Monday, July 19

అంతర్రాష్ట్ర....

.....దురన్యాయం
"మేమేమైనా టెర్రరిస్టులమా? బాంబులూ తుపాకులూ తెచ్చామా? ఇక్కడకి రావడానికి పాస్ పోర్టూ, వీసా కావాలా? ప్రాజెక్ట్ చూస్తే తప్పేమి వుంది? యెందుకు అరెస్టు చేస్తారూ?"
ఇవీ చంద్రబాబు లేవనెత్తిన ప్రశ్నలు. అన్నీ సబబుగానే వున్నాయి కదా?

జరిగే పనులూ, గొడవలూ జరుగుతూనే వుండగా, ఈయన యేమి సాధిద్దామని అక్కడికి వెళ్ళాడో, ఆ ప్రాజెక్ట్ ని చూడనిస్తే ఆ ముఖ్యమంత్రికేమి నష్టమో--ఇలాంటివన్నీ రాజకీయ రాక్షసులకి తప్ప సామాన్యులకి అర్థం అవుతాయనుకోను.

ఈ విషయాలు పక్కన పెడితే--

ఇదివరకు తెదేపా నేతలు వెళితే, సరిహద్దుల్లో వాళ్ళ జనాలని సమీకరించి, పోలీసులని మోహరించి, వీళ్ళమీద లాఠీలతో వీరవిహారం చేశారు.

ఇప్పుడు కూడా, నిన్న (18-07-2010) పోలీసులకి కొంత బిజీ తగ్గాక, మీడియా వాళ్ళని యేదో వంకతో వాళ్ళ రాష్ట్రం లో కొంత దూరం తీసుకెళ్ళి, వాళ్ళు వెనక్కీ ముందుకీ కదలడానికి వీల్లేకుండా చేసి, అదే సమయం లో సరిహద్దుల్లో అందోళన చేస్తున్న జనాలనీ, మీడియా వాళ్ళనీ--చితక బాదారు. మన రాష్ట్రం లో చాలా దూరం లో పొలం పనులు చేసుకుంటున్నవాళ్ళని కూడా బాదారుట.

మామూలుగా కూడా యెవరినీ ఆ సరిహద్దు దాటకుంటా కట్టడి చేసేశారు ఇన్నాళ్ళ నించీ!

ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి, వాళ్ళ అధినేత్రి దగ్గరకి వెళ్లి, ఇంకా కొన్ని మెలుకువలు నేర్చుకొని మరీ వచ్చారట.

నా దృష్టిని ఆకర్షించిందేమిటంటే, పత్రికలవాళ్ళతో 'మహారాష్ట్రకి స్వయం ప్రతిపత్తి గురించి మా మధ్య మాటలు జరగలేదు' అని ఆయన అన్నాడట.

ఇవన్నీ చూస్తుంటే, సమీప భవిష్యత్తులోనే, రాష్ట్రాలు కూడా--(దేశం నుంచి) "సోదరుల్లా విడిపోదాం" అనే పరిస్థితి దాపురించేందుకు ఆ పార్టీ పెద్ద యెత్తున కుట్ర చేస్తోందేమో అనిపిస్తూంది.

మరి యేమవుతుందో! 

6 comments:

Anonymous said...

అన్నీ నీల్లు మాకే కావాలంటే పక్కవాలు కుల్ల పొడవరా ఎంది !!!

అమ్మఒడి said...

>>>రాజకీయ రాక్షసులు
బహుగొప్ప పద ప్రయోగమండి. బాగుంది.

A K Sastry said...

డియర్ duckword!

ఇలాంటి కామెంట్లు చేసేవాళ్ళకి బ్లాగులోకం లో ఓ పేరు పెట్టాం "పినాకొ" అని.

వాళ్ళు ఆవేశం గా చేసిన కామెంట్లు పెరిగే కొద్దీ, వాళ్ళ ముక్కు కూడా పెరిగి పోతూంటుంది.

"అన్నీ నీల్లు మాకే కావాల"న్నాడా యెవడైనా?

"పక్కవాలు" యెవరు?

"కుల్ల పొడవ"డం "ఎంది"?

తెలుగు చదవడం, చక్కగా వ్రాయడం, నేర్చుకొని, జరిగిన చరిత్రా, న్యాయ/చట్ట పరిస్థితీ, ప్రభుత్వాల బాధ్యతా, చట్ట సభల సభ్యుల హక్కులూ, బాధ్యతలూ--ఇలాంటివి చదివి, తెలుసుకొని, బ్లాగితే బాగుంటుంది.

మొదలుపెట్టండి మరి!

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ అమ్మఒడి!

నాకు తెలిసినంతవరకూ ఈ ప్రయోగం ఇదివరకు వున్నదేనమ్మా!

రాజకీయ నాయకులని రా.నా. లు అనీ, వాళ్లలో రాక్షసుల్ని రా.రా. లు అనీ!

ముందు యెవరు వాడారంటే మాత్రం, నాకు గుర్తు రాదు.

ధన్యవాదాలు.

Anonymous said...

వారీ, నాకు మీలాగ "కమ్మ"ని తెలుగు రాదండి కొనాపి గారు

A K Sastry said...

"కమ్మ" తెలుగు అనోటి వుందని నాకు తెలియదు.

బహుశా మీకు తెలిసిన ఆ భాషలోదా మీరు వ్రాసిన ఆ చివరి మాట?