Friday, June 25

ప్రజల సంపదకి......

......ధర్మకర్తలు

"సంపదకి సామాన్య ప్రజల తరఫున ధర్మ కర్తలుగా వ్యవహరించండి!" అని కోరేవాడట--మన మహాత్ముడు గాంధీ!

టాటా బిర్లాల దగ్గరనించి చందాలు స్వీకరిస్తూ, వాళ్ళకి ఇలాంటి సలహాలిస్తాడేమిటీ పిచ్చి ముండాకొడుకు? అని ఆశ్చర్యపోయాను మొదటిసారి నా చిన్నప్పుడు ఈ విషయం చదివినప్పుడు.

ఆయన ఆ విషయం చెప్పిన దాదాపు వందేళ్ళ తరవాత, ప్రపంచ సంపద యెక్కువ మూటకట్టుకున్నవాళ్ళు ఇప్పుడు చెపుతున్న, చేస్తున్న పనులు చూస్తూంటే, 'యెంత నిజం చెప్పాడు మహాత్ముడు!' అని ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది ఇప్పుడు!

"వూరి వెలుపల పాడు కోనేటి చెంత
మనుజులెవ్వరు మసలని మారు మూల
గుట్ట చాటున లోతైన గోయి త్రవ్వి
పసిడి దాచెను పిసినారి ముసలి ఒకడు!"

ఇలా దాచడం వల్ల వుపయోగం లేదు అని గ్రహించడమే కాదు, అలా దాచేవాళ్ళందరికీ పాఠాలు చెప్పడానికి కంకణం కట్టుకున్నాడు--వారెన్ బఫెట్! ఆయనకి తోడుగా, బిల్ గేట్స్!

"నా సంపదలో 1% చాలు నా వారసులూ, నేనూ హాయిగా బతకడానికి" అంటున్నాడాయన--ఆ 1% విలువ కొన్ని వేల కోట్లు మరి!

మిగతా ఆస్థుల్ని 'ప్రపంచ పేదల' కోసం ట్రస్టులకి దానం ఇవ్వడమేకాదు, మిగతా ప్రపంచ కోటీశ్వరులని అందరినీ కలిసి, వాళ్ళు కూడా 'అదేపని' చెయ్యమన ప్రొత్సహిస్తున్నాడు బఫెట్! (ఇంకా వాళ్ళెవరూ ఈ మాట విన్నట్టు లేదు మరి.)

కానీ, మన దేశం లో--

==> హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ 'శివ్ నాడార్' 580 కోట్లు గురువారం నాడు దానం చేశాడు!

==> టెక్ మహీంద్రా ఎం డీ వినీత్ నయ్యర్ కంపెనీలో తన వాటాలో మూడో వంతు--తన భార్య నిర్వహిస్తున్న ఓ స్వచ్చంద సంస్థకి దానం చేశాడు!

==> ఆజీమ్ ప్రేమ్‌జీ, నారాయణ మూర్తి, సుధా మూర్తి, ఇప్పటికే వందల కోట్ల తో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు!

==> నందన్ నీలేకణి భార్య రోహిణి కూడా 40 మిలియన్ డాలర్లు దానం చేశారు!

2009 లో ఇలా దాతృత్వం కోసం కేటాయించబడ్డ సొమ్ము దాదాపు 3,487.12 కోట్లకి చేరుకొందట!

బాపూ! నీకు, నీ దూర దృష్టికీ జోహార్లు!

2 comments:

amma odi said...

మీరు రెండోసారి ఇచ్చిన వ్యాఖ్య కూడా publish అవ్వలేదండి. ఇతర కామెంట్లతో పాటు select all కొట్టి publish చేసాను. మిగిలినవి పబ్లిష్ అయ్యాయి.మీ వ్యాఖ్య రాలేదు. కారణం నాకు తెలియదు. :)

A K Sastry said...

డియర్ AMMA ODI!

పోనీలెండి--విషయం మీకూ, ఇంకా అర్థం అవవలసినవాళ్ళకీ ఈపాటికి అయ్యేవుంటుంది కదా.

ధన్యవాదాలు.