675,16,43,600
రేపు జనవరి ఫస్ట్ కి ప్రపంచ జనాభా చేరుకోబోతున్న అంకెట ఇది!
అది కూడా అభివృద్ధి చెందిన దేశాల్లోనే పెరుగుదల శాతం యెక్కువట! (అచ్చు పొరపాటై వుంటుంది—‘చెందుతున్న’ అని వుండవలసింది.)
మరి మనదేశంలో మనవంతు కృషి?
ఎందుకు చెయ్యడంలేదు—అంటారా?
అదే—తితిదే తరఫున వేలాది సామూహిక వివాహాలూ, వీళ్ళని చూసి ఇతర మతాలవాళ్ళు కూడా సామూహిక వివాహాలకి ప్రొత్సాహకాలు అందించడం—ఇలా శాయ శక్తులా కృషి చేస్తున్నాం!
మొన్నీ మధ్య ఓ బాలీవుడ్ నటీమణి, జనాభా పెరుగుదలని అరికట్టక పోవడం వలననే ‘సునామీలూ’ వగైరా వస్తున్నాయి అందిట! (పాపం తను చదువుకున్న ‘మాల్థూజియన్ థియరీ ఆఫ్ పాప్యులేషన్’ లోని పాజిటివ్ చెక్స్ వగైరా గుర్తొచ్చి ఎదో అని వుంటుంది!—మీడియా దాన్ని సందర్భ రహితంగా వుపయోగించుకొంది!)
జనాభా పెరుగుదల అరికట్టాలంటే, మేధావులు చేస్తున్న ముఖ్య సూచన, ఇష్ట పడిన స్ట్రీ పురుషులు ‘కలిసి వుండడం’ ని చట్టబద్ధం చెయ్యాలని! కొన్ని దేశాల్లో ఇది అమల్లో వుందట!
నిజంగా చాలా మంచి సూచన! సమాజం కూడా బాగుపడుతుంది!
ఓ పాతిక సంవత్సరాల క్రితం, ఉత్తర భారతంలో ‘మైత్రీ కరార్’ అని వ్రాసుకుని, రిజిష్టర్ చేయించుకునేవారు.
అంటే ఓ ఆడా ఓ మగా ‘మేమిద్దరం స్నేహం గా వుండదలుచుకున్నాం’ అని ఒప్పందం వ్రాసుకొని, మిగిలిన షరతులన్నీ పకడ్బందీగా వ్రాసుకునేవారు—‘తోడుకోసం, సామాజిక భద్రతకోసం మాత్రమే, యెవరి సంపాదనా ఖర్చూ వారివే, ఒకవేళ పిల్లలు పుడితే ఏమి, ఎలా చెయ్యాలి—లాంటివన్నీ కూడా వ్రాసుకొని, రిజిష్టరు చేయించుకునేవారు!
అప్పట్లో, ఓ హైకోర్ట్ ఈ కరార్లు చెల్లవు అని తీర్పు ఇచ్చినట్టు గుర్తు.
ఇప్పటికైనా ఇలాంటివి చట్టబద్ధం చేస్తే, సగం సామాజిక సమస్యలు, ప్రేమోన్మాదాలూ, యాసిడ్ దాడులూ లాంటివి తప్పుతాయి!
ఏ పార్టీ అయినా ఇలాంటి వాగ్దానంతో పోటీ చేసే ధైర్యం చేస్తుందా?
4 comments:
Krishna Sree గారు,
మీరు మంచి విషయము మీద చర్చ మొదలు పెట్టారు.
I think this like a two sided sword.
I will write my views on this subject later.
Dear Rishi!
Thank U for your response!
I'm waiting!
Krishna Sree గారు ఇలా వ్రాసారు,
---------------
1) జనాభా పెరుగుదల అరికట్టాలంటే, మేధావులు చేస్తున్న ముఖ్య సూచన, ఇష్ట పడిన స్ట్రీ పురుషులు ‘కలిసి వుండడం’ ని చట్టబద్ధం చెయ్యాలని! కొన్ని దేశాల్లో ఇది అమల్లో వుందట!
2) నిజంగా చాలా మంచి సూచన! సమాజం కూడా బాగుపడుతుంది!
3) అంటే ఓ ఆడా ఓ మగా ‘మేమిద్దరం స్నేహం గా వుండదలుచుకున్నాం’ అని ఒప్పందం వ్రాసుకొని, మిగిలిన షరతులన్నీ పకడ్బందీగా వ్రాసుకునేవారు—‘తోడుకోసం, సామాజిక భద్రతకోసం మాత్రమే, యెవరి సంపాదనా ఖర్చూ వారివే, ఒకవేళ పిల్లలు పుడితే ఏమి, ఎలా చెయ్యాలి—లాంటివన్నీ కూడా వ్రాసుకొని, రిజిష్టరు చేయించుకునేవారు!
4) ఇప్పటికైనా ఇలాంటివి చట్టబద్ధం చేస్తే, సగం సామాజిక సమస్యలు, ప్రేమోన్మాదాలూ, యాసిడ్ దాడులూ లాంటివి తప్పుతాయి!
5) ఏ పార్టీ అయినా ఇలాంటి వాగ్దానంతో పోటీ చేసే ధైర్యం చేస్తుందా?
-------------
మీరు మంచి విషయం మీద discussion start చెసారు. But I have some doubts and questions about some of the assumptions and hypothesis.
Overall I agree with your observations.
1) If One adult male and one adult female want to live together, government should recognize such unions. I agree with this.
But I don't understand the reasoning of మేధావులు!. జనాభా ఎలా అరికట్ట బడుతుంది? For example while living together if they produce 10 children together as opposed to 2 children while married, how the population is controlled?
Is there any scientific study on this subject is available?
2) మంచి సూచన ఎలా అవుతుంది? సమాజం ఎలా బాగుపడుతుంది? We need further explanation and need the proof through a scientific study.
3) It should be allowed and government should recognize it legally. I agree with this.
4) చట్టబద్ధం చేస్తే!. How it solve సామాజిక సమస్యలు, ప్రేమోన్మాదాలూ, యాసిడ్ దాడులూ? Need more explanation and a scientific study is required here to prove this hypothesis.
5) As long as there is no restriction on how many children the couple has to produce, I think that the minorities won't oppose it (who knows).
Hindus don't mind, because educated Hindus only produce one or two children.
I don't know about Liberal Progressives, Communists and Social & Political left.
Indians must be careful about
"Gay Marriage"#1 issue. The West (particularly America) is in great turmoil about this issue.
#1: Marriage between one man and another man. Marriage between one women and another women.
Regards,
రిషి
Dear Rishi,
Kindly read my next posts, which I hope will clarify some of your querries.
Thank you.
Post a Comment