Thursday, October 16

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనే సందట్లో
సడేమియా!

నిన్నటి పేపర్లో, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ని ఆదుకోడానికి, 'కేంద్రం' సూచనపై, అర్ బీఐ ఓ 20,000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది--అని వార్త! ఆర్థిక వ్యవస్థ లోకి బ్యాంకుల ద్వారా విడుదలైన 65,000 కోట్లు కాకుండా ఇది అధికం అన్నమాట.

నిన్న, స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ మళ్ళీ ఓ 674 పాయింట్లు పడిపోయేసరికి, ఇవాళ (16-10-2008) పేపర్లో--సీఆరార్ 6.5 శాతానికి తగ్గించి, మరో 40,000 కోట్లు బ్యాంకులకి విడుదల చేయడమే కాకుండా, ఋణ మాఫీ ఖాతాలొ, మరో 25,000 కోట్లు వెరశి 1,45,000 కోట్లు ఆర్థిక వ్యవస్థ లోకి విడుదలైనట్లు! ఈనిర్ణయాలతో, గౌ. దువ్వూరి సుబ్బారావు గార్ని ఢిల్లీకి, ముంబాయికి మధ్య పరుగులు పెట్టిస్తున్నారు! మరి ద్రవ్యోల్బణం మాటో? దేవుడెరుగు!

మొన్న, లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ-- క్రింద 14 రోజులకి 9% వార్షిక వడ్డీ కి వేలంపాట నిర్వహిస్తే, కేవలం 4 బిడ్లు, 3,500 కోట్లకి మాత్రమే దాఖలయ్యాయట! అంటే ద్రవ్య లభ్యత లో లోపం లేదు అన్నమాటే కదా?

మరి సమస్య ఎక్కడ?

ఎక్కువ ద్రవ్య నిల్వలున్న సంస్థలు, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకుల వద్ద కొన్ని (పదుల/వందల) కోట్లు ఇచ్చి, 'సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్' (సీ డీ లు) తీసుకుంటాయి! (బ్యాంకులు, వాటి అవసరాలనిబట్టి, అధిక వడ్డీ ఆఫర్ చేస్తాయి!). ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇస్తానంటే, ఆ బ్యాంకులో డిపాజిట్ చేస్తారన్నమాట! ఈ ఫండ్లకి వద్దంటే డబ్బు! ప్రజలదగ్గర ఎక్కువ డబ్బుండటంతొ, మ్యూచువల్ ఫండ్స్ లో, ఇన్సూరెన్స్ స్కీముల క్రింద దబ్బు వచ్చి పడిపోతోంది!
బ్యాంకుల సీ ఆర్ ఆర్ పెరిగినప్పుడు, ఇవి వాటితో, ఓ ఆట ఆడుకుంటాయి! మేమెక్కువ ఇస్తామంటే మేమెక్కువ ఇస్తాం అంటూ బ్యాంకులు వాటి వెంట పడతాయి!

మరి ఎక్కడ వచ్చింది సమస్య? అంటే, ఈ సీ డీ లు 14 రోజులకి జారీ చెయ్యబడతాయి! మధ్యలో కేన్సిలు చెయ్యడం కుదరదు! వాటి మీద అప్పు తీసుకునే సౌకర్యం కూడా లేదు!

కొంచెం వెలుగుతోందా!

ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పతనం అవుతోందో, ఈక్విటీ ఫండ్స్ నించి కొన్ని కోట్ల మంది తొలగిపోదామని చూస్తారు! వారందరికీ డబ్బివ్వడానికి ఫండ్స్ ఎక్కడనించి తెస్తాయి? వాళ్ళ నిధులన్నీ సీ డీ ల్లొ బ్లాక్ అయి వున్నాయి! రెండోరోజున కొన్ని కోట్లు ఇవ్వాలి జనానికి--14 రోజుల దాకా సీడీ దబ్బులు రావు! మరి మ్యూచువల్ ఫండ్స్ చేతులెత్తెయ్యవూ?

అదీ సంగతి! పెళ్ళయితేగాని పిచ్చి కుదరదు! పిచ్చి కుదిరితేగాని పెళ్ళవదు!

సడేమియా గురించి వేరే చెప్పక్కర్లేదు! (చిదంబరంగారికి మొన్ననే ప్రశ్న సంధించాం గదా!)

సామాన్యుడి పాట్లు X ద్రవ్యోల్బణం గురించి తరవాత.......