skip to main |
skip to sidebar
గుళ్ళో పాటల భక్తి
పాటల భక్తి
ఈ మధ్య ప్రతీ గుడిలోనూ అనేక రకాలైన భక్తి రికార్డులు గంటలతరబడీ వాయించేస్తున్నారు!
వీటిలో రకరకాల పాటలు వుంటున్నాయి! ‘జజ్జనకడి జనారే’ వరసలతోసహా….
ఇవి కాక ‘చ్హాంట్’ లంటూ ఒకే పదాన్నో, మంత్రాన్నో పదే పదే వల్లించే రికార్డులు కొన్ని!
అసలు ఆడవాళ్ళకి గాయత్రీ మంత్రానికి అర్హత లేదు—వాళ్ళు జంధ్యాలు వేసుకో కూడదు కదా?
అయినా, ఓ ఆడమేళం గాయత్రీ మంత్రాన్ని, వాళ్ళిష్టం వచ్చినట్టు ‘చ్హాంట్’ చేస్తున్న రికార్డొకటి!
అది ఇలా సాగుతుంది—“ఓం భూర్ భువహ స్వాహా! తత్స వితుర్వ రేణ్యం! భరుగో దెవస్య ధీమహీ! ధియో యోనహా ప్రత్యోదయాత్!”
పీటమీద కర్రతో తాళం వాయించుకుంటూ, అదే వరసలో పాడడం వల్ల ‘వచ్చిన రాగాలూ, తీసిన దీర్ఘాలూ’ ఇవి! (శంకరాభరణం శంకర శాస్త్రిగారికీ, పట్టాభి భాగవతార్ కీ క్షమాపణలతో!)
‘భూర్ భువహ్ స్వహ్’ అంటే అవి ‘భూ, భువ, స్వ’ (భూలోక, భువర్లోక స్వర్లోకాలు) లోకాలు అనీ, ‘స్వహ్’ కీ ‘స్వాహా’ దేవికీ యేమీ సంబందం లేదనీ—వీళ్ళకి యెవరు చెపుతారు?
‘భరుగో దెవస్య’ కాదు ‘భర్గో దేవస్య’ అనాలని యెవరు చెపుతారు?
‘ధియో యోనహా’ కాదనీ, “ధీయోయోనహ్’ అనీ యెవరు చెపుతారు?
‘ప్రత్యోదయాత్’ అనక్కర్లేదు ‘ప్రచోదయాత్’ అనాలని యెవరు చెపుతారు?
మనం చెప్పినా వాళ్ళు వింటారా! రికార్డుని మార్చి మగాళ్ళతో సరిగ్గా పాడిస్తారా! ఇప్పటి వరకూ అమ్ముడైన రికార్డులని నాశనం చేస్తారా! ఈ గుళ్ళలో వాటిని వేయడం మానేస్తారా! ఒరే వెధవల్లారా ఇది తప్పు అని యెవరైనా వాళ్ళకి చెప్పేస్తారా!
మన పిచ్చి గానీ, యేదైనా యెంత భ్రష్టు పడితే జనాలకి అంతానందం!
ఇవి వింటూంటేనే మనశ్శాంతి కలిగి, జన్మ తరించినట్టనిపిస్తోందట కొంతమందికి మరి!
యెవరి పిచ్చి వాళ్ళకానందం అని యెవరన్నారో!
10 comments:
ఓస్ ఇంతేనా.
మా ఊళ్ళో ఇలాటివి బోలెడు. చిన్న ఉదాహరణ "శుక్లం భర్త రం ససి వరుణం చతురు బుజం". వాడు/ఆవిడ ఎలా పాడినా (అంటే ఇంకా దారుణమయిన పాటలు ఉన్నాయి) ఆ పాటలు విన్న తరువాత మతితప్పిన స్థితిలో అర్థమయ్యిందేమిటయ్యా అంటే " శుక్లం వచ్చిన భర్త రం తాగుతూ, ఆ మైకంలో వరుణుడి శశి కోసం చతురులతో భుజాలు తడుతున్నాడట"
స్త్రీలు / జంధ్యం వేసుకోని వారు గాయత్రి చదవడంలో నాకేమి అభ్యంతరం లేదు గానీ శంకరాభరణం దాసు మాస్టారి లెవెల్ లో అక్షరాలని ఇష్టమొచ్చినట్టు విరిచేస్తే మాత్రం కోపం రాకపోయినా కాస్త చిరాకూ, తరవాత నవ్వూ వస్తాయి :))
(BTW పొద్దున్నే గాయత్రి చేస్తూ సాయంత్రమయ్యేసరికి అడ్డమైన పనూలూ చేసే కొంతమంది జంధ్యం వేసుకున్నవాళ్ళకన్నా చిత్తశుధ్ధితో గాయత్రి చదివే జంధ్యంలేనివారే నయంకాదంటారా?)
ఇదేమిటి, మనకి Role Reversal అయినట్టుంది?
గాయత్రీమంత్రం చదవడానికి మహిళలు అర్హులు కారని చెప్పిందెవరు? గాయత్రి మహిళలు చెబితే ప్రపంచం నాశనమైపోతుందా ! భువనభాండాలు బద్దలైపోతాయా! దేవుడికి హార్ట్ అటాక్ వస్తుందా!
మీరు విన్న గాయత్రీమంత్రం ఎవరైనా హిందీవాళ్ళు జపించినది అయ్యుంటుంది. వాళ్ళలాగే పలుకుతారు. వాళ్ళు దేవనాగరిలో రాసినట్లే పలుకుతారు. కాబట్టి మీరు చెప్పే ఉఛ్ఛారణ సరైనది అని మీరు సాధికారకంగా చెప్పలేరు. దానికి కారణం మనం సంస్కృతం తెలుగులో చదువుతాముగనక.
baagundi............ante maaku teleedu kada anduke memu ade correct anukuntam...........meelanti vaallu correct cheyaali mari
డియర్ Anonymous!
హహ్హహ్హా!
ఇంతకీ మీదేవూరో చెప్పలేదు! ‘మతితప్పిన స్థితిలో’ మీ అన్వయం బాగుంది!
పైగా అలా పాడినవాళ్ళు (కొంతమంది సమర్థించినట్టు) భుక్తి కోసం చేస్తున్నారనుకుందాం. మరి దాన్ని పదే పదే గుళ్ళలో వేస్తున్న మూర్ఖులనేమనాలి? అది చెప్పరేం!
ధన్యవాదాలు!
డియర్ Malakpet Rowdy!
చాలా సంతోషం—నాతో యేకీభవించినందుకు.
BTW ని expand చెయ్యగలరు.
మొదటిరకంవాళ్ళని నేనూ చూశాను కానీ, ‘చిత్తశుధ్ధితో గాయత్రి చదివే జంధ్యం లేనివారు’ యెవరూ నాకు తటస్థపడలేదు!
ఇక, Role reversal అంటే?
ధన్యవాదాలు!
డియర్ కత్తి మహేష్ కుమార్!
మీ అభిప్రాయం వెలిబుచ్చినందుకు చాలా సంతోషం!
మీరు గౌ|| కత్తి పద్మారావుగారికి యేమైనా అవుతారో లేదో నాకు తెలియదు.
ఇక ఆ మాట చెప్పింది యెవరో కాదు—సాక్షాత్తూ గాయత్రీ మంత్రాన్ని రచించిన విశ్వామిత్ర మహర్షే ఆ మాట చెప్పాడు.
ఇక……’పోతుందా! …..తాయా!....తుందా!’—వీటికి నా సమాధానం—నెగెటివ్! అది ‘చెప్పేవాళ్ళకే’ నష్టం! (యెవరైనా సంస్కృత పండితులని ఆ మంత్రం ‘దండాన్వయం’ చెప్పమంటే చెపుతారు—అప్పుడు మీరూ వొప్పుకొంటారు—నేను చెప్పింది నిజం అని!
తరవాత….మన రాష్ట్రం లో వినిపిస్తున్న, నేను వ్రాసిన రికార్డుని పాడిన వాళ్ళు తెలుగువాళ్ళే! హిందీవాళ్ళు జపిస్తే యెలా వుంటుందో హిందీ సినిమాల్లో వినే వుంటారు—చెప్పమంటే మళ్ళీ నేను చెపుతాను.
మన తెలుగు భాష ప్రపంచ భాషల్లోకెల్ల గొప్పది యెందుకయ్యిందంటే—మనం మాట్ళాడేది వ్రాయగలం, వ్రాసేది అలాగే చదవగలం! (‘త్పృవ్వటబాబా తలపై పువ్వట…….’ తొ సహా!)
ధన్యవాదాలు!
డియర్ Vinay Chakravarthi.Gogineni!
చాలా సంతోషం!
చెప్పడానికి యేమీ అభ్యంతరం లేదు కానీ, విని అర్థం చేసుకోలేని ‘మిడి మిడి ఙ్ఞానుల’తోనే తంటా అంతా!
ధన్యవాదాలు!
ఈ చాంటింగ్ వినే ‘స్వహ్’ ని ‘స్వాహా’ కి మార్చాను... :-( నాకు అర్ధం తెలీదు :-((
చిత్తశుధ్ధితో అంటె మీ కరక్ట్ డెఫినషన్ నాకు తెలీదు కానీ " రొజు గాయత్రి చదివే జంధ్యం లేనివారు " లొ నెనొకడిని.
జంధ్యం లెకుండా చదవటం తప్పొ ఒప్పూ తేలీదు .. చదువుకున్నప్పుడు బ్రహ్మిన్ రూమ్మెట్ వల్ల అలవాటు అయ్యింది.
డియర్ మంచు పల్లకీ!
చాలా సంతోషం!
‘…..నాకు తటస్థపడలేదు’ అన్నానంతే! (‘చిత్తశుద్ధి’ అన్నది నేనుకాదండోయ్!)
ఇక శాస్త్రప్రకారం చెప్పాలంటే మాత్రం, అది తప్పే!
నా తరువాత టపా చదవండి.
ధన్యవాదాలు.
Post a Comment