మీడియా
వార్తా పత్రికలూ (ప్రింట్ మీడియా), టీవీలూ, కంప్యూటర్లూ వగైరా (ఎలక్ట్రానిక్ మీడియా), రేడియోలూ ఫోన్లూ, (ఇదేమి మీడియానో తెలీదు) ఇలాంటివన్నీ “మీడియా” అంటున్నారు.
ప్రజాస్వామ్య దేశం లో ఇది చాలా శక్తివంతమైనదట!
మరి అలాంటి మీడియా యెంత బాధ్యతాయుతంగా వుండాలీ?
పేపర్లలో మొన్న ముంబాయిలో తీవ్రవాదుల దాడి సందర్భంగా ఇండియా గేట్ దగ్గర మోహరించిన కెమేరాలూ వగైరా ని తీసి ప్రచురించిన ఫోటోలు చూశారుగా?
ఇప్పుడు దర్యాప్తు సంస్థలు తేల్చినదేమిటంటే, ఈ లైవ్ టెలీకాస్టుల వల్ల ఉగ్రవాదుల నాయకులకి యెప్పటికప్పుడు తాజా స్థితి తెలెసిపోయేది అనీ, వాళ్ళు మళ్ళీ ముంబాయిలో తీవ్రవాదులకి తాజా ఆదేశాలు జారీ చేసేవారనీ!
అదే కాదు—ఓ పక్క ఒక సంఘటన జరిగితే, దర్యాప్తు సంస్థల కన్నా ముందు ఆ స్థలాన్ని చేరుకొని, అంతా కంగాళీ చేసేసి, అధారాలని దొరక్కుండా చేస్తున్నవి ఈ మీడియాలే!
అదే అమెరికా లాంటి దేశాల్లో, నిరంతర పెట్రోలింగ్ వగైరాల వల్ల, సంఘటన జరిగిన రెండు మూడు నిమిషాల్లోనే, పోలీసులు అక్కడికి చేరి, సంఘటన స్థలం చుట్టూ పసుపు రంగు రిబ్బన్లు కట్టేసి, ఇంకెవర్నీ ఆ స్థలంలోకి రానివ్వరు! మీడియా వాళ్ళని కూడా! వాళ్ళు అవసరమైన ఆధారాల్ని సేకరించాక, అప్పుడు మీడియాని అనుమతిస్తారు! అప్పుడు నేరగాళ్ళని పట్టుకునే అవకాశాలు చక్కగా వుంటాయి.
ఇంక ప్రింటు మీడియాలో కూడా, కొంతమంది సోకాల్డ్ ‘ఎక్స్పర్ట్’ కాలమిస్టులు తమ అభిప్రాయాలని విచ్చలవిడిగా వెదజల్లుతూ వుంటారు! ఉదాహరణకి, ఓ కాలమిస్ట్ “గత కొన్ని రోజులగా వడ్డీ భారాలతో నడ్డి విరుగుతున్న ‘సామాన్యుడు’ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యలతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాడు” అంటాడు!
సంక్షోభం అంటూ చెప్పుకుంటున్న స్థితి మొదలయ్యాక, ఇప్పటివరకూ అలా ‘నడ్డి విరిగిన’ ఒక్క సామాన్యుణ్ణయినా చూపించ గలడా, ఆ కాలమిస్ట్?
ఇంకొకడున్నాడు—వాడు ఎమర్జన్సీ టైములో గవర్నమెంటుని నిర్భయంగా కలంతో యేకేశాడు. తరవాతకూడా ఇందిరాగాంధీ చేస్తున్న తప్పులనీ, ఏ ఆర్ ఆంటులే, అర్జున్ సింగ్ లాంటి అవినీతి పరుల్ని యేకేశేవాడు. తరవాత, జనతా ప్రభుత్వాన్ని—అసలు సమస్యేకాని ‘ద్వంద్వ సభ్యత్వం’ లాంటి కారణాలతో, పడిపోయేదాకా వదల్లేదు! రాజీవ్ టైములో ‘బోఫోర్స్ ‘ నీ, వీపీ సింగ్ టైములో సెయింట్ కిట్స్ కేసునీ, ఇలా యేదీ వదిలేవాడు కాదు. వాజపేయి గారి టైములో, ‘కాషాయీకరణ’ అనేవాడు. మరిచిపోయాను—పాకిస్థాన్ మీద ఎక్స్పర్ట్! పదిరోజులకోసారైనా అక్కడికి వెళ్ళి వస్తూ వుంటాడు. పాకిస్తాన్ ని కౌగిలించుకోవాలంటాడు. కాశ్మీరు మండిపోయినా, ముంబాయి పేలి పోయినా, పార్లమెంటు దద్దరిల్లినా—పాకిస్థాన్ తో స్నేహ సంబంధాలకి భారత్ మాత్రమే ముందడుగు వేస్తూ వుండాలంటాడు!
ఇలాంటి మీడియాల వల్ల ప్రజాస్వామ్యానికి యేమి ఒరుగుతోందో యెవరికి వారే అలోచించాలిమరి!
2 comments:
KrishnaSree,
I think that you are pointing out Kuldeep Nayyar.
It looks like that these people have love for their mother land. Many of them wer born there before independence.
They use India's Democractic Freedoms and Liberties for their advantage. They have no b**** to write against Pakitan.
They are misusing India's tolerent pluralistic traditions to its(India's) disadvantage.
This tamasha go on until they destroy our beautiful country.
డియర్ శ్రీనివాస్!
మనం గట్టిగా అనకూడదు! మీరన్నవాటితోపాటు, వయసు తెచ్చిన 'పెర్వర్షన్స్ ' కూడా తోడవుతాయి!
అయినా, మన దేశాన్ని నాశనం చేసేవరకూ వాళ్ళని అలా వదిలేస్తామా? యెప్పటికీ కాదు!
Post a Comment