Monday, December 22

టీం సోనియా!

ఉలిపికట్టా…..గూఢచారా?

అనినీతి కుంభకోణాల భీష్ముదు—ఏ ఆర్ ఆంటూలే మహశయుడు నోరు విప్పాడు—అది నోరా, సెప్టిక్ టాంకా అనిపించే విధంగా!

ఊరందరూ (దేశ విదేశాలన్నీ) పాకిస్థాన్ ని వేలెత్తి చూపిస్తుంటే, వీడు ముంబాయిదాడులు ఇంకెవరిపనైనా యేమో—అంటూ!

వీడు మన దేశానికే అవినీతి భీష్ముడు! (బై ది బై, క్రికెట్ టీము లో వీడు మిడిల్ ఆర్డరు!)

జయంతి ధర్మతేజ, ముంద్రాల్లాంటివాళ్ళు లక్షల్లో ప్రారంభించిన కుంభకోణాల్ని, మొదటిసారిగా కోట్లలోకి చేర్చిన రికార్డు హోల్డరు!

మహారాష్ట్ర ముఖ్య మంత్రిగా వుంటూ, “ఇందిరా గాంధీ ప్రతిభా ప్రతిష్ఠాన్” పేరుతొ అధికార దుర్వినియోగానికి పాల్పడి, కోట్లు నొక్కేసినవాడు!

అతి కష్టమ్మీద వీడి ముఖ్య మంత్రి పదవి పీక గలిగింది ఇందిరా గాంధీ! (గవర్నరు పదవి ఇచ్చింది లెండి).

తరవాత, అవినీతి ధృతరాష్ట్రుదు రాజీవ్ గాంధీ యేకంగా 46 కోట్ల “బొఫొర్స్" కుంభకోణంతొ కోట్ల కుంభకోణాలు సామన్యమైపోయాయి ఇండియాలో!

నాలుగో వికెట్ అర్జున్సింగ్ గారు, ‘జోర్హాట్ లాటరీ’ తొ జోర్హాట్ బాబా గా ప్రసిద్ధి చెందారు!

అసలు వీళ్ళందరికీ మన ‘అంధేర్ నగరి’ ‘అన్ భుజ్ రాజా’ కొలువులో వుండడానికి అర్హత యేమిటంటారు? రాజకీయ మహా మఱ్ఱి చెట్టు ఇందిరా గాంధీ పేరు చెప్పుకొని—కాయలుకూడా కాదు—కట్టెలు అమ్ముకోవడం తప్ప?

ఇందిరా గాంధీ ఓ గొప్ప నాయకురాలే! ఆమె సమర్ధతనీ, దేశాభివృద్ధి పట్ల ఆమె నిబద్ధతనీ యెవరూ ప్రశ్నించలేరు—కానీ, వోటు రాజకీయ, వోటు బ్యాంకు రాజకీయాల వల్ల వీళ్ళందర్నీ భరించవలసి వచ్చింది!

ఆ దరిద్రం ఇప్పటి వరకూ దేశాన్ని వదలడంలేదు—ఆవిడ కోడలు పుణ్యమాని! అసలు ఆ చేట పెయ్యని నిలబెట్టింది ఈ వెధవలే కాదూ?

వృద్ధ జంబుకం (మూడో వికెట్--రక్షణ మంత్రి) తాటాకు చప్పుళ్ళు చేస్తోంది—పాకిస్ఠాన్ తోడేలు పై! ‘మేము దేనికీ వెనుకాడం’ లాంటి మాటల్తో! అమెరికా, ఇతర దేశాలూ తెగేసి చెప్తున్నాయి ‘పాకిస్థాన్ తీవ్ర వాదుల మీద చర్య తీసుకోకుంటే సహించేది లేదు!’ అని. ఈ మద్దతు తో ఇప్పటికే పీవోకే లోని టెర్రరిస్ట్ స్థావరాలని ఓ చూపు చూడవలసింది!

కానీ, దళాలని నడిపించ గలిగిన ‘మానెక్ షా’లేరీ? ఓకే అనగలిగిన ఇందిరా గాంధీలేరీ?

ఈ క్రికెట్ టీముల్ని హిందూ మహా సముద్రం లో కలపగలిగిన వొటరులేరీ?

వున్నారంటారా! సరే! చుద్దాం!

4 comments:

Srinivas said...

Krishna Sree గారు,

బాగా వ్రాసారు.

Corruption, Casteism, Communalism, Communism, Corporations, Commonman's ignorence are the tools available at Politicians disposal to capture power and rule over us.

Manohar said...

ఎన్.ఎస్.జి కమాండోలు డిల్లీ చేరడానికి 9 గంటలు పట్టింది. అదే కేంద్రంలో ఎవరైనా పొద్దున్న తుమ్మితే, మధ్యాహ్నానికి మన రాజా వారు చేరగలరు. మరి ఇలాంటి దేశంలో ఇంతకంటే ఏం చెయ్యగలం. చూడ్డం తప్ప

Krishna Sree said...

డియర్ శ్రీనివాస్!

మీరు వ్రాసిన 'ఆరో సీ' ని మార్చడానికి మనం 'లోక్ సత్తా' లాంటి వాటి ద్వారా ప్రయత్నించలేమా?

ఆలోచించండి! వీలైతే ప్రయత్నించండి!

అభినందనలు!

Krishna Sree said...

డియర్ మనోహర్!

మీరు వ్రాసిన నిజాలు సరే!

దీనికి కారణం--వ్రేళ్ళూనుకున్న 'బ్యూరాక్రసీ'!

ఉదాహరణకి ఒక దశలో బి.నాగిరెడ్డిగారు 'విజయ ప్రొడక్షన్స్ ' కీ,'వాహినీ ప్రొడక్షన్స్ ' కీ, మేనేజింగ్ డైరెక్టరు! విజయ ప్రొడక్షన్స్, వాహినీ స్టూడియో నిర్వహించేది. చేసుకున్న షూటింగులకి, వాహినీ ప్రొడక్షన్స్ వాహిని స్టూడియో నిమిత్తం విజయా ప్రొడక్షన్స్ కి బాకీ పడింది!

అప్పుడు, నాగిరెడ్డిగారు విజయా ప్రొదక్షన్స్ తరఫున "మా డబ్బెప్పుడు కడతారు?" అని లేఖ వ్రాశేవారు!

మళ్ళీ వాహిని తరుఫున, "అప్పుడే ఇవ్వలేం! రెండు మూడు నెలలు గడువివ్వండి." అని జవాబు వ్రాసేవారు!

ఇలాంటి బ్యూరాక్రసీని నియంత్రించలేని చట్ట/శాసన సభల్ని యెన్నుకొన్నవాళ్ళది కాదా తప్పు? దీన్ని మార్చ లేమా?

ఆలోచించండి! వీలైతే ప్రయత్నించండి!

అభినందనలు!