Friday, July 30

రామాయణం లో పిడకల వేట

వాలి, సుగ్రీవ, రామ....."తదితరుల" గురించి చర్చ

ఇంత చర్చ అవసరమా? యేమో!

రామాయణ, భారత, భాగవతాల్ని "ఇతిహాసాలు" అన్నారు. అంటే, ఒకప్పుడు జరిగినవిగా 'చెప్పబడుతున్న' "కథలు". 

పురాతన మహర్షులు చెప్పినా, గ్రీకులవంటివారు చెప్పుకున్నా ఇవి ఇతిహాసాలే!

ఇవి తరతరాలుగా, "అనుశృతం గా" వస్తున్నవి. అంటే, "విన్నది విన్నట్టుగా" చెప్పబడుతున్నవి! 

(ఓ సంఘటనకి ప్రత్యక్ష సాక్షులు నలుగురుంటే, నలుగురూ నాలుగు రకాలుగా చెపుతారే--ఇక విన్నది విన్నట్టుగా చెప్పడమంటే--యెన్ని మార్పులూ చేర్పులూ జరిగి వుండవచ్చో వూహించండి!)

ఇలా కథలు చెప్పేవాళ్ళు సందర్భానుసారం పాత్రల్ని ప్రవేశపెట్టడం, (రోజుల తరబడి సాగే ఈ కథ చెప్పడం లో) కొన్ని పాత్రలని మరచిపోవడం, మళ్ళీ యెవరో గుర్తుచేస్తేనో, వాటి సంగతి యేమయిందని అడిగితేనో, మళ్ళీ ఆ పాత్రల గురించి చెప్పడం, ముందు చెప్పినదానికీ, ఇప్పుడు చెప్పేదానికీ వైరుధ్యాలుండడం--ఇవన్నీ సహజమే కదా!

మన విఠలాచార్య హీరో కాల్ షీట్లు దొరకకపోతే, అర్జంటుగా వాడిని ఓ మొసలిగానో, యెలుగుబంటి గానో, తొండగానో, కప్పగానో మార్చి, కథ నడిపించి, హీరో కాల్ షీట్ ఒక్క రోజే దొరికినా, ఆ కథని కూర్పు చెయ్యడానికి హీరో క్లోజప్పులు మాత్రమే తీసుకొని, మిగిలిన సినిమా అంతా డూప్ లతోనూ, జంతువులూ, వాటి వేషాలేసుకున్న మనుషులతోనూ షూట్ చేసేసేవాడు!

ఇక మైథాలజీ అంటే, అప్పట్లో ప్రజల్లో వున్న నమ్మకాలని బట్టి, 'మిథ్య' తో సృష్టించబడినవి. మన పురాణాల సంగతేమోగానీ, గ్రీకు పురాణాలన్నీ ఈ మైథాలజీ క్రిందకి వస్తాయి--అట్లాసు భూమిని మోస్తూండటం, వీనస్, క్యూపిడ్, జియస్ లాంటి కథలు!

ఇక, కథ చెప్పేవాళ్ళ దగ్గరకి వస్తే, అన్నీ "సూతుడు శౌనకాది మహా మునులకి" చెప్పినవే!

ఈ సూతుడు అంటే యెవరు?

అసలున్నది "శుక, శౌనకాది మహామునులు" మాత్రమే! కాబట్టి "సూత మహర్షి" అనేవాడు లేడు!

వీళ్ళల్లో మొదటివాడు "శుకుడే" (చిలక్కి పుట్టినవాడు అని అర్థమేమో!) సూతుడు! 

(శౌనకుడు అంటే, శునకానికి పుట్టినవాడేమో కూడా!)

అందుకే, చిలకలా, తాను విన్నవి మళ్లీ అందరికీ వినిపిస్తూండేవాడు!

(తరవాత యెవరు ఈ కథలు చెప్పినా, "నైమిశారణ్యం లో సూతుడు శౌనకాది మహర్షులకి" చెప్పినట్టు.......అనే మొదలుపెట్టేవారు!)

ఈ విషయం, కొన్ని దశాబ్దాల క్రితమే, పెద్దలచే (ఇంక్లూడింగ్ మాలతీ చందూర్ ఇన్ ప్రమదావనం--జవాబులు) రూఢి చెయ్యబడింది!

మరి ఇప్పటిక్కూడా, "సూత మహర్షి" అంటూ వస్తున్న రచనలెన్నో!

అదలా వుంచితే, వేదవ్యాసుడూ, వాల్మీకి మొదలైనవాళ్లు యెవరూ కాగితల మీదా, అట్టలమీదా, చర్మాల మీదా, రేకుల మీదా, కనీసం తాళ పత్రాలమీదా వ్రాయలేదు కదా?

తరవాత్తరవాత వ్రాసినవాళ్లయినా, తమకి అప్పటికి తెలిసున్న "తెలుగు" లిపి లో నో, ఇంకో లిపి లోనో మాత్రమే వ్రాశారు! ఇలాంటి తాళ, భూర్జర, తామ్ర, శిలా.......వగైరా పత్రాలని, మల్లంపల్లి వంటివారూ, ఇంకొందరు మహామహులూ "పరిష్కరించి" ఈనాడు మనం వ్రాసుకుంటున్న "ముత్యాల్లాంటి" తెలుగు అక్షరాలలో అందించారు!

(వాటిలోనూ కొన్ని అపభ్రంశాలుండవచ్చు--ఉదా:- అన్నమాచార్య కీర్తనలు)

మరి ఈ రోజు మనం ఇన్నిరకాలుగా కొట్టుకోవలసిన అవసరం వుందా?

నన్నడిగితే, ఈ లండాచోరీ (ఈ మాట తప్పైతే నన్ను క్షమించగలరు) అంతా ఇప్పుడెవరికీ తెలియని "సంస్కృత" భాషవల్లే వచ్చింది!

ఒకడు "యత్రనార్యస్తు......." అంటాడు, ఇంకొకడు "యత్ర నార్యన్‌తు........." అంటాడు.

ఒకడు "నైనం ఛిందంతి......." అంటే, ఇంకొకడు "నయనం ఛిందన్‌తి............" అంటాడు.

ఒకడు ".....అభ్యుథ్థానం, థర్మస్య...." అంటే, ఒకడు ".......అభ్యుథ్థానమధర్మస్య......." అంటాడు.

ఇక అంకెల దగ్గరకొస్తే, ఇక చెప్పఖ్ఖర్లేదు...."అష్టోత్తరం"; "పంచ వింశతి"; "షష్టి"; "షష్ఠి".....ఇలాగ. 

(మొన్నీమధ్య గరికపాటివారు చెప్పేవరకూ నాకు షష్టి ల గురించి తెలియదు--ఇదివరకెప్పుడో నా బ్లాగులో తప్పు వ్రాసినట్టు కూడా గుర్తు నాకు!) 

కానీ, అందరూ, అలవోకగా అన్ని శ్లోకాలనీ జనాల (స్వైన్స్) ముందు "ముత్యాల్లా" (అని వారి భావన) జల్లేస్తూనే వుంటారు!

కనీసం ఇప్పుడైనా, "వుభయ భాషా ప్రవీణులెవరైనా" సంస్కృతం --టు-- తెలుగు వ్యాకరణాన్నీ, నిఘంటువునీ వ్రాస్తే, అది అన్నివిధాలా అందరికీ అమోదనీయమైతే, యెంతబాగుండునో!

తీరుతుందంటారా--ఈ ఆశ?

7 comments:

వెంకట్ said...

మాలతీ చందూర్ అంత గొప్ప హిస్టారియన్ అని మీరు చెప్పేదాకా నాకు తెలీదు సుమండీ,స్వాతి బుక్కు లో సోది కబుర్లు చెప్పే ముసలామె ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యం కాదు.ఇక మీ దృష్టిలో శునకానికి పుట్టిన వాడి ఇప్పుడు మనుషులే శునకాలకన్న హీనంగా ప్రవర్తిస్తున్నరు కదా ఇక మీ లాంటి పెద్దలు వాటిని నిజం చేయడానికి సర్వదా కౄషి చేస్తుంటారు లెండి.

snkr said...

కృష్ణశ్రీ గారు, మీరు చెప్పింది ఓ విధంగా కరక్టే అనుకోండి. మరి చర్చల ద్వారానే కదా సమస్యా-సందేహాలను పరిష్కరించుకోవాలి? నే చెప్పిందే వేదం , ప్రశ్నించిన వాడు 'ధిక్కారమూ చేసినట్టే అహంకారి, మూర్ఖుడు, చవట, దద్దమ్మ, వితండవాది, ఏ సబ్జక్ట్ లో ఎమినెన్సు లేనివాడొవాడూనూ (ఆయనే వుంటే మంగలోడు ఎందుకు?), వాడి బొందపెట్టాలి, అనే ఒంటెద్దు పోకడలు మొదలౌతాయి.

మనం స్వయంగా కొట్టుకోనిదే ఎదుటి వాడి బాధ మనకెలా అర్థమవ్వాలి? నో పెయిన్స్ నో గెయిన్స్ , అందుకే తీరికవేళల్లో కొట్టుకోవడం కూడా వుండాలి. బాల్యానాం రోదనం బలం అని వూరకే అన్నారా? :))

కృష్ణశ్రీ said...

డియర్ వెంకట్!

మాలతీ చెందూర్ 'హిస్టారియన్' కాదు. మీరు పుట్టక ముందు దశాబ్దాల క్రితమే ప్రపంచం గుర్తించింది ఆవిడెవరో! మీరున్న బావి లోంచి బయటికి వచ్చి, కొంచెం అవగాహన పెంచుకోండి ప్రపంచం గురించి!

ఇక విషయం పూర్తిగా చదవకుండానో, అవగాహన చేసుకోకుండానో అనవసరం గా ఆవేశపడేవాళ్ళని 'పినాకొ'లు అంటున్నారు బ్లాగులోకం లో! (ఆవేశపడినకొద్దీ వాళ్ళ ముక్కు పొడుగయిపోతుందట మరి!)

మీరుకూడా వాళ్ళలో ఒకరౌతామంటే, నాకేమీ అభ్యంతరం లేదు! మీ ఆనందం మీది!

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

డియర్ snkr!

ఆరోగ్యకరమైన చర్చ యెప్పుడూ మంచిదే.

అలా అని నేలవిడిచి సాములు చేసి మరీ కొట్టుకోవడం యెందుకు!

బాలానాం రోదనం బలమే! ('బాల్యానాం' అన్న మీ సంస్కృతం కూడా బాగుంది)

ధన్యవాదాలు.

Anonymous said...

'బాల్యానాం' అన్న మీ సంస్కృతం కూడా బాగుంది)
:) Thanks. inkaa samskRtam vastundi kaani ikkaDa baagOdu lEnDi.

Anonymous said...

mI samskRtAnni maDicI......

కృష్ణశ్రీ said...

బాబూ.....Anonలూ!

నాకు సంస్కృతం రాదని ఇదివరకే చెప్పాను.

మీకొచ్చిన సంస్కృతాన్ని మీ ఇంట్లోనూ, వుంటే మీ బ్లాగుల్లోనూ వాడుకోండి--నా బ్లాగులో వద్దు.