బాబ్లీ-2
"లాఠీలకు వెరవకుండా, అక్కడి పోలీసుల దురుసు ప్రవర్తనను సహించి, సాహసంతో బాబ్లీని అడ్డుకునేందుకు తెలుగుదేశం చేసిన పోరాటాన్ని హృదయపూర్వకం గా అభినందిస్తున్నాను" అన్నారట రోశయ్య--తెలివైనవాడు కదా.
నోటితో మెచ్చుకుంటూ, నొసటితో వెక్కిరించడం అంటే ఇదే.
వాళ్ళు వెళ్ళింది అడ్డుకోడానికీ, పోరాటానికీ కాదు--అఖిలపక్షం లోగా వాస్తవ పరిస్థితిని చూడడానికి అన్న విషయాన్ని యెంత తెలివిగా పక్కదారి పట్టించాడో చూడండి!
ఇంకా, 1995 నించీ మీరేమీ చెయ్యకపోవడం వల్లే సమస్య ముదిరింది--అంటూ యెదురుదాడి మామూలే.
"బాబ్లీ గురించి పత్రికల్లో చూసేదాకా ప్రభుత్వానికేమీ సమాచారం లేదు" అని పదే పదే వారి ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రకటించిన విషయాన్ని మరిచిపోతున్నారు. 2005 లో లేని సమాచారం 1995 లో యెలా వుంటుంది ప్రభుత్వం దగ్గర?
ఆ తరవాత మరో పదమూడో, పదిహేడో ప్రాజెక్టులగురించి కూడా ఇలాగే ప్రకటించారు--అసెంబ్లీ లో!
జనాల ఙ్ఞాపక శక్తి చాలా తక్కువ అనే వాళ్ళ నమ్మకం.
ఇక మన గుంటూరు ఎం పీ రాయపాటి, "మంగళవారం వుదయం నేను అధినేత్రిని కలిసి, చెపితేనే, ఆవిడ మరాఠా ముఖ్యమంత్రితో మాట్లాడి, 'సమస్య జటిలం కాకుండా చూడాలని' ఆదేశించినట్టూ, 'మరాఠా ముఖ్యమంత్రిని ఓ రకం గా మందలించారు' అనీ, స్వకుచమర్దనం చేసుకుంటూ, పళ్లికిలిస్తున్నారు.
మంగళవారం వుదయం 9-00 లోపే, ఇంకా చాలా మంది 'వేప్పుల్లలతో' దంతధావనం చేస్తూండగానే, పూర్తిగా కాలకృత్యాలు తీర్చుకోకుండానే వాళ్ళని పోలీసులు చితకబాదారని పత్రికలూ, టీవీలూ చూపించాయి.
మరి ఆవిడ నిద్రలేచి, బాత్రూముకి కూడా వెళ్ళకుండానే, మన రాయపాటి 'ఆవిడని కలిసి........'అని మనని నమ్మమంటాడు.
పైగా 'సమస్య జటిలం కాకుండా' అంటే, వాళ్ళని చావబాది, బస్సులెక్కించమని అర్థమా; అదికూడా ఆవిడే చెప్పిందా అన్న విషయం లో ఈయనేమీ మాట్లాడడం లేదు.
బాబూ! మీకంత సీనే వుంటే, ఇలాంటి సమస్యలే వచ్చేవి కాదు అంటున్నారు మన తెలుగు వాళ్ళు. అవునా?
ఇక, ఒకప్పుడు తననుతాను 'మరాఠా సింహం' గా అభివర్ణించుకున్న ముసలి రాజకీయ పందికొక్కు బాల్ ఠాక్రే, "బాబేమన్నా మీ ఇంటల్లుడా? వాడికి ఆంధ్రాలోనే జైలుగుడ్డలు వేసి, మన జైల్లో చిప్పకూడు యెందుకు తినిపించలేదు?" అని ఘుర్ఘురించాడట వాళ్ళ ముఖ్య మంత్రిని!
అఫ్ కోర్స్--వాడి ప్రతి పక్ష పాత్ర వాడు పోషిస్తున్నాడు--రక్తి కట్టేలా!
సొంత కొడుకే వాణ్ణి గుడ్డలూడదీసి చితక్కొట్టినంతపని చేసినా వాడికి బుధ్ధి రాలేదు--రాబోదు! వాణ్ణేమీ అనఖ్ఖర్లేదు మనం.
"తెదేపా యాత్రని రాజకీయాలతో ముడిపెట్టడం సరి కాదు. అలా అయితే, మధు యాష్కీ సుప్రీం కోర్టులో కేసు వెయ్యడమూ రాజకీయమేనా?....వుప యెన్నికలకూ, తెదేపా బాబ్లీ చూసేందుకు వెళ్లడానికీ సంబంధం లేదు" అంటూ అమూల్యం గా తన అభిప్రాయాన్ని ప్రకటించారు--'కాకా' వెంకట స్వామి.
"....నేతలను హైదరాబాదు పంపడం 'ఆమె నిర్ణయమే' అయి వుండవచ్చు అని భావిస్తున్నా" అని మళ్ళీ సన్నగా నొక్కుతూ, తన వీర విధేయతని చాటుకున్నారు.
ఇక 'నాందేడ్' ఎంపీ, భాస్కరరావు పాటిల్, "వాళ్ళని వాళ్ళే కొట్టేసుకుని, గాయ పడ్డారు. తరవాత పోలీసులపై దాడి చెయ్యడం తో 'యెనిమిది మంది'...కాదు కాదు..'ఆరుగురు పోలీసులు' గాయ పడ్డారు" అని చెప్పాడట!
"ఆంధ్రా నించి పైసాకూడా తీసుకోలేదు.....సుప్రీం కోర్టు గేట్లు పెట్టద్దనలేదు....." అంటూ అవాకులూ చవాకులూ పేలాడట!
ఇలాంటి బఫూన్ వెధవలకి వోటు వేసిన నాందేడ్ ప్రజలని--కాదు వోటర్లని--అనాలి!
ఇక మన గౌరవనీయ హైకోర్టు, "తెదేపా అధినేత చట్టాన్ని వ్యతిరేకించవచ్చా? శాంతి భద్రతల సమస్యను సృష్టించవచ్చా? అన్నీ తెలిసిన వ్యక్తి అక్కడికెందుకు వెళ్ళారు? ఇది ప్రచారం కోసం దాఖలు చేసినట్లుగా వుంది!" అనే కాకుండా, "ఈ కేసులో అవసరమైతే (పిటిషనరు కి) జరిమానా కూడా విధించాల్సి వుంటుంది" అని వ్యాఖ్యానిస్తూ బెదిరించింది(ట).
"ప్రి జుడిస్" కి చక్కని వుదాహరణ కదూ ఇది?
10 comments:
హైకోర్టుది కాదు, మీది ప్రిజుడిస్.
"ఇలాంటి బఫూన్ వెధవలకి వోటు వేసిన నాందేడ్ ప్రజలని--కాదు వోటర్లని--అనాలి!"
నాందేడ్ ప్రజలకి అతను హీరోలాగా కనిపిస్తాడు కానీ బఫూన్ లాగా ఎలా కనిపిస్తాడూ?
Public faith in the Indian judiciary is already at a low ebb. Added to this, we have, for the past half a decade or so, been witnesses to the sort of judges who conduct themselves like political appointees and pass rulings which sound 100% favourable to the powers that be. It is as if they are simply reading out a script prepared by the highers up there.
డియర్ హరి దోర్నాల!
క్రింద Anonymous ఇచ్చిన కామెంట్ సరిపోతుందనుకుంటా...!
ఇంకా కావాలంటే, నా పాత టపాలో, సమైక్య ఆంధ్ర వుద్యమం రాజుకోగానే, వున్నత న్యాయ స్థానం 'సందట్లో సడేమియా గా' స్టే ని తొలగించడం, గాలివారు కొన్నివేల టన్నుల ఇనుపఖనిజాన్ని తరలించడం' గురించి వ్రాశాను--గుర్తు చేసుకోండి!
డియర్ శరత్ 'కాలమ్'!
అంటే, నాందేడ్ వోటర్లని గొర్రెలంటారా? కాదుస్మీ! వాళ్ళని వోటువెయ్యనివ్వని రా నా లు తోడేళ్ళు!
రామస్వామిలనీ, దినకరన్ లనీ యేమి చెయ్యగలిగాము?
"వోటు" తోనే ప్రతీదీ సాధ్యం!
కృష్ణశ్రీ గారు: మంచి ప్రశ్నలు సంధించారు! నెనర్లు!
డియర్ AMMA ODI!
చాలా సంతోషం.
ధన్యవాదాలు.
>>>సొంత కొడుకే వాణ్ణి గుడ్డలూడదీసి చితక్కొట్టినంతపని చేసినా వాడికి బుధ్ధి రాలేదు--రాబోదు! వాణ్ణేమీ అనఖ్ఖర్లేదు మనం.
కృష్ణశ్రీ గారు: బాల్ ధాక్రే గురించిన ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? దాని పూర్వాపరాలు తెలియజేయగలరా?
డియర్ AMMA ODI!
కొన్నేళ్ళ క్రితం, శివసేన పార్టీ ఆధిపత్యం గురించీ, పార్టీ ఆఫీసు గురించీ రాజ్ ఠాక్రే తండ్రి తో గొడవ పడ్డాడు. తన అనుచరుల్తో పార్టీ ఆఫీసుమీద దాడి చేయించాడు. అప్పుడు జరిగిందంటారు.
తరవాత అదేదో 'మంచ్' అనో యేదో పెట్టుకున్నాడు రాజ్.
తన వారసుడు 'ఉధ్ధవ్' అని ప్రకటించాడంటారు బాల్.
Post a Comment