Friday, October 24

"8701"---ఇంకో 702 చాలు!

చెప్పానా, సంతొషించే వాళ్ళలో మొదటివాడిని నేను అని! (సెన్సెక్స్ పడిపోతే). ఇవాళ్టి ఫిగరు 8701!
ఏదో పద్యం చెప్పావే------అంటున్నారా! వస్తున్నానక్కడకే!
ఓ పీనాసి, తన దగ్గరున్న బంగారాన్నంతా పద్యంలో చెప్పినట్టు ఓ గోతిలో పాతిపెట్టి, రోజుకోసారి వచ్చి చూసుకుంటుండేవాడట! తరవాత విషయం అందరికీ తెలుసు కదా?
కానీ ఈ కేసులో, బంగారం పిల్లల్ని పెట్టదు కదా?

ఇప్పుడు మోడర్న్ పీనాసులు--వాళ్ళ దగ్గరున్న కొద్దో గొప్పో డబ్బుని (కొంతమంది అప్పులు చేసి కూడా!) షేర్లలో పెట్టి, రోజూ సెన్సెక్స్ చూసుకొని, నా 'ఆస్తి ' ఇంత పెరిగింది....అంత పెరిగింది....అని ఆనందిస్తూ వుంటారు!

బిల్ గేట్స్, వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు తమ చెమటోడ్చి సంపాదించిన కాస్తో కూస్తొ డబ్బుతో ఓ కంపెనీ స్థాపించి, అది ఇంతింతై, వటుడింతై పెరుగుతుంటే, ఆనందిస్తూ, ఇంకా ఎక్కువ పెట్టుబడి అవసరమైతే, వాళ్ళ దగ్గర డబ్బు సరిపోక, కంపెనీలో కొంత షేర్ కేపిటల్ పబ్లిక్ ఆఫర్ చేస్తారు! ఆ షేర్లు లిస్టింగ్ అయ్యాక, వాటి విలువ పెరుగుతుంది (మార్కెట్ మాయాజాలం వల్ల--తగ్గినా తగ్గచ్చు!) కానీ, అసలు కంపెనీ పెట్టిన వాళ్ళు కొంత శాతం షేర్లు తమ దగ్గరే వుంచుకున్నారు కదా? వారి సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగినట్లు! (ఫోర్బ్స్ మేగజైన్ లాంటివి ప్రపంచంలో అత్యంత ధనికుడు అని ప్రకటిస్తూ వుంటాయి) కానీ, గోతిలో బంగారానికీ, వీటికీ తేడా యేమి వుంది? ఆ షేర్లు అప్పుడు అమ్మితే కదా--అంత డబ్బు వచ్చేది? అదీ సంగతి!

మరి చిదంబరానికీ నాకూ ఏ కంపెనీలున్నాయని సెన్సెక్స్ పెరిగితే అంత ఆనందం?

వాపుని బలుపుగా చూస్తూ, దేశ ఆర్ధిక వృద్ధి అంతా సెన్సెక్స్ మీదే ఆధారపడింది అనే విత్త మంత్రిని ఏమనాలి? అంత మేధావి అయిన మన ప్రధాని చెయ్యగలిగింది మాత్రం యేముంది? వేరే వుద్దేశ్యాలున్న వాళ్ళది కంట్రోల్!

నేను ముందే చెప్పినట్లు ఈ కాంగీరేసు పరిపాలనలోనే ఎందుకు వస్తున్నాయి.....ఈ దరిద్రాలన్నీ? జనతా పాలనలో, ఎన్.డి.ఏ. పాలనలో, వృద్ధి జరగలేదా? ద్రవ్యోల్బణం అదుపులో లేదా?
ఆలోచించండి!

బై ది బై, శ్రీ శ్రీ శత జయంతి సభల్లో కొన్ని చోట్ల, కొంత మంది ఆయన చెప్పిన కవితలూ, ఆయన ఆలోచనలూ ఇంకా, ఇప్పుడుకూడా వర్తిస్తాయా? అన్నారట! మీ అభిప్రాయం?
మరొకసారి వ్రాస్తా!

8 comments:

Rajendra Devarapalli said...

నేను ముందే చెప్పినట్లు ఈ కాంగీరేసు పరిపాలనలోనే ఎందుకు వస్తున్నాయి.....ఈ దరిద్రాలన్నీ? జనతా పాలనలో, ఎన్.డి.ఏ. పాలనలో, వృద్ధి జరగలేదా? ద్రవ్యోల్బణం అదుపులో లేదా?
ఆలోచించండి!
---ఎందుకంటారు? మరి అంతగొప్ప అమెరికా లో జరుగుతున్నది ఎందువల్లంటారు?? మీరు చెప్పాల్సిందే...

KumarN said...

మీ గురించి పర్సనల్ గా తెలీదు..కాని..ఈ బ్లాగులో కనిపిస్తున్న మిమ్మల్ని చూస్తే..మాత్రం భగవంతుడికి థాంక్స్ చెప్పుకోవాలని ఉంది. వయసు ఇంత పెరిగినా, బుద్ది మాత్రం ఇంకా నేలబారునే ఉండడం చూసి, మీకన్నా చిన్నవాణ్ణయినా నాక్కొంచెం అయినా బాలన్స్డ్ గా ఆలోచించడం నేర్పించినందుకు.

ఇప్పటి ఆర్ధిక సంక్షోబానికీ, కాంగ్రెస్సు ప్రభుత్వానికీ ముడిపెట్టిన మిమ్మల్ని అనుభవఙులు అనరు..ఐడియాలాగ్స్ అని అంటారు..

ఏ ఐడియాలజీ అయినా ప్రాగ్మాటిజం నుంచి మరీ దూరం అయ్యి, ఈ ఐడియలాగ్స్ ప్రపంచానికేం చేసారో ఏ దేశ, మత, సంఘ చరిత్ర చదివినా తెలుస్తుంది..కొంచెం ఇండిపిండెంట్ మైండుతో.

A K Sastry said...

డియర్ రాజేంద్రా!

అమెరికాలో జరుగుతున్నదాని గురించి నా ఇంకో బ్లాగ్ "ఎ సిటిజెన్ ఆఫ్ ది వర్ల్ద్" లో, 'బాంకింగ్' అనే నా పోస్ట్ కి వచ్చిన కామెంట్ కి ఇచ్చిన రిప్లయి లో వివరంగానే వ్రాసాను. చదవండి!

బుష్ గారి గవర్నమెంట్ 760 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ పేకేజి అరేంజ్ చేసింది......మిగిలిన బ్యాంకులు దివాళా తియ్యకుండా!

బేసిక్ గా అక్కడ జరిగిందే ఇక్కడా జరుగుతోంది! కాని, మనకున్న కమర్షియల్ బ్యాంకుల పునాదులు గట్టిగానే వున్నాయి.....మన అదృష్టం!

వచ్చిన ప్రాబ్లెం 'గ్లోబలైజేషన్ ' పేరుతో, ఆర్ధిక సంస్కరణల పేరుతొ అమెరికాని గుడ్డిగా అనుకరించడమే!

A K Sastry said...

డియర్ మిష్టర్ కుమార్!

ముందు సంతొషం, నా పోస్ట్ మీద శ్రద్ధగా కామెంట్ ఇచ్చినందుకు!

తరవాత, మీరు థేంక్ చేసిన దేవుడు మేలు చేస్తే, మీ బ్యాలెన్స్డ్ మైండ్ ఏమి చెప్పిందో కొంచెం వివరిస్తే బాగుండేది--మీ కామెంట్ చౌకబారుగా వుంది అనడానికి నాకు ఆస్కారమివ్వకుండా!

'ఐడియలాగ్', 'ప్రాగ్మాటిజం' లాంటి పెద్ద మాటలెందుకు గాని, మీది ఏ ఇజమో చెప్తే ఇంకా బాగుండేది!

Anil Dasari said...

>> "ఇంకో 702 పడిపోతే చాలు, సంతొషించే వాళ్ళలో మొదటివాడిని నేను"

అప్పు చేసో, కూలి చేసో, అడుక్కునో .. పక్క వాడు సంపాదించిన సొమ్ము షేరు మార్కెట్లో పోగొట్టుకుంటే మీకు సంతోషమెందుకండీ!?! వాళ్లు మిమ్మల్నేమీ మోసం చెయ్యలేదు కదా.

Kathi Mahesh Kumar said...

బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టడం అవసరమంటారా? ఈ ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తమని తెలిసీ, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంవల్లే ఈ విపత్తొచ్చినట్లు చెప్పడం nothing but misinformation.

మీ విశ్లేషణబాగున్నా, మీ conclusion వల్ల మీ ఉద్దేశం అర్థమయ్యి, మొత్తానికి విలువ లేకుండాపోయింది.

A K Sastry said...

డియర్ మహేష్ గారూ!

ఇంకా నయం! గోకులాష్టమికీ, పీరు సాహెబ్ కీ సంబంధం అంటకట్టడానికి ప్రయత్నించలేదు నేను! సంతోషం!

మీకు సమాధానాలు మీ కామెంట్ పైనే వున్నాయి!

ఆర్ధిక వ్యవస్థ భ్రష్టు పట్టకూడదని తప్ప వేరే వుద్దేశాలు లేవని గమనించండి! ఇంతకు ముందున్న గవర్నమెంటులు తప్పు చేసినా, విమర్శించాను! (అప్పటికి బ్లాగులు లేవు కాబట్టి మీదృష్టి కి అవి రాలేదు!) రేపు ఏ గవర్నమెంటున్నా అంతే!

A K Sastry said...

అబ్రకదబ్ర గారూ!

సంతోషం అని చెప్పుకుంటున్న నా బాధ కూడా అదేనండి!

ఇదిచేసో, అదిచేసో కాస్తో కూస్తో సంపాదించిన సొమ్ముని దీపం చుట్టూ తిరిగే శలభాల్లా షేర్ మార్కెట్ చుట్టూ పరిభ్రమించి, నాశనం చేసుకుంటున్నారనే! (వీళ్ళకి మీలాంటి, నాలాంటివాళ్ళే షేర్ ఖాన్లు, షేర్ షాలు, షేర్ పండిట్లు, మార్కెటింగ్ గురు లు.)

పట్టుమని పది రోజుల్లో, అక్షరాలా 43,000 లక్షల కోట్లు మార్కెట్లో ఆవిరైపోయాయంటే.....బాధ్యత ఎవరిది? ఆర్ధిక మంత్రిది కాదా?