Tuesday, August 11

మాయగాడి మరో మోసం

‘కోలా కృష్ణమోహనరావు’
—యూరో లాటరీ తగిలిందని నమ్మించి, కొంతమందిని కోట్లలో ముంచి ఇంకా పదేళ్ళు కూడా కాలేదేమో!
వాడి కేరేక్టరుతో సినిమాలు కూడా తీశారు! చట్టం వాడినేమీ చెయ్యలేకపోయిందని గుర్తు.

అప్పటిలో వాడు సంపాదించినదానితోనే యేమో, ఇథియోపియా లో 120 యెకరాల ప్రభుత్వ భూముల్ని కొని, గులాబీ తోటలు పెంచుతున్నాడట!

ఇప్పుడు మళ్ళీ ‘ఇథియోపియా లో వుద్యోగాలు’ పేరుతో తన www.srisaiflora.com ద్వారా ఓ 65 మంది నిరుద్యోగుల నించి దాదాపు ఒకటిన్నర కోట్లు వసూలు చేసి, వాళ్ళని ముంచాడట! (పాపం నిరుద్యోగులు మరి!)

ఓ పది మంది బాధితులు వీడ్ని ఎల్బీనగర్ చౌరస్తాలో పట్టుకొని, పోలీసులకప్పగిస్తే, వీరు ‘విచారించి’, ఎస్ ఆర్ నగర్ పోలీసులకప్పగిస్తాం, వారూ ‘విచారిస్తారు’ అంటున్నారట!

ఈ వరస చూస్తుంటే, ఈ సారి కూడా వాడికేమీ అవదు అనిపించట్లేదూ?

‘తోటకూర నాడే’ వాడి కాళ్ళు విరగ్గొట్టి వుంటే, ఇప్పుడు తీరిగ్గా ‘విచారించ’ వలసిన అవసరం తప్పేది కదా?

అయినా ఇప్పటికీ ‘బంగారం మెరుగు పెడతాం’ అంటూ వచ్చే అపరిచితులకి ఇంట్లో బంగారం అంతా అప్పచెప్పి, తరవాత లబో దిబో మంటున్న ఆడ మళయాళం వున్నారంటే, యేమనుకోవాలి!

అదంతే!

2 comments:

Indian Minerva said...

ఓ పది మంది బాధితులు వీడ్ని ఎల్బీనగర్ చౌరస్తాలో పట్టుకొని, "పోలీసులకప్పగిస్తే"

ఈ పని ఆ నిరుద్యోగులు వేరే గత్యంతరం లేక చేసుంటారు లేదంటే వాళ్ళకన్నా బడుధ్ధాయిలు వుండరు.

అసలు మరణ శిక్షలనేవి ఇలాంటి వాళ్ళకు (మళ్ళీ మళ్ళీ తప్పుచేసేవాళ్ళకు, ఎవరినైతే సంస్కరించడంలో మరింత "cost" అవుతుందో వాళ్ళకు) విధించాలి.

A K Sastry said...

డియర్ Indian Minerva!

జేబుదొంగనో, మెళ్ళో గొలుసు తెంపుతున్నవాణ్ణో పట్టుకుని తన్నబోతే, వాడు ‘నన్ను తన్నడానికి మీకేం హక్కుంది? పోలీసులకి పట్టివ్వండి’ అని డబాయించడం మన సినిమాల్లో చూడలేదా!

మరణ శిక్ష దాకా వెళ్ళారు—అసలు యే శిక్షా పడకుండా మరిన్ని నేరాలు చెయ్యడానికి అవకాశం ఇస్తున్న మన వ్యవస్థలో లోపం యెక్కడుందో చెప్పరేం?

ధన్యవాదాలు!