Tuesday, October 28

జబ్తక్ రహేగా లాలూ.......

(ఇండియాకి మోక్షం లేదు)

నిన్న (27.10.2008) న్యూస్ క్లిప్పింగ్స్ లో రెచ్చిపోతున్న బీహార్ రైల్వేల మంత్రి లాలూ ప్రసాద్ ని చూశారా?

బీహారీ కుర్రాడు ‘బెస్ట్ ‘ బస్ లో తుపాకి తో వీరంగం వెయ్యడాన్ని ఖండించకపోగా, మహారాష్ట్ర గవర్నమెంటు మీద నిప్పులు చెరుగుతున్నాడు!

నిజానికి శ్రీ రాజ్ ఠాక్రే కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నాడు గాని, అసలు నిప్పు లేకుండా పొగ రాదు కదా?
రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు జరుగుతున్న నగరాలకి బీహార్ నించి ప్రత్యేక రైళ్ళలో యువతని తరలించి మరీ పరీక్షలు రాయించి, వాళ్ళకే రైల్వే ఉద్యోగాలు కట్టబెడుతున్న సంగతి బహిరంగ రహస్యమేకదా!

అన్నట్టు, లాలూగారు రైల్వేలని లాభాల బాట పట్టించిన ‘మేనేజ్మెంట్ గురు ‘ ట!

అసలు రైల్వేలకి నష్టాలెప్పుడొచ్చాయట?

రైళ్ళలొ రిజర్వేషన్ సౌకర్యాలు పెరగడంతో, టిక్కెట్ కొని ప్రయాణించే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఓ ముప్ఫై నించి ఇరవై యేళ్ళ క్రితం, ఇటు వైజాగ్ దాటాక, అటు జబల్పూరు, బలార్షా, అటు నాగపురు ఏ వైపైనా టిక్కెట్లు కొనే వాళ్ళని పిచ్చివాళ్ళ క్రింద చూసేవాళ్ళు—టీటీఈలు. టిక్కెట్ లేనివాళ్ళని ఓ ఐదు రూపాయలు తీసుకొని, (అప్పట్లో 500/- క్రింద లెఖ్ఖ!) వాళ్ళు దిగే స్టేషన్లో గేటు దాకా సాగనంపి, అక్కడ టీటీఈకి (నాకేసు అని) సైగ చేసి, వాళ్ళు భద్రంగా గేటు దాటాకే మళ్ళీ రైలెక్కేవారు!
మరి లాభాలు రావూ?

ఇంకా డీజెల్ బదులు చవగ్గా విద్యుత్ తో నడుస్తున్నాయి రైళ్ళు. చెక్క స్లీపర్ల స్థానం లో హెచ్చు మన్నికగల సిమెంటు స్లీపర్లు వచ్చాయి. కంప్యూటర్లవల్ల కమ్యూనికేషన్లు బాగా వృద్ధి చెంది, సమయపాలన బాగా పెరిగింది. ఇన్ని, ఇంకాకొన్ని కారణాల వల్ల లాభాలు ఎక్కువ వస్తుంటే, లాలూ చేసిందేమిటట?

అయినా, మీడియావాళ్ళు ఈ ‘గురు’ల్ని అనవసరంగా సృష్టిస్తున్నారు! ‘ఫేషన్ గురు’, 'మార్కెటింగ్ గురు’, 'మేనేజ్ మెంట్ గురు’, ఇలాంటివే కాకుందా, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు’ట.

మహాకవి శ్రీ శ్రీ గురించి వెబ్ లో వెతికితే, లక్షా తొంభైఆరు సైట్లు ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు పేరుతోనే వున్నాయి! యేమైనా, ఈ గురుకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ బాగా తెలుసు అని ఒప్పుకోవాలి!

1 comment:

A K Sastry said...

http://”Osaamaa....”.blogspot.com/
http://teluguradical.blogspot.com/
http://krishnasree.blogspot.com
http://yekesa.blogspot.com
http://ammanamanchi.blogspot.com/
http://amkrisas.blogspot.com/
http://krishnaagovindaa.blogspot.com/