?
వస్తా! నక్కడికే వస్తా!
2 comments:
పద్యపాఠం నాక్కొంత గుర్తొచ్చిందండి.
.. ఘొల్లుమని ఏడ్చి అతడు గగ్గోలు పెట్టె ..
గగ్గొలుపెట్టె!! అదేం పెట్టె? అనేవాడు మా చిన్నాన్నొకాయన. :-)
డియర్ రానారె!
ధన్యుణ్ణి. మరి పోలిక సంగతి చెప్పారు కారేం?
Post a Comment