మానసికానందం
శివ గారి సాహిత్యాభిమాని లో పైరసీ గురించి టపా చూశాక, ఇది వ్రాయాలనిపించింది.
మొన్న AVS టపా మీద నా టపా లో '............చిరాకు వచ్చింది' అని వ్రాస్తే, యెవరైనా అడుగుతారేమో అనుకున్నాను--యెందుకు? అని.
ఇదివరకు థియేటర్లో సౌండ్ సిస్టం లో ఓ విప్లవం 'dts' సౌండ్. పాత సౌండ్ సిస్టం ల కన్నా చాలా స్పష్టం గా వినిపించి, వినడానికి ఆహ్లాదం గా వుండేది.
తరవాత వచ్చిన 'డాల్బీ' సిస్టం తోనే వచ్చింది తంటా.
సాహిత్య అభిమాని బ్లాగులో చెప్పినట్టు, పాటలు వస్తే విపరీతమైన సౌండ్ రావడం, యెవరో తలుపు తోస్తే, చెవులు చిల్లులుపడే శబ్దం రావడం--ఇలాంటివి. ఇంకా ఓపక్క స్పీకర్లని రెండో మూడో ఆఫ్, ఆన్ చెయ్యడం లాంటివి స్వయం గా చేస్తున్నారో, ఆటోమేటిక్ గా ఆ సిస్టం లో అవుతాయో నాకు ఇప్పటికీ తెలియదు.
ఇక మాడరన్ ట్రెండ్ అంటే, దుబాయ్ వాళ్ళ ట్యూనులని దిగుమతి చేసుకొని, పాడే వాళ్ళ గొంతుల్ని నొక్కేసి, అదేదో సీనారేకు మీద దువ్వెన్న తో గీకితే వచ్చే కీచు గొంతుకలా రికార్డు చెయ్యడం, అన్నిభాషలనీ మిక్స్ చేసేసి, యేదో పాడించేసి, వెనకాల సోఁయ్ సోఁయ్, అనో, డోఁయ్, డోఁయ్ అనో, ఈఁ ఈఁ ఈఁ అనో, ఊఁ ఊఁ ఊఁ అనో మోతెత్తించడం.
ఓ సినిమాలో లక్ష్మీపతి గొంతు 'తారురోడ్డు మీద రేకు డబ్బా తో గీసినట్టు వుంటుంది' అనిపించారు--హాస్యం గా బాగానే వుంది.
మరి సంగీతం లో ఈ వెర్రి తలలు యేమిటో!
శ్రీ రామదాసు సినిమాని ఎంజాయ్ చెయ్యలేకపోడానికి సౌండ్ సిస్టం మొదటి కారణం.
కథని వక్రీకరించడం రెండో కారణం.
మూడోది--హాస్య తొట్టి గ్యాంగ్. ముఖ్యం గా జయప్రకాష్ రెడ్డి--ఆయన లేకుండా వుంటే సినిమా ఇంకా చాలా బాగుండేది.
పాత భక్త రామదాసులో తానీషా--శ్రీ పసల సూర్యచంద్ర రావు--ని ఓ సారి చూడండి యెక్కడైనా దొరికితే!
(ఇదివరకు అదే కథ తో మళ్ళీ తీసిన సినిమా విడుదల అయితే, దాంతోపాటు పాత సినిమాని కూడా విడుదల చేసేవారు--ప్రేక్షకులు రెండూ కంపేర్ చేసుకుంటారనే వుద్దేశ్యం తోనేమో! ఉదా:- కొత్త దేవదాసు, పాత దేవదాసు)
మళ్ళీ ఇంకోసారి.
3 comments:
> ఓ సినిమాలో లక్ష్మీపతి గొంతు 'తారురోడ్డు మీద రేకు డబ్బా తో గీసినట్టు వుంటుంది' అనిపించారు--హాస్యం గా బాగానే వుంది
కొండవలస?
డియర్ పానీపూరి123!
కొండవలసేనట! నిజమే. నాకు సరిగా గుర్తు రాలేదు.
ధన్యవాదాలు.
(శివ గారి సాహిత్యాభిమాని లో "మాదిగ డప్పులు" కవితని, ప్రవీణ్ శర్మ వీడియో పెట్టాక--)
..........ఆహాఁ! మీరింకా చెప్పులు కుడుతున్నారా?
(ఈ కవితలో ఇవి తప్ప ఇంకొక్క మాట కూడా నాకర్థం కాలేదు. నాకే కాదు--నా చెప్పులు రిపేరు చేసేవాడికి కూడా! యెందుకంటే, వాడు ఒక 'ముందుబడిన వాడు!'
మొన్న నా టపాలో సినిమా పాటల గురించి వ్రాస్తూ--మాదిగ డప్పులు అంటే కులం పేరుతో దూషిస్తున్నానని అంటారేమోనని వ్రాయలేదు--ఇప్పుడు మన సినిమా పాటలలో ప్రతీ సంగీత దర్శకుడూ అధారపడుతున్నవి ఈ మాదిగ డప్పుల మీదే!
(ఆ బ్లాగులో యెందుకో 'కామెంట్' లు అనుమతించబడలేదు. అందుకని వేరే వ్రాయవలసి వస్తోంది.)
Post a Comment