Tuesday, August 25

గాయత్రి

మంత్రాలూ—గాయత్రి
మంత్రాలనేవి ‘కర్మలు ’ చెయ్యడానికి మాత్రమే వుద్దేశించబడ్డాయి! (అవి ‘బ్రహ్మ’ కర్మలైనా, ‘అపర’ కర్మలైనా!) 

యెవరికి వారు మంత్రాలన్నీ నేర్చుకొని సరిగ్గా ఆ కర్మలు నిర్వహించుకోలేరని, పురోహితులు వాటిని నేర్చుకొని, ప్రజలచేత చేయిస్తారు.

 చెయ్యవలసిన కర్మ యేమిటో, యెందుకు చేస్తున్నామో ‘సంకల్పం’ చెప్పుకుంటారు ముందు. అదే పురోహితులు చెప్పి, మధ్యలో కర్మిష్టుల్ని ‘మమ’ అనుకోమంటారు అందుకే!

 ఇక మంత్రాలని ‘చదవ కూడదు’ ‘జపించాలి’ లేదా, ‘అనుష్టించాలి’. గాయత్రి విషయానికొస్తే, అది వూరికే చదివేది కాదు. యెందుకంటే— 

శిశువు జన్మించినప్పటినించీ (ఆడైనా, మగైనా) కొన్ని ‘జాతక కర్మలు’ నిర్దేశించారు—బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి—వీటిలో కొన్ని ఆడ శిశువులకీ, కొన్ని మగ శిశువులకీ ప్రత్యేకం.

 ఇక మగ పిల్లలకి ‘గర్భాష్టమం’ లో చేసే జాతక కర్మ పేరు—వుపనయనం. (దాన్నే ‘ఒడుగు’ అంటారు) ఇది యెందుకు చేస్తారంటే—శిశువుకి 8 సంవత్సరాలు వయసు (తల్లి గర్భం లో వున్న 9 నెలలతో సహా—అంటే పుట్టిన 7 సంవత్సరాల 3 నెలలు) నిండేసరికి ఙ్ఞానార్జనకి సమయం అయినట్టు. అంతే కాకుండా, బాలారిష్టలన్నీ గడిచి, ఒక ధీమా వస్తుంది—అందుకని, ఆ ఒడుగు లో పుట్టినప్పటి నించీ చేసిన జాతక కర్మలని అదే క్రమం లో మళ్ళీ జరిపిస్తారు—అంతకు ముందు యేవైనా సరిగ్గా జరగకపోయినా వాటి ప్రభావం పిల్లవాడి మీద వుండకుండా!

 ఇక ఙ్ఞానార్జనకి మూలం ‘విద్య’. దాన్ని ఆర్జించాలంటే వాక్శుద్ధి లాంటివి కావాలి—వాటికోసం, ఒడుగు లోనే ‘బ్రహ్మోపదేశం’ చేయిస్తారు—తండ్రి చేతగానీ, ఆ అర్హత వున్నవాళ్ళ చేత గానీ. ఆ ఉపదేశం లో భాగంగానే, యఙ్ఞోపవీత ధారణ చేయించి, గాయత్రి ని ఉపదేశిస్తారు! అక్కడితో, విద్యార్జనకి అర్హత లభించినట్టే!

 అక్కడి నించి, అనుష్టానాలు మొదలు అవుతాయి—ఇరు సంధ్యలా సంధ్యా వందనం మొదలైనవి!

 టూకీగా అదీ సంగతి.

 ఇక ‘భూర్భువహ్ స్వహ్’ అంటే, మన భూమికి పైన వుండే మొదటి మూడు లోకాలు. వాటి పైన ఇంకో 4 లోకాలు వుంటాయంటారు. అలా భూమికి పైన 7, భూతలం కింద 7 మొత్తం 14 లోకాలు వుంటాయంటారు.

 పైనుండేవి క్రమం గా 1.భూ లోకం, 2.భువర్లోకం, 3.స్వర్లోకం, 4.మహర్లోకం, 5.జనలోకం, 6.తపోలోకం, 7.సత్యలోకం (ఈ లోకం లోనే బ్రహ్మ వుంటాడుట).

 వీటిని మంత్ర రూపంలో—‘ఓం భూ: ఓం భువ: ఓం స్వ: ఓం మహ: ఓం జన: ఓం తప: ఓం~ సత్యం’ అని చెప్పి ‘ఓం తత్సవితుర్వరేణ్యం…….’ ఇలా సాగుతుంది.

 గాయత్రిలో మనకి ముఖ్యమైన 3 లోకాలనే చెప్పాడు. అవి భూలోకం (అంటే మనం వున్నది—ఇది అందరికీ తెలిసిందే) భువ:+లోకము= భువర్లోకం అంటే, మేఘాల క్రింది అంచువరకూ వ్యాపించినది. ఇక స్వ:+లోకము=స్వర్లోకం అంటే, మేఘాలకి పైన వున్నది. (దీన్నే పొరపాటుగా ‘స్వర్గం’ అని వ్యవహరిస్తున్నారు—నిజానికి స్వర్గము అంటే స్వర్లోకానికి గమించడం అంటే వెళ్ళడం) మనిషి చనిపోయాక, జీవుడు (అంటే ఆత్మ) ఇక్కడవరకూ చేరడమే కష్టం. ఆతరవాత ‘ఆటోమేటిక్ ప్రమోషన్లు’—ఒక్కో లోకం లో నిర్దేశింపబడిన కాలం తీరేక! స్వర్లోకం చేరిన వాళ్ళకి పునర్జన్మ వుండదంటారు!

 అదిగో—అదీ గాయత్రి వుద్దేశ్యం! విశ్వామితృడు త్రిశంకుణ్ణి బొందితో స్వర్లోకానికి పంపలేకపోయినా, ఇతర జీవులు బొందిలేకుండానైనా స్వర్లోకాన్ని చేరడాన్ని సులభతరం చేశాడు ఈ మంత్రం తో!

 ఇక ‘మంత్రాలకి చింతకాయలు రాల్తాయా’ అనకుండా వాటిని విశ్వసించేవారికి, వాటి మహిమపై నమ్మకం వుంటే, ఆ మంత్రాన్ని జపించకుండా వూరికే చదివితే ‘సైడ్ ఎఫెక్టు’లూ, బెడిసికొట్టడాలూ కూడా వుంటాయని నమ్మాలికదా మరి?

 ఇంకొక మాట—ఇవన్నీ నమ్మినా, నమ్మకపోయినా—నేను ముందే చెప్పినట్టు ఇవన్నీ మన ప్రాచీన సంస్కృతిలో భాగాలు. కాబట్టి నిశ్చయం గా నిర్దేశించబడినట్టు ఆచరించవలసిందే!

 యేమంటారు?

 (ఇందులో కొంత పదార్థం (మేటర్) నా ‘హేతువాదం’ బ్లాగులో రావలసింది—సందర్భం వచ్చింది కాబట్టి ఇందులోనే పోస్ట్ చేశాను.)


13 comments:

Malakpet Rowdy said...

Vey well explained! In fact your post has corrected some of my misconceptions!

Malakpet Rowdy said...

esp. regarding Bhuh, Bhuah and Suah ..

మంచు said...

I too..

భాస్కర రామిరెడ్డి said...

Why is this limited to only those 3 sects? Is there any reason that this has to be uttered by those sects? Isn't it keeping sudras outside the Hindu society?

Malakpet Rowdy said...

Isn't it keeping sudras outside the Hindu society?
___________________________________

100% - Its one of the really grave mistakes committed by our forefathers. I dont see any valid reason for keeping a few communities away.

A K Sastry said...

డియర్ Malakpet Rowdy! మంచుపల్లకీ!

చాలా సంతోషం.

జాతక కర్మల నిర్దేశం కొన్ని లక్షలు అవునో కాదో తెలియదు గాని, ఖచ్చితంగా కొన్ని వేల సంవత్సరాలక్రితం—కృత త్రేతా యుగాల సంధ్యలో జరిగింది!

విశ్వామితృడు అప్పటివాడు!

యెందుకంటే, కృతయుగం లో ‘ఇంద్రుడు’ ఒక్కడే దేవుడు మనుషులకి! తరవాత సూర్యుడూ, అష్ట దిక్పాలకులూ మొదలైనవాళ్ళు దేవతలు.

అప్పుడు జరిగింది ఈ వర్ణ విభజన!

అప్పటి జనజీవితాలనిబట్టి ఆ విభజన జరిగింది!

ఇప్పటి ‘శూద్రులకీ’ అప్పటి శూద్రులకీ పొంతన లేదు!

మరోసారి ఇంకా వివరిస్తాను.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ భాస్కర రామి రెడ్డి!

పై సమాధానం చదవండి.

ఇంకా, ఓ ఇరవై యేళ్ళ క్రితం, క్షత్రియుల నించి ‘ఉపనయన’ ఆహ్వానాలు వచ్చేవి. ఇప్పుడు లేదు.

వైశ్యులనించి అప్పటికే లేవు.

ఒక్క బ్రాహ్మణులే ఇంకా ఇవి పట్టుకు వేళ్ళాడుతున్నారు!

పై రెండు కులాలవాళ్ళకి నా మనవి—నాది తప్పయితే, దయచేసి మన్నించి, నన్ను సరిదిద్దండి.

ధన్యవాదాలు.

Mangesh Devalaraju said...

"గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించెను. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము.'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించునది గాయత్రి.

"గాయత్రి అనగా వెలుగు." గాయత్రిని గానము చేయుటకు జాతి, మత, కుల, వర్గ విభేదములు ఎమీ లేవు. ఆడా వారు కూడా మగవారిలా గాయత్రి మంత్రము చేసుకోవచ్చు. దీనిని మన ఋషులే అంగీకరించారు. అనేక దేశములలో ఎంతో మంది గాయత్రి మంత్ర గానము చేయుచున్నారు.

వివరణ కొరకు నా బ్లాగులోని http://master-wisdom.blogspot.com/2009/07/blog-post_942.html మరియు http://master-wisdom.blogspot.com/2009/07/2.html లింకులను చదవండి.

A K Sastry said...

డియర్ Mangesh!

మీరిచ్చిన లింకులద్వారా, టపాలు చదివాను.

మీ 'Master' యెవరో తెలియ లేదు.

మంత్రం లోని కొన్ని పదాలని వదిలేసి, మీకు తోచిన అర్థాలు చెప్పారు. సంతోషం.

గాయత్రిని ‘గానం’ చెయ్యచ్చు అనీ, ఆడా మగా తేడా లేకుండా, జాతి కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ చదవచ్చు, పాడచ్చు అనడానికి ఆ విషయం యెవరు యెక్కడ చెప్పారో అధికారికం గా వ్రాయరేం?

ముందు ‘గురు బ్రహ్మ’ చదవాలని చెప్పారు. బాగుంది. మరి ఆ పాడువారందరికీ యే గురువు వుపదేశించాడని వాడికి వందనం చెయ్యాలి?

వివరిస్తే బాగుండేది.

ధన్యవాదాలు!

Mangesh Devalaraju said...

కృష్ణశ్రీ గారు!

అధికార పత్రం చూపించటానికి గాయత్రి మంత్రము గవర్నమెంట్ G.O కాదు. జగత్తు అంతటికి మూలాధారమైన వెలుగును ధ్యానము చేయుటకు ఎవరి పరిమిషన్ అక్కరలేదు. గాయత్రి మంత్రములో ఏ పదాలను ఒదలలేదు. జాగ్రత్తగా మనసు వుంచి చదవండి.

ఇక గురువు ఎవరికి వందనము చేయాలి అన్నారు. గురువు ఒక్కడే. అతడే సర్వాంతర్యాయైన భగవంతుడు. ప్రత్యక్ష గురువు లేనప్పుడు దైవమునే గురువుగా భావించి ధ్యానించవలేను. ఆ దైవమునే Englishలో "MASTER" అంటారు. Master అంటే స్వామి అని అర్దము. "గురు బ్రహ్మ" మంత్రములో చెప్పబడిన గురువు అతడే. సర్వ జగ్గత్తుకు మూలాధారమైన దైవమే గురువు ద్వారా శిష్యుని అనుగ్రహించుటకు పనిచేస్తాడు. అతడికే వందనము చేయాలి. వ్యక్తము కాని దైవము వ్యక్తము ఐనపుడు వెలుగై వ్యక్తమౌతాడు. అదే మూల ప్రకృతి. అతడు పురుషుడైతే ఆమె ప్రకృతి. ఆమె నుండి సమస్త ప్రకృతి వచ్చింది. కనుక గాయత్రిని స్త్రీగా వర్ణించారు. ఈ మంత్రము ద్వారా ధ్యానము చేసేది ఆ వెలుగునే.

విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రమును సమస్త మానవజాతికి ఇచ్చాడు. అందులో అందరూ వస్తారు. భేదాలు ఎమీలేవు. పండితుల్ని కాక సద్గుగువులనెవరినైనా అడిగి తెలుసుకొన గలరు.

ధన్యవాదములు
మంగేష్

A K Sastry said...

డియర్ Mangesh!

అవును. విశ్వామిత్ర మహర్షి సమస్త మానవాళికే కాదు ప్రకృతిలో వున్న అన్ని జీవులకూ ఇచ్చాడు! గ్రహించే ఙ్ఞానం వున్నవాళ్ళే అనుష్ఠించారు!

మిమ్మల్ని ‘అధికారికం గా’ చెప్పమన్నాను గానీ ‘జీ వో’ చూపించమనలేదు! ఆవిషయం యెక్కడో అక్కడ చెప్పబడో, వ్రాయబడో వుండాలికదా? అది వినో, చదువుకొనో మీరు ఆ విషయం తెలుసుకుని వుండాలికదా? అదే చెప్పమన్నాను—అంతే! చెప్పగలిగితేనే చెప్పండి—లేకపోతే లేదు అనుకుంటాము!

ఒకటో రెండో పదాలని వదిలారనే అలా అన్నాను. పైగా ‘ఓం భూర్ భువహ్ స్వహ్’ అని కనిపిస్తూంటే, ‘అదేదో…ఫోర్స్…..ఇంకేదో’ అని భాష్యం చెప్పారు!

వేదాలనీ, పురాణాలనీ, ఇతిహాసాలనీ, సంస్కృతంలోనే అవుపోసన పట్టిన వాళ్ళెందరో చెప్పగా విన్నాను, చదివాను గానీ, ‘సవితను కౌగిలించుకోవాలి’ అన్నది మీరే మరి!

పండితుల్ని కాక…అంటే?

సద్గురువులంటే యెవరు? తెల్లగడ్డాలు, మీసాలు పెంచుకొని, నెత్తికీ, ఒంటికీ కాషాయ రంగు గుడ్డలని కట్టుకొని, ‘భగవంతుడు అంటే భగం వున్నవాడు’ ‘నేను నా సంగీతం తో, వాయిద్యం తో మీ రోగాలన్నీ నశింపచేసి, మోక్షాన్ని ఇస్తాను’—ఇలాంటి పిచ్చి వుపన్యాసాలిచ్చేవాళ్ళా?

ఇక ‘పరిమిషన్’ సంగతి—నాటపాలోనే వ్రాశాను—ఒకటి నమ్మితే, రెండోది నమ్మాలి—అని!

ఇక మీ యిష్టం, చదివే, పాడే వాళ్ళిష్టం!

ధన్యవాదాలు!

Mangesh Devalaraju said...

చాలా సంతోషం. మీ టపాలు చదివాక నాకు అర్థమైనది ఒక్కటే. మీకు దేనిమీద నమ్మకం లేదు. ఉన్నది అనుకుంటున్నారు. సర్వము తెలుసు అనుకుంటున్నారు. ఎవరికైనా తెలియవలసినది చాలా వుంటుంది. తెలిసినది చాలా తక్కువ వుంటుంది. ఆ రెండూ కలిపితేనే పూర్ణమైన సత్యమవుతుంది. తప్పక మీకు గాయత్రి అనుగ్రహము కలగాలి అని ప్రార్థన చేస్తాను. అది వెలిగితే వున్న చీకటి తొలగిపొతుంది. సత్యము భోధ పడుతుంది. ఇదే నా చివరి కామెంట్. ఎందుకంటే ఎంత చెప్పినా ఉపయోగము లేదు కనుక. నా సమయము వృధా చేసుకోను.

ఉంటాను,
మంగేష్

A K Sastry said...

డియర్ Mangesh!

నాక్కూడా చాలా సంతోషం!

నిజంగా నాకు దేనిమీదా నమ్మకం లేదు--వున్నది అనుకుంటున్నానని మీకు యెందుకు అనిపించిందో మరి!

సర్వమూ తెలుసని నేనెప్పుడూ అనుకోలేదు--అనలేదు! అందరికీ అన్నీ తెలియవు--ఆ అవసరం కూడా లేదు.

ఐన్ స్టైన్ తన పెంపుడుపిల్లి తన ఇంట్లో అన్నిగదుల్లోకీ స్వేచగా తిరగాలని, తలుపులకి అది దూరగలిగేంత కన్నాలు పెట్టించాడట. ఆ పిల్లి ఒకేసారి యేడు పిల్లల్ని పెట్టగానే, అన్ని తలుపులకీ, తల్లి కోసం పెట్టించిన కన్నం పక్కన యేడు చిన్న చిన్న కన్నాలు పెట్టాడట!

దితి, 'ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలి ' అని హోమం చేస్తుంటే, ఇంద్రుడు వెళ్ళి సరస్వతీదేవి కాళ్ళమీద పడితే, ఆవిడ దితి నోటిలో ప్రవేశించి, నాలుక తడబడేట్టు చేసి, 'ఇంద్రుడు చేతిలో చచ్చే కొడుకు కావాలి ' అనిపించిందట! పర్యవసానం అందరికీ తెలుసు కదా? ఇదైనా నమ్ముతారా?

మనిషన్నవాడు ఆమరణాంతం 'నేర్చుకుంటూనే' వుంటాడని నమ్మేవాణ్ణి నేను!

నేన్నన్నీ చదువుతాను--ఆకళింపు చేసుకోడానికి ప్రయత్నిస్తాను--అది సమయం వృధా చేసుకోవడం అనుకోను!

ధన్యవాదాలు!