Tuesday, October 7

సరదా తిట్టు


మా హైస్కూల్ లో ఒక మాష్టారు వుండేవారు! ఆయనకి కోపం వస్తే ఇలా తిట్టేవారు!

"దొమ్మరి, దూదేకుల, కమ్మరి, కుమ్మరి, మేదరి, మాదిగ, సాలి, కంసాలి, యెట్టి, యానాది, ఈడిగ, పాకీ వెధవా"

ఇంకేవైనా మిగిలి పోయాయా అని మేము అలోచించేవాళ్ళం!

(ఇప్పుడు ఇలాంటివి చేస్తే, కులం పేరుతో దూషిస్తున్నాడంటారు)

7 comments:

రాధిక said...

:) భలె ..మా మాష్టారు కూడా కొద్దిగా ఇలానె తిట్టేవారు.

Nrahamthulla said...

ఆ కులాల్లో మాష్టారు కులం కూడా ఉందా?

Bolloju Baba said...

i didnt expect this from you sir

Nrahamthulla said...

దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటేలోటా? ఎంతమాత్రం లోటు కాదు. ఒకే రకం ఈకలు గల పక్షులు ఒకేచోట చేరతాయంటారు. ఈ మద్య "పరుపులుకుడతాం" అంటూ కవ్వాను బద్ధ భుజాన వేసుకుని తిరుగుతున్న ఇద్దరు మనుషులు నా కంటబడ్డారు. ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉన్న పరుపు కొనుగోలు ప్రతిపాదన వాళ్ళను, చూడగానే మంజూరయ్యింది. పరుపు కుట్టడం పూర్తయ్యాక మీరు 'దూదేకుల సాయిబులేనా?' అని అడిగాను, "కాదండీ బాబూ,మేముకాపులం మాది ఏలూరు" అని జవాబిచ్చారు.
కులంగాదు, తలంగాదు కురవోళ్ళ పిల్ల దయ్యమై పట్టినట్లు, కాపులు గూడా దూదేకుతున్నారంటే వీళ్ళను, బీసీల్లో ఎందుకు చేర్చగూడదు అనిపించింది.
తురకలు లేని ఊళ్ళో దూదేకుల వాదే ముల్లా అంటుంటారు. దూదేకుల వాళ్ళు కూడా లేని ఊళ్ళో ముల్లాపని ఏమోగానీ దూదేకేపని మాత్రం ఏదో ఒక కులపోళ్ళు నెత్తిన వేసుకొని చేస్తుండటం వల్ల "కులవృత్తి" సిద్దాంతం దెబ్బతిని పోయింది.
టర్కీ(తురక) భాష మాట్లాడే వాళ్ళను పూర్వం తురక వాళ్ళు అని ఉంటారు. కాని ఇప్పుడు ఉర్దూ మాట్లాడే ముస్లిములందరినీ 'తురకోళ్ళు '
అంటున్నారు. సర్వీస్ కమీషన్ పరీక్షల్లో కూడా ఇదే మాట ప్రయోగించారు. దూదేకుల సాయిబుల్నీ, మామూలు సాయిబుల్నీ వేరు చేసి ఇలా రెండు పేర్లుతో పిలుస్తున్నారు. "తురకా దూదేకుల పొత్తులో మురిగీ ముర్దార్" అనే సామెత ఉంది. "కాకర బీకర కాకు జాతారే?" అంటే దూబగుంటకు దూదేకును జాతరే అని ఇద్దరు దూదేకుల వాళ్ళూ సంభాషించుకున్నారట. బావి తవ్వితే భూతం బయట పడ్డట్లు లోతుకు పోయే కొద్దీ కొత్త సంగతులు బయట పడుతున్నాయి.
ఈ మధ్య నన్ను ఆకివీడుకు బదిలీ చేశారు. బదిలీ కాగితం చేతికిస్తూ ఓ సాయిబుగారు నాకు ఉర్దూ రానందుకు చాలాసిగ్గుపడిపోయారు. ఆయన భాషాభిమానం ఎంత గొప్పదంటే ఖురాను ఉర్దూలోనే అవతరించిందట. బావిలోని కప్పకు గానుగ ఎద్దుకూ అవే లోకాలు అన్నట్లు ఉర్దూ పిచ్చి పట్టిన వాళ్ళకు మరో సంగతి తలకెక్కదు.
అలాగే తెలుగు మాట్లాడటం మన ప్రత్యేకత మన సంస్కృతి అంటూ ఉపన్యాసం చేసిన ఒక నూర్భాషా నాయకుణ్ని సంకుచితత్వం వదిలి పెట్టమని హితోపదేశం చేశాను." భాషలు ఆయా ప్రాంతాలకు సంబంధించినవి. అయితే దైవ ధర్మం విశ్వవ్యాప్తమైంది. అన్ని భాషల ద్వారా దైవ ధర్మం వ్యాపించాలి." అంటుండగానే, మరో సాయిబుగారు "ఆకివీడులో మీ కేడర్ వాళ్ళు చాలా మంది ఉన్నారండీ" అన్నారు. "ఇస్లాంలో చేరిన తరువాత అంతా ఒకే కేడర్ అవుతారు. ఇంకా ఎందుకీ భేదాలు?"
అన్నాను. "రంగాహత్యానంతరం జరిగిన దౌర్జన్యకాండలో నువ్వు సాయిబువైతే ఉర్దూలో మాట్లాడు అని దూదేకుల సాయిబుని తన్నారుగదా? మీకు మాకు తేడా లేదా?" అన్నాడాయన.
గూని వీపు నయం కాదు లెమ్మని నేను మౌనం వహించి ఆకివీడు చేరాను. అక్కడ ఇంకో సాయిబుగారు నా వివరాలన్నీ అడిగి " ఈ దూదేకుల వాళ్ళంతా ఒక ముస్లిం తండ్రికి హిందూ తల్లికీ జన్మించిన సంతానమండీ" అన్నాడు. కన్ను కైకలూరులో కాపురం డోకిపర్రులో అన్నట్లయింది నాపని.
ఎంతగా ధర్మ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ రెండు రకాల సాయిబులూ కలిసి పోవటం లేదు. ఏమిటి దుస్థితి అని ఒక స్థానిక ముస్లిం నాయకుడిని అడిగాను". గోంగూరలో చింతకాయ వేసినట్లు, గోకి దురద తెచ్చుకున్నట్లు వీళ్ళతో మాకెందుకండీతంటా? బయటి వాళ్ళకు చెప్పుకోవటం నయం" అన్నాడు. సాయిబుల పిల్లల్ని చేసుకొని వాళ్ళలో కలిసిపోగూడదా ఎందుకీ అదగస్తపు బతుకు అని ఒక దూదేకుల స్రీ వారిని అభ్యర్ధించాను. "అమ్మో ఇంకా ఏమయినా ఉందా? మనం బ్రతకడానికేనా? అడుగడుగనా లధాఫ్, లధాఫ్ అని ఎత్తి పొడవరూ?" అని ఎదురు బెదిరించాడు. గ్రామాల్లో పరిస్థితి ఇలా ఉంది. హైదరాబాదులో తల పండిన పెద్దలు, పట్టణాలలోని ముస్లిం పండితులు ఈ అపోహల్ని అపార్ధాలను దూరం చేయటానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. (అక్కడ కూడా ఇలాగే లేకపోతే)
గీటురాయి 28.6.91

Nrahamthulla said...

ఎన్నిసార్లు క్షమాపణ చెప్పించినా కులంపేరుతో అవమానించటానికి కొత్తగా ఎవరోఒకరు తయారౌతూనే ఉన్నారు.కులాల పేర్లతో తిట్లు అపహాస్యాలు హేళనలు మానవత్వాన్ని మంటగలుపుతాయి కాబట్టి వాటిని ఖండించాల్సిందే.మానవహక్కులు అందరికీ సమానంగా ఉండాలి.బాస రాని సాయిబుల్నికలుపుకునేది ఎవరు?
దూదేకుల సిద్దప్పకి దూదేకను రాదంటే లోటా? ఆయనకి దూదేకటం రాకపోయినా బ్రహ్మం గారి తత్వాలు పాడుకుంటూ బాగానే బ్రతికాడు. తులసి కడుపున దురదగొండిలా పుట్టాడని అతని తల్లితండ్రులు తిట్టి పోశారు. కులం తక్కువ వాడు కూటికి ముందా అని బ్రహ్మంగారి కొడుకులు (కంసాలీలు/విశ్వబ్రహ్మణులు) తన్ని తరిమేశారు. కానీ అతనికి తురకం (ఉర్దూ భాష) రాలేదని ఎవరూ తన్నినట్లు దాఖలా లేదు. కనీసం దాన్నొక లోటుగా కూడా ఎంచలేదు.ఆయన మాత్రం “ముట్టున బుట్టిందీ కులము” అని తెలుగు తత్వాలే పాడాడు.

లింగిపెళ్ళీ మంగి చావుకొచ్చినట్లుంది దూదేకుల వాళ్ళ వ్యవహారం. చక్కగా సాయిబుల పేర్లు పెట్టుకుని సంఘంలోకెళితే, అసలు సిసలు సాయిబు (ఉర్దూ జబర్దస్తీగా మాట్లాడే మహారాజు) ఎదురైనప్పుడల్లా వచ్చీరాని భాషలో నంగినంగిగా మాట్లాడి, వంగి దండంపెట్టి వెళ్ళి పోవాల్సి వస్తోంది.మీరు ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా పోతున్నారని అసలుదాంట్లో (ఉర్దూలో) పసలేదని చప్పడిస్తుంటారు.భాషవేరేగానీ భావమొక్కటేనంటాడు దూదేకులాయన. నీవు ఖానా అంటావు. నేను అన్నం అంటాను అంటాడు.ఇంత మాత్రానికే ఇదైపోవాలా అంటూ ఇదైపోతాడు.

ఇటీవల ‘పింజారీ వెధవ ‘ అనేతిట్టు టీ.వీ. సీరియల్స్ లో సినిమాల్లో విపరీతంగా వినబడుతోంది.బుర్రకధ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన ఇటీవల “పింజారీ” అనే పుస్తకంగా ప్రచురించాడు. పుస్తకం చదివి వెనుకాముందూ తెలుసుకున్న వారు తమ తిట్ల నిఘంటువుని కొద్దిగా సవరించుకొన్నారట. కానీ ఇంకా కన్నూ మిన్నూ కానని దురహంకారంతో కులగజ్జితో భాదపడుతున్న సంభాషణా రచయితలున్నారు. “ఓరీ రజక చక్రవర్తీ” అంటే అంత పెద్ద పేరు మాకెందుకు దొరా? మీకే ఉండనివ్వండి అన్నాడట.అనటం తిరిగి అనిపించుకోవటం మన దేశంలో అనాదిగా ఉంది. “ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం” వచ్చిన తరువాత ఆయా కులాల పేర్లతో వారిని సంభోదించటానికే జంకారు.ఇప్పుడు రెడ్డి, నాయుడు, చౌదరి, రాజు, గుప్తా, శర్మ, గౌడ ల్లాగా వాళ్ళతో పాటూ మాల, మాదిగ అనే తోకల్ని సగౌరవంగా, సమధీటుగా తగిలించుకొని దళితులు ఎదురు తిరిగి నిలబడితే, గుడ్లు మిటకరించి చూస్తున్నారు కానీ ఆతోకలతో పిలవచ్చా పిలవ కూడదా, పిలిస్తే ఎమవుతుందో అనే భయంతో మిన్నకుండా ఉన్నారు. ఒకనాడు అవమాన సూచికగా తిట్టుకు ఆలంబనగా ఉన్న కుల నామం ఈనాడు కబడ్ధార్ అని హెచ్చరించే స్థాయికి ఎదిగింది. రేపు పాదాభివందనం చేయించు కుంటుంది. అలాగే బాసరాని పింజారులు ,లద్దాఫులు క్రుంగిపోవద్దు, నొచ్చుకోవద్దు. వృత్తిని కోల్పోయిన దూదేకుల వాళ్ళెంతో మంది ప్రస్తుతం ఆర్ధికంగా బలహీనులే. కానీ గొప్ప ఆశయాలతో కృషి చేస్తే పదిమందికి వెలుగు చూపే చక్రవర్తులుగా “నూర్ భాషా”లుగా మన్నన పొందుతారు.

Nrahamthulla said...

ఆ మధ్య ఓ కాపులామెను ఇంట్లో పిండి దంచటానికి రమ్మంటే తురకోళ్ళ ఇంట్లో పని చెయ్యనని తిరస్కరించింది. సరే, కూలి పని చేసుకునే ఈ కాపులామె దృష్టిలో తురకసాయిబులు సంపన్నులైనా అంటరాని వాళ్ళు కాబోలులే అనుకొని అవసరం మరొకరి చేత తీర్చుకున్నాం. ఇంకోచోట అప్పటిదాకా సాలీలకు అంట్లుతోమిన ఓ తురకసాయిబులామె మాకు తోమను పొమ్మంది. మేము తక్కువ రకం సాయిబుల మట. మా ఇంట్లో కూలిపని చెయ్యటం తప్పట! ఆయనగారు జిల్లా కలెక్టర్ అయినా సరే వాళ్ళిచ్చే కూలీ నా కొద్దు చాకలోళ్ళ ఇంట్లో అయినా పని చెప్తాను గానీ దూదేకుల వాళ్ళింట్లోపని చెయ్యను అని తెగేసి చెప్పింది. సరే, ఇక చేసేదేముంది? మా పనులు మేమే చేసుకుంటున్నాం. ఉర్దూ రాని దూదేకుల వాళ్ళ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా వుంది.రజక సంఘం అధ్యక్షుడు డాక్టర్ అంజయ్య, చాకలి వాళ్ళు తన ఇంట్లో బట్టలు ఉతకటానికి నిరాకరించారని గతంలో వాపోయిన సంఘటన గుర్తొచ్చింది. ఇది స్వంతకులంలోనే అంతర్గత సమస్య.

పరిస్థితి ఇలా ఉంది. తల పండిన పెద్దలు, పండితులు ఈ అపోహల్ని అపార్ధాలను దూరం చేయటానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.
ఈ మధ్య మా అపార్ట్ మెంట్లోకి ఒక సాయిబుల కుటుంబం చేరింది.మాది పొదిలి అంటూ మంచిగా మా ఆవిడను పరిచయం చేసుకుంది. మాయింటి పేరు నూర్ బాషా అని తెలియగానే ఆవిడ ముఖం రంగు మారి పోయింది.”వాళ్ళు వేరు మేము వేరు ” అని పని గట్టుకొని అందరికీ చెప్పింది.”ఇద్దరూ సాయిబులేగా” అంటే “కాదు మేము తురకసాయిబులం వాళ్ళు దూదేకుల సాయిబులు, వాళ్ళకు ఉర్దూ రాదు మాకు ఉర్దూ వచ్చు, వాళ్ళకు మాకు చాలా తేడా వుంది” అని చెప్పిందట.విశాఖపట్నంలో ఇంత నాగరికత గల ఊళ్ళో ఈనాడు ఈ కుల ఫీలింగ్ ఉండదు అన్న నాభావన కరిగిపోయింది.ఆవిడ కొడుకు ఒక డాక్టర్ .కేరళ క్రిస్టి యన్ నర్సును ఆదర్శ వివాహం చేసుకొన్నాడు.ఆయనకు లేని కులం పట్టింపు ఈమెకుంది.పక్క అపార్ట్ మెంట్ లోని సాయిబులామె అప్యాయంగా కలుపుకొమె పలకరిస్తుంటే ,ఈమె కులం కోసం బిగుసుకు పోతుందేమిటీ? ఈమెకేమయ్యిందీ?అనుకునేవాళ్ళం.
కొన్ని రోజుల క్రితం చీరాల నుండి మా చుట్టాల్లో ఒకామె వచ్చింది.ఇద్దరూ చాలా సేపు ఆప్యాయంగా ఉర్దూలో మాట్లాడుకున్నారు.చివరికి మా చుట్టం “పొదిలావిడ మన కులమే .ఆవిడ మాకు చుట్టం” అని తేల్చింది.
అరెరే, మాకులం దానివై వుండీ,క్రిస్టియన్ కోడలిని పెట్టుకొనీ ,తురక సాయిబులమంటూ ఎంత పోజు కొట్టావే ముసలమ్మా అనుకొన్నాం.ఈ చేదు అనుభవాలను చాలా మంది ఎదుర్కొని ఉంటారు. నేటికీ సమాజంలో కొనసాగుతున్న ఈ రుగ్మతల పట్ల సంఘ సంస్కర్తలు శ్రద్ధ చూపడం అవసరం.

Nrahamthulla said...

సామెతల్లో కూడా మూఢనమ్మకాలు,వివక్ష,అవహేళన ఉన్నాయి

ఆకాలంలో చెల్లాయిగానీ ఈనాడు ఏవిధంగానూ సమర్ధించలేని సామెతలివిగో:

* నల్లబ్రామ్మడినీ ఎర్రకోమటినీ నమ్మకూడదు
* ముందువెళ్ళే ముతరాచవాడినీ ప్రక్కన బోయే పట్రాతి వాడినీ నమ్మరాదు
* ముందుపోయే ముతరాచవాడినీ వెనుకవచ్చే ఈడిగ వాడినీ నమ్మరాదు
* నీ కూడు నిన్నుతిననిస్తే నేను కమ్మనెలా ఔతాను?
* తుమ్మనీ కమ్మనీ నమ్మరాదు
* రెడ్లున్నఊరిలో రేచులున్న కొండలో ఏమీ బ్రతకవు
* నరంలాంటివాడికి జ్వరం వస్తే చెయ్యి చూచినవాడు బ్రతకడు
* తురకల్లో మంచివాడెవరంటే తల్లికడుపులో ఉన్నవాడు గోరీలో ఉన్నవాడు
* మాలవానిమాట నీళ్ళమూట
* చాకలి అత్త మంగలి మామ కొడుకు సాలోడైతేనేమి సాతానోడైతేనేమి?
* విధవముండకు విరజాజి దండలేల?
* కాశీలో కాసుకొక లంజ
* నంబీ నా పెళ్ళికి ఎదురురాకు
* నియోగి ముష్టికి బనారసు సంచా?
* మాలదాన్ని ఎంగటమ్మా అంటే మదురెక్కి దొడ్డికి కూర్చుందట
* కులం తక్కువ వాడు కూటికి ముందు
* చాకలిదాని అందానికి సన్యాసులు గుద్దుకు చచ్చారు
* మాలలకు మంచాలు బాపలకు పీటలా?
* మాలబంటుకు ఇంకొక కూలిబంటా?
* ఉల్లిపాయంత బలిజ ఉంటే ఊరంతా చెడుస్తాడు