Sunday, October 26

ద్రవ్యోల్బణం

స్థూలంగా చెప్పాలంటే, ద్రవ్యోల్బణం వ్యవస్థలో డబ్బు చలామణి ఎక్కువయితే వస్తుంది.

ఉదాహరణకి---ప్రజల ఆదాయాలు బాగా పెరగడం, లేదా ఖర్చులు తగ్గడం, బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు సరళంగా అప్పులివ్వడం, రిజర్వు బ్యాంకు / ప్రభుత్వం ఎక్కువ నోట్లని ప్రింటుచేయడం----ఇలాంటివి!

మరి మొదటిది ఎప్పుడు సాధ్యం?

1. రైతుకి గిట్టుబాటు ధర దొరుకుతోంది.
2. ఉద్యోగులకి జీతాలు బాగా ముడుతున్నాయి.
3. వర్తకులకి బాగా లాభాలు వస్తున్నాయి.
4. అందరూ కడుపు నిండా తినగా, ఇంకా ఎంతో కొంత డబ్బు మిగలడం.
5. ఫ్రజలందరూ ఏదో ఒక ఉపాధి ద్వారా సంపాదించగలగడం.

ఇంకా ఇలాంటివే---మీకు తోచేవి.

ధరలు తగ్గడం అంటే, ‘ద్రవ్య అనుల్బణం’ (ద్రవ్యోల్బణానికి వ్యతిరేకం)! అంటే, ఓపెన్ మార్కెట్ లో కిలో బియ్యం రూపాయకి దొరకడం లాంటివి!

మరి పైన అనుకొన్న పరిస్థితులేమున్నాయని ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది?

"కష్టపడి (లేదా ఇంకేదో చేసి) కొంత డబ్బంటూ సంపాదిస్తే, తరవాత అదే పిల్లల్ని పెడుతుంది" అనే సిద్ధాంతం బాగా ప్రాచుర్యం పొందడంవల్ల!

అంటే, దేశంలో సంపదంతా ఓ 10 శాతం మంది చేతుల్లోనే వుంది అంటారు. పోనీ, నేను ఓ 20 శాతం మంది అంటాను.

సరే, మరో 30 శాతం మంది ఎగువ మధ్య తరగతికి చెందుతారనుకుందాం. వీరిలో, గత 30 యేళ్ళుగా ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లొ ఎంతొ కొంత వెనకేసుకుని, తమ తరం, తమ పిల్లల తరం సౌకర్యంగా జీవించడానికి ఢోకా లేదు అని నిశ్చింతగా ఉండేవాళ్ళు.

ఇంకో 20 శాతం మంది దిగువ మధ్య తరగతికి చెందుతారు! వీరిలో, చిన్న ఉద్యోగులు, చిన్న రైతులు, కౌలుదార్లు, ఇతర వృత్తులవాళ్ళు, (ఖర్చుకి సరిపడా అదాయం దాదాపు సంపాదించగలిగినవాళ్ళు--నెలాఖర్లో అప్పులు చేసైనా)

ఈ రెండు మధ్యతరగతుల్నే బూర్జువాలు, పెటీ బూర్జువాలు అంటారు కమ్యూనిష్టులు.

ఇక మరో 20-25 శాతం ఱెక్కడితేగాని డొక్కాడని వాళ్ళు. దినసరి కూలీలు, రైతు కూలీలు, చేతి వృత్తుల పనివాళ్ళు, హాకర్లు మొదలైనవాళ్ళు.

మిగిలిన 5-10 శాతం 'పతితులూ, భ్రష్టులూ, బధాసర్పదష్టులూ!' వీరు జనాభా లెక్కల్లో వున్నారన్న సంగతి వాళ్ళతోపాటు అందరూ మరచిపోతూ వుంటారు--ఎలక్షన్లకి కొంతకాలం ముందు వీళ్ళని గుర్తు చేసుకొని మొక్కేవాళ్ళు తప్ప!

పై అన్ని వర్గాల్లోనూ, 50 శాతం స్త్రీలు! ఈమాట మాత్రం మరువకండి!

ద్రవ్యోల్బణంలోకి తరవాత ప్రవేశిద్దాం!

4 comments:

Unknown said...

కృష్ణశ్రీ గారు,

మీ బ్యాంకు అనుభవంతో ఇలాంటి విషయలు మరిన్ని తెలియజేయాలని కోరుకుంటాను.

అరిపిరాల
http://palakabalapam.blogspot.com

A K Sastry said...

డియర్ సత్యప్రసాద్!

నా ప్రయత్నం అదే! థాంక్యూ!

Anonymous said...

మీరు మిగతా వాళ్ళలా మూసలో పోసినట్లుగా వ్రాయటంలేదు. Go on...

A K Sastry said...

Thank you Sravan!