Sunday, November 2

మా మేష్టారి ఇంకో తిట్టు

‘యెదవన్నర యెదవన్నర యెదవాని!’

అని తిట్టి, అడిగేవారు—‘అంటే యెన్ని యెదవలురా?’ అని!

వెంటనే లెఖ్ఖల్లో బ్రైట్ కుర్రాదు లేచి, ‘4 యెదవలు మేష్టారూ’

అంటే, ‘ఒరే! యెదవా! యెదవన్నూ, అరయెదవన్నూ, అరయెదవన్నూ కలిపితే యెంతరా?’అని లెఖ్ఖల్లో పూర్ కుర్రాణ్ణి అడిగి, వాడు ‘రెండు యెదవలు సార్’ అనగానే, అద్గదీ! అనేవారు!

మళ్ళీ ‘ఈసారి వీసెన్నర వీసెన్నర వీసె అంటే, ఎన్ని వీసెలురా?’ అని అడగ్గానే, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనుకొంటూ, యెప్పుడూ మేష్టారు నిన్నే మెచ్చుకునేలా వుండాలని తల్లిదండ్రుల చేత ప్రబోధింపబడినవాడైన లెఖ్ఖల్లో బ్రైట్ కుర్రాడు, అంతకు ముందు అయిన అవమానాన్ని మరిచి పోయి, ‘రెండు వీసెలు మేష్టారూ’ అనగానే,
మళ్ళీ మేష్టారు ‘వీశెన్నరా, వీశెన్నరా, వీశా—ఎంతరా? అని అడిగి, పిల్లలు కోరస్ లో ‘నాలుగు వీశెలు సార్’ అంటుండగానే, చిన్నబుచ్చుకుంటున్న లెఖ్ఖల బ్రైట్ కుర్రాణ్ణి చూస్తూ—‘ఒరే! ట్రిక్ తెలిసిందా? లెఖ్ఖలంటే ఇలా కూడా వుంటయి! పుస్తకాల్లో చెప్పేవేకాదు!’ అని కొసమెరుపు ఇచ్చేవారు!

అన్నట్టు ఈ వీశెల మానం పూర్తిగా చెప్పనా?

2 అర తులములు = 1 తులము
2 తులములు = 1 ఫలము
2 ఫలములు = ½ పంపు
2 ½ పంపులు = 1 పంపు
2 పంపులు = 1 ఏబులము
2 ఏబులములు = 1 పదలము (లేదా) ½ వీశ
2 ½ వీశలు = 1 వీశ
8 వీశలు = 1 మణుగు
20 మణుగులు = 1 పుట్టి (లేదా) బారువ

—ఇవి తూకానికి సంబంధించినవి!

ఇవి కాకుండా, కొలతలకి (పాత్రల్లో కొలిచేవాటికి) ఇంకో మానం వుండెది.
దానికీ, దీనికీ సంబంధం వుండెది!

అవి మరోసారి!

మరి ఇంతకీ ఆ లెఖ్ఖల్లో బ్రైట్ కుర్రాడెవరో ఊహించండి!

4 comments:

Anonymous said...

meerenaa mestaaru

nenu koodaa meelaage bright
anduke "yedavla lekka mundu ardham kaale ippudu ardhamayyindi lendi :):):):)"

A K Sastry said...

డియర్ లచ్చిమీ!

నిస్సందేహంగా!

చాలా సంతొషం.

vsrao5- said...

ఒక విన్నపము.
అయ్యా ఇలాంటి కొలతలు, వీటికి సమానమైన కెజి కొలతలు నాకు కావాలి. (మన దూర మానము ఘన మానము భారమానము మున్నగునవి మరియు ఇప్పటి MKS units conversion) నా పనిలో అవసరమైనాయి. మీరేమైనా పంపగలరా. ఎన్ని వివరాలు పంపితే అంత కృతఙ్ఞుడను
భాగవత గణనాధ్యాయి

A K Sastry said...

డియర్ సాంబశివరావు గారూ!

మీ పరిచయ భాగ్యం కలగడం ముదావహం. మీలాంటివాళ్లకి యేమాత్రం సాయపడగలిగినా, అది నా అదృష్టంగా భావిస్తాను.

మీరన్నట్టు, మానాలు అంటే, వెంటనే వ్రాసెయ్యగలను. వాటికి సమానమైన కొలతలు, కన్వర్షన్ విధానం అంటే కొంచెం టైం పడుతుంది. వెంటనే, వీలైనంత త్వరగా ఇవ్వడానికి ప్రయత్నం ఇప్పుడే మొదలు పెట్టాను.

మీ బ్లాగు ద్వారా, మురళీ కృష్ణ గారి బ్లాగు కూడా చూసి, బుక్ మార్క్ చేసుకొన్నాను. చాలా సంతోషం!

ధన్యవాదాలు.