......ఈ వీ ఎం లూ
మన చంద్రబాబునాయుడుని వెర్రిబాబు నాయుడుని చేసేస్తున్నారందరూ.
హైటెక్ ముఖ్యమంత్రిగా పేరొందిన ఆయనకే ఈ వీ ఎం ల విషయం లో అన్ని సందేహాలుంటే......అంటూ పెదవి విరుస్తున్నారు.
దానికి తగ్గట్టు, ఆయన సంప్రదించిన "మేతావులు" ఈ వీ ఎం లకి ప్రింటర్లని అనుసంథానిస్తే, వోటు వెయ్యగానే, ప్రింట్ అవుట్ వస్తుంది, అలా చెయ్యమని చెపితే, మన యెలక్షన్ కమిషన్ వారు 'అందుకభ్భెంతరమేటుందీ? మా కమిటీల్నీ, నిపుణుల్నీ దీనిమీదికి తోలుతాం!' అన్నారట.
ఇక్కడ విషయాలేమిటంటే--
1. మన ప్రింటర్లు యెంతబాగా పని చేస్తున్నాయో యే కంప్యూటర్ సెంటర్ వాడినడిగినా చెపుతారు. మనం యే రైల్వే టిక్కెట్టో ప్రింటు కావాలని వెళితే, "ఇప్పుడే పాడయ్యిందండీ! ప్రింటు సరిగ్గా రావడం లేదు. సర్వీసు వాళ్లకి ఫోను చేశాం. రేపొస్తానన్నారు" అంటారు.
2. బ్యాంకుల్లోనూ అక్కడా, పాస్ బుక్ ప్రింటర్లకీ, ఇతర ప్రింటర్లకీ వచ్చే జాడ్యాలకి మందు వెయ్యడానికి ఆ సర్వీస్ వాళ్లు రాక తలలు మొత్తుకుంటున్నారు.
3. సరే--ప్రింట్ అవుట్ వచ్చింది--దాన్నేమి చెయ్యలి? వోటువేసిన వాడు చింపి, మడిచి, జేబులో పెట్టుకొని--హమ్మయ్య, నా వోటు చక్కగా రికార్డు అయ్యింది--అనుకొంటూ బయటికి వెళ్లిపోవాలా? అలా సరి చూసుకోగల వోటర్లు యెంత శాతం?
పీ సీ వో ల్లో ఎస్ టీ డీ మాట్లాడి, డబ్బులిచ్చి, వాడిచ్చిన కాగితమ్ముక్కని పట్టుకొని బయటికి వచ్చి, 'బిల్లెంతయ్యిందో చూడండి ' అని ఓ పది మందిని అడిగి, 29 రూపాయల 24 పైసలు అని అందరూ చెప్పగానే, "ముఫ్ఫై రూపాయలు దొబ్బేశాడు....నా...ంల్లిగాడు" అని గోల చేసేవాళ్ళని యెందర్ని చూడడం లేదు మనం?
4. వాళ్లు ఆ ప్రింట్ అవుట్ ని తీసుకోవడం తెలియకో, మరిచో, బయటికి వచ్చేస్తూంటే, ఆ బూత్ లోని ప్రభుత్వోద్యోగో, యేజంటో వాళ్లకి నేర్పించడానికి లోపలకి వెళ్లి, ఆ ముక్క చింపి, వాళ్ల జేబుల్లో పెట్టే ముందర దాన్ని ఓ లుక్కెయ్యకుండా వుంటాడా?
5. ఇవేమీ జరగలేదు....ముగ్గురో, నలుగురో ప్రింట్ అవుట్లు తీసుకోకుండా వెళ్లిపోయారు....ఐదోవాడిగా నాలాంటి వాడొచ్చాడు....మొత్తం ప్రింట్ అవుట్ ని తీసుకెళ్లి, బయట--నా ముందు వోటు చేసిన నలుగురూ "ఫలానా పార్టీలకి" వోటు వేశారు....లం కొ లని తన్నండి--అంటే?
6. ఇలాంటి "సీక్రెసీ చెడిపోతుంది కదా?" అనే ప్రశ్నలకి, "జన విఙ్ఞాన వేదిక" మేతావులు మళ్లీ ఛానళ్లలోకి వచ్చేశారు--వీళ్లేమంటున్నారంటే, "వోటు వెయ్యగానే, ప్రింట్ అవుట్ వచ్చేసి, ఆటోమేటిక్ గా చింపబడి, బ్యాలట్ బాక్స్ లో పడి పోతుంది. కాబట్టి సీక్రసీకి యే లోపం రాదు!" అని.
ఇలాంటి ప్రత్యేక ప్రింటర్లని గురించీ, ప్రత్యేక బ్యాలెట్ బాక్స్ ల గురించీ ప్రపంచం లో యెవరైనా, యే "మేతావు" అయినా వూహించారా, కనిపెట్టారా, వుపయోగించారా? (కలలు కనండి--వాటిని సార్థకం చేసుకోడానికి ప్రయత్నించండి!)
2012 కో, 2015 కో "పేపర్ లెస్ బ్యాంకింగ్" "చెక్ లెస్ బ్యాంకింగ్" అంటూ "విజన్" లు ప్రకటిస్తున్నవాళ్లు ఇలాంటివాటిని గురించి ఆలోచించరేమో--వాళ్ల మెదళ్లు మోకాళ్లలో వుంటాయి కదా!!!???
ఇది అసాధ్యమని నాలాంటి వాళ్లకి తెలుసు--యెందుకంటే, బ్యాంకు మేనేజర్లు తమ పై అధికారులకి పంపించే నివేదికలూ వగైరాలు "సత్యమేనని" వాళ్ల సంతకాలూ, సీళ్లూ, వ్రేలిముద్రలూ, కాలి ముద్రలూ, ఆడిటర్ సంతకాలూ, సీళ్లూ, వ్రేలి ముద్రలూ, కాలి ముద్రలూ--లేకుండా యెవరూ స్వీకరించరు! యేమో యే పుట్టలో యే పాము (స్కాము) వుందో!
మేతావులూ! మీకు జోహార్లు!
22 comments:
> 5
జరగబోయేది అదేనేమో?
1.Printout vacheddaaka prati Voter aagite , inka enta saatam voting namodu avutundo :D, ipudunna voting percentage sagaaniki padi pothayi.
2.Ila chesthe Election vaarotsavaalu jarapaalemo
3.Printer and Printing paper karchu kooda prajalaku adanapu bhaaram. Intha chEsi final gaa vupayogam Soonyam.
Idi amalu loki raadani nenu kooda poorthigaa raadani nammuthunnaanu
డియర్ పానీపూరి123!
"....అదేనేమో" అంటే--తన్నడమూ, తన్నించుకోవడమేనా?
నేను సాధారణం గా రాత్రి వేళ ఇంతసేపు బ్లాగింగ్ చెయ్యను....కానీ, ఇవాళ నాకు మా బ్యాంకు నించి రావలసిన 24 లక్షల పైగా నా సొమ్ముగురించి నా ముఖ్య స్నేహితుడొకడు 10-30 కల్లా సమాచారం ఇస్తానన్నాడు--ఫోనూ లేదు, ఆన్ లైన్ లోనూ రాలేదు, చాట్ లేదూ వల్లకాడూ లేదు--కొంచెం మనస్తాపంతో వుండి, సేద తీరడానికి ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. (నేనే వాడికి ఫోను చేద్దామన్నా, వయసులో నాకన్నా చిన్నవాడయినా, మా యూనియన్ కి ప్రెసిడెంట్ గా పని చేసినవాడు, బ్యాంకులో కూడా నాకన్నా వున్నత పదవిలో వున్నవాడు--మర్యాదగా వుండదుకదా?) అందుకే మీ వ్యాఖ్యకి వెంటనే జవాబు ఇచ్చేశాను!
సంతోషం. ధన్యవాదాలు.
డియర్ abhedyudu!
జనవిఙ్ఞాన వేదికవాళ్లు సెకన్లో యెన్నో లక్షలో వంతు కూడా పట్టదంటున్నారు!
ఇప్పటికే యెలక్షన్ వారోత్సవాల్ని దాటి, పక్షోత్సవాల్లాఓకి వెళ్లిపోతున్నాం. రేపు జరగబోయే బీహార్ యెన్నికలే వుదాహరణ.
బ్యాలెట్ పేపర్లూ, వగైరా ఖర్చుల పొదుపు నిమిత్తమే కదా ఈ వీ ఎం లు తెచ్చింది? వుపయోగం శూన్యమేనని అందరూ వొప్పుకోవాలి మరి!
మన నమ్మకాలెలా వున్నా, జరిగేది కాక మనదు కదా!
ప్రింట్ రిసీట్ల వల్ల లాభం లేకపోవడం ఏమిటీ, చాలా వుంది. కాకపోతే చిన్న సవరణ చెయ్యాలి. రిసీటును మళ్ళీ బాక్సులో వెయ్యకుండా ఎవరిది వాళ్ళు తీసుకుపోగలగాలి. అప్పుడు ఎన్నికల్లో ధనప్రవాహం, మందు ప్రవాహం తగ్గుతాయి. ఎందుకంటే రిసీట్ చూపిస్తేనే డబ్బులో, మందో ఇస్తామని నాయకులంటారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ముందు ఆ ప్రభావాలు వుండవు. ఎన్నికల తరువాత సంగతి అంటారా? అప్పుడు రిజల్ట్ రానీ అంటారు. రిజల్ట్ వచ్చాక ఓడిపోయిన వాడు ఎలాగూ దివాళా తీసివుంటాడు కాబట్టి డబ్బులు ఇవ్వడు. గెలిచినవాడిని డబ్బులడిగే ధైర్యం ఓటరుకి వుండదు.
ఈవీయంల కాంట్రాక్టులు దాదాపు అయిపోయినాయి, కొత్తగా ఎలా దోచుకోవాలా అని ఆలోచిస్తుంటే ఈ మహత్తర ఆలోచన వచ్చుంటుంది!
@ Sarat ji,
:)))
ఈ వీ యం ల గురించి ఇచ్చిన విశ్లేషణ సూపర్.
I don't see anything wrong in that suggestion by CBN. Your examples are exaggerated & funny.
Mr. Anonymous,
We can change the code like print out will come according to the button pressed on EVM ut vote can bepolled to particular party (currently accused by your CBN ) is n't it?
If you say wrong just give me 5 mins of time. I will change the according to this.
@saratji,
I think your point is valid :)
Mr. Anonymous,
We can change the code like print out will come according to the button pressed on EVM but vote can bepolled to particular party (currently accused by your CBN ) is n't it?
If you say wrong just give me 5 mins of time. I will change the according to this.
A 6 months old boy urgently needs A-ve blood for heart surgery at CARE hospital, Banzara hills on this friday...Please reach his father Mohammad on 9676232625... dear friends pls reshare this post and save his life
డియర్ శరత్ 'కాలమ్'!
"లైటర్ వెయిన్" లో వ్రాసినా మీ వ్యాఖ్య బాగానే వుంది....సీక్రెసీ గురించి పట్టించుకోకపోతే!
ధన్యవాదాలు.
డియర్ JB - జేబి!
అదీ మన రా నా లూ, మీడియా వాళ్లే చెపుతున్నారు......ఈ కాంట్రాక్టుకి త్వరలో పదేళ్లూ నిండి పోతాయికాబట్టి, ఇప్పుడు ఈ ప్రింటర్లతో సరిపెట్టుకుంటే, కొత్త కాంట్రాక్టులో మరింత సౌలభ్యమైన యేర్పాట్లు చేయించుకోవచ్చని!
వీళ్ల కళ్లకి వోటర్లు యెలా కనిపిస్తున్నారో?
డియర్ Lakshmi P.!
సంతోషం.
ధన్యవాదాలు.
డియర్ Veeru!
నాకర్థం కాలా!
అయినా ధన్యవాదాలు.
ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన ఐడియా ఏంటి అంటే వోటింగ్ మెషిన్ కి ప్రింటర్ ని అనుసంధానించటం.
ఎందుకంటే, ఎలెక్షన్ కమీషన్ వాళ్ళు ఎవరికైతే వోటింగ్ మెషిన్ మీద అనుమానం ఉందో, వాళ్లకి వోటింగ్ మెషిన్ ఇచ్చి చెక్ చేసుకోమని చెప్పాలి. అలా చెయ్యలేదు. అంతే కాదు, వోటింగ్ మెషిన్ లోపం ఉంది అని చెప్పిన ఒక ఇంజనీర్ ని తీసుకెళ్ళి బొక్కలో వేసింది. అంటే దాని అర్ధం ఏమిటీ? "మా వోటింగ్ మెషిన్ బొక్కలు ఉండొచ్చు. మీరు మాత్రం దానిని పబ్లిక్ చెయ్యొద్దు. ఒక వేళ చేస్తే, మీకు ఈ ఇంజనీర్ కి పట్టిన గతే పడుతుంది." అనే కదా?
ఇంత జరిగినా, వోటింగ్ మెషిన్ టాంపరింగ్ చెయ్యలేరని నేను నమ్ముతున్నాను, వోటింగ్ మెషిన్ నే సపోర్ట్ చేస్తున్నాను. కాని ఎలక్షన్లలో ఎన్నో కోట్లు పెట్టె, అభ్యర్ధి నాలాగా నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళని నమ్మకం కలిగించేటం ఎలక్షన్ కమీషన్ భాద్యత.
ఇక ప్రింటర్ల కర్తవ్యం ఏమిటంటే నమ్మకం కలిగించటం. ఎలా అంటే, వోటు వేసిన ప్రతి అభ్యర్ధి, తన పేపర్ ని ఇంకొక బాక్స్ లో వేస్తాడు.
ఎలక్షన్ ఫలితాలు వచ్చినప్పుడు, ఎలక్షన్లో నిలబడిన అభ్యర్ధికి తను అనుకున్న దాని కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి అనిపించినపుడు, ప్రింటర్ పని చేసిన ఏదో ఒక పోలింగ్ బూత్ ఎంచుకొని, బ్యాలెట్ పేపర్ ఓట్లు, ఈ వీ ఎం ఓట్లు సరిచూసుకొని, తన అనుమానం తీర్చుకుంటాడు.
డియర్ Rajesh T!
మీకు 'ఈ మధ్యకాలంలో' ఈ ఐడియా వచ్చిందేమోగానీ, చాలామందికి కొన్ని నెలలక్రితమే వచ్చింది కాబట్టే--ఈ టపా!
".....యెవరికైతే....అనుమానం....." చెప్పడమేకాదు, చేసి చూపించారు ఎలక్షన్ కమీషన్ వాళ్లు--జ వి వే వాళ్లు కూడా మాట్లాడలేకపోయారు!
"....ఇంజనీర్ ని....బొక్కలో వేసింది....." ఈ వీ ఎం ని "దొంగిలించి" తన యింట్లో కొన్ని రోజులో, వారాలో, నెలలో వుంచుకొని, దాన్నేదేదో చేసేసి, "ఇది సరిగ్గా పని చెయ్యడం లేదు" అన్నందుకు!
యెలక్షన్లలో యెన్నో "కోట్లు" ఖర్చుపెట్టాల్సిన అవసరం అభ్యర్థులకి యెందుకు వుంది? వాళ్లకి యెవరు నమ్మకం కలిగించాలి? యెందుకు? (మా వేదాంతం వెంకట సుబ్బయ్య గారి గురించి మీరడిగితే, ఓ టపా వ్రాస్తాను).
".....యేదో ఒక బూత్....." తో అనుమానం తీరిపోతుందా? అలా అయితే ఇన్ని డొంకలు పట్టుకొని యేడవడం యెందుకు?
వేద వ్యాసుడు, వాల్మీకి మొదలుగా మన "ద్రష్టల" మెదళ్లతో పోలిస్తే, మనవి "చికెన్ బ్రెయిన్లు" అంత సైజువి కూడా కాదు! అయినా, ఆ బ్రెయిన్లతోనే మనందరం ఆలోచించి, నిర్ణయాలు తీసుకొంటున్నాం! అవి సరైన నిర్ణయాల కాదా--అనేది "కాలమే" నిర్ణయిస్తుంది!
ధన్యవాదాలు.
ఈ న్యూస్ చూడండి.
http://www.thehindu.com/news/national/article843318.ece
ఇది కూడా చూడండి.
http://www.eff.org/press/archives/2010/10/19
డియర్ Rajesh T!
ఇలాంటివి చాలామందికన్నా ముందే చూస్తాను. పట్టించుకోను--యెందుకంటే వీటివల్ల యెవరికీ యే వుపయోగమూ లేదు అని నా అభిప్రాయం. కాసేపు వార్తల్లో మెరిసి, మరుగునపడిపోతాయి. అంతే!
Post a Comment