Sunday, July 11

సినీ పరిశ్రమ

పైరసీ

డియర్ AVS!


లక్కీగా ఆర్టిస్ట్ అవడం కాదు--లక్కీగా హిట్ అవడం. ఇక బ్యాంకింగ్ రంగం లో లక్ యెలా వుంటుందో నాకు తెలియదు.

ఇక రొయ్యల చెరువులూ, చేపల చెరువులూ, పొగాకు చుట్టలూ, బీడీలు పరిశ్రమల్లో కోట్లు సంపాదించి, సినిమాలు తీసి, వందల కోట్లు సంపాదించాలనుకున్నవాళ్ళు యేమయ్యారో, మీకు తెలిసేవుంటుంది.

పైరసీవల్ల సినిమా పరిశ్రమ నష్టపోతూంది అనేదానికి అన్నానుగానీ, వ్యక్తిగతం గా మీ సినిమాలు ఢాం అంటే, నాకు 
సంతోషం కాదు కదా? 

'యేవి మంచి సినిమాలో తెలియాలంటే.......'--అఖ్ఖర్లేదు. మీరన్న "అల్లూరి సీతారామ రాజు" సినిమా చూసి బయటికొస్తున్న నన్ను అభిప్రాయం అడిగితే, "పిక్చర్ ఆఫ్ ది డికేడ్" అని చెప్పాను. 

మళ్ళీ హాస్యం గా అంటున్నారా అని అడిగినవాళ్ళకి, "ఇది నిజం" అని నొక్కి చెప్పాను.

ఇప్పటికీ అది "పిక్చర్ ఆఫ్ ది మిలీనియం" గా వుంది. 

రండి, యెన్ని పైరసీ సీడీలు విడుదల చేస్తారో--థియేటర్ లోనూ రిలీజు చెయ్యండి.....కలెక్షన్లు యెలా వుంటాయో చూడండి.

దాదాపు 20 యేళ్ళ తరవాత మళ్ళీ థియేటరు కి వెళ్ళి, "శ్రీ రామదాసు" చూశాను--చిరాకు వచ్చింది అంటే నమ్మరేమో మీరు!

ఇక ఇండస్ ట్రీ గురించీ, వాల్ పోస్టర్లు అంటించేవాళ్ళగురించీ, యెవరెంత బాధపడినా, కొన్ని అనివార్యం.

ఈ రోజు బ్లాగుల్లో చూస్తున్నట్టు, ఒకప్పుడు వెలిగిన రేడియో మెకానిక్ లు యేమి చేస్తున్నారు? ఆడియో క్యాసెట్లూ, రికార్డర్లూ, టూ ఇన్ వన్ లూ, వీడియో ప్లేయర్లూ, రికార్డర్లూ, ఇవన్నీ యేమయిపోయాయి? యెన్ని లక్షలమంది వుపాధి పోగొట్టుకున్నారు? 

గాడ్రెజ్ కంపెనీ తన ఆఖరి టైప్ రైటర్ ఫ్యాక్టరీని కూడా మూసేసిందే? 

చెప్పాలంటే ఇంకా చాలా వున్నాయి--కష్టించేవాడికి ఇది కాకపోతే, మరోటి! 

'.......యెవరూ యేడవరు ' కరెక్టే! కానీ యేమి తీసినా కనీసం నేలటిక్కెట్టు అయినా కొనుక్కొని చూశారు జనాలు! యెందుకంటే అప్పట్లో వాళ్ళకి వున్న ఒకే ఒక్క 'ఎంటర్టెయిన్ మెంట్' అదే కాబట్టి!

ఇప్పుడుకూడా, మేం కోట్లు పెట్టి తీస్తాం, యెంత చెత్తగా వున్నా మీరు వేలు ఖర్చుపెట్టి చూడల్సిందే--తక్కువరేటుకి వచ్చేవి చూడద్దు--అంటే!?? తియ్యడం మానేస్తే పోలా? ఇండస్ ట్రీని మూసేస్తే పోలా?

ఇక--ఈ santhi యెవరో--చిలక పలుకుల్లా లక్ గురించీ, బ్యాంకింగ్ రంగం లో లక్ గురించీ మాట్లాడుతున్నారు. 'తుత్తి ' అన్న ఆయన మేనరిజం 'హిట్' అయ్యింది--సినిమా అంత గొప్పది అంటే నేనొప్పుకోను. మరి నేను వ్యక్తిగత విషయాలేమి చర్చించానో తమరే చెప్పాలి.

WitReal, deepu లాంటి వాళ్ళు తెలుగు వ్రాయగలిగీ, ఇంగ్లీ-తెలుగు లో యెందుకు బ్లాగుతున్నారో నాకు తెలీదు. 

4 comments:

santhi said...

హలో కృష్ణశ్రీ గారు...
మీకు డబ్బంటే వ్యామోహం లేదు అంటూనే ఎదుటి వాళ్ళ సంపాదన గురించి ఎందుకండి అంత బాధ , సినిమాలు తీసి వందల కోట్లు సంపాదించుకున్నవాళ్ళు ఏమయ్యారో తెలియదు కాని , మొన్నీమధ్య వరుసగా కొందరు బ్యాంకు ఉద్యోగులు జనాల డబ్బును వాళ్ళ సొంత మనీ లాగా తీసుకొని చెక్కేసారు వాళ్ళు ఏమవుతారో మాత్రం తెలుసు .
అవును అల్లురి సీతారామరాజు సినిమా మళ్ళీ మీకోసం రిలీజు చెయ్యక్కరలేదు కాని, మొన్న రిలీజు చేసిన కలర్ ' మాయాబజార్ ' సంగతి ఏమిటండీ ... దాని పైరసీ సీడీలు ఎందుకు రిలీజు చేశారు . సినిమా బాగోలెదనా లెక , మీలాంటి వాళ్ళ సలహా లేకనా . అయినా 20 ఏళ్ళ తరువాత ఒక సినిమాకి వెళ్ళానన్నారు , అంటే దదాపు అన్ని సినిమాలు పైరసీ సీడీలు చూస్తారు కాబోలు అందుకే " గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారు " . లేక ఇంకా మీరన్నట్లు దేశాన్ని ఉద్ధరించడానికి చాలామంది ఉన్నారు . పాపం మీకెందుకండీ ఇంత కష్టం . నా పలుకుల సంగతి ఎందుకులేండీ . ముందు ప్రతిదానికీ మీరు ఉలిక్కిపడటం మానేయండి . మీరు ఒప్పుకున్నా ... లేకపోయినా నేను వ్యక్తపరచింది నిజం ... సినిమా జనం లో చైతన్యం తీసుకురాగలదు , అవసరమైతే కొత్తమార్పుకు నాంది పలకగలదు అదీ సినిమా, ఒక్క సినిమా నే కాదు ఎనీ మీడియా జనాన్ని చాల తొందరగా రీచ్ కాగలదు . ముందు బ్లాగులో రాసిన దాన్ని సరిగా చదవండి అప్పుడు కామెంట్ చేయండి ...

A K Sastry said...

డియర్ santhi!

'బ్యాంకింగ్ రంగం లో లక్' గురించి ఆయన వ్రాస్తే, దాన్ని రిపీట్ చెయ్యడం చిలక పలుకులు కాకేమిటి? లేక జనాల డబ్బు చెక్కేసినవాళ్ళది 'లక్' అంటారా?

నేనన్నదీ అదే, కోట్లు సంపాదిచుకునేవాళ్ళకి, లక్షలు సంపాదించుకొనే వాళ్ళమీద యేడుపెందుకని!

"....ప్రశ్నించినవాళ్ళందరూ 'పైరసీ సీడీలు చూసేవాళ్ళు' అని అనుకునేంత అవివేకిని కాను"--అని ఆయన చెప్పారు.

".....దాదాపు అన్ని సినిమాలు పైరసీ సీడీలు చూస్తారు కాబోలు...."--ఇది మీ కామెంట్!

యెవరి వివేకమెంతో తెలుస్తోంది కదా?

సీడీలు నిన్నకాక మొన్న వచ్చిన సంగతే మీకు తెలుసేమో--అంతకు ముందు నిర్మాతలు స్వయం గా 'వీడియో రైట్స్' అమ్ముకొని, కొన్నవాళ్ళు వీడియో క్యాసెట్ లు తయారు చేసి, లైబ్రరీలకి అమ్మేవారు--1982 నించీ.

ఆరోజుల్లో, పదిరూపాయల టిక్కెట్టు కొని, వీడియో పార్లర్ లో సర్ రిచర్డ్ అట్టెన్ బరో 'గాంధీ' తో వీడియో సినిమాలు చూడడం మొదలెట్టాను నేను. తరవాత సొంతం గా ఓ వీ సీ పీ కొనుక్కొని, అనేక భాషల్లో అనేక చిత్రాలు, రోజుకి రెండుకి తక్కువ కాకుండా చూశాను, మా పిల్లలకి చూపించాను.

దేశాన్ని వుధ్ధరించడం ప్రసక్తి యెందుకు?

"....జనం లో చైతన్యం తీసుకు రాగలదు....."--వేలు ఖర్చుపెట్టి థియేటర్లోనే చూసే కొంతమందికే ఈ చైతన్యం పరిమితమవ్వాలా?

అసలాయన బాగానే వున్నారు--ఇక మీకూ నాకూ యెందుకంట?

deepu said...

santhi garu well said chala baga chepparu kani gummadi kayala donga anna padam vaada kunda undalsindi. krishna sri garu mee age ki respect icchi ceptunnanu kill piracy anna blog ki meeru spandhinchi nantha negitive gaaa evvaru spandhichat ledhu adhi kakunda cinema cinema ki madya 20years gap icchrante meeku first cinema knowledge ledhu inka endhuku sir let us kill piracy.let us do good for our entertainment.

A K Sastry said...

డియర్ deepu!

నన్ను పెద్దవాడు అన్నారుకాబట్టి మీరు చిన్నవాళ్ళనుకొని, సలహా ఇస్తున్నాను--తెలుగు చదవడం, వ్రాయడం బాగా నేర్చుకొని, నా టపాలనీ, వ్యాఖ్యలనీ మళ్ళీ చదువుతూ వుండండి.

'కిల్ పైరసీ' నినాదం తో ముందుకే వెళ్ళండి.