పిల్ల కాకి
1975వ సంవత్సరం, ఆ తరవాతా, దేశంలో యమర్జెన్సీ అమల్లో వుండగా, మాలో ఓ జోక్ బయలుదేరింది.
ఆ సమయంలో, ఇతర పార్టీల నాయకులందర్నీ కటకటాల వెనక్కి తోసేశారు! పత్రికలమీద సెన్సార్ షిప్ విధించబడింది! దానికి నిరసనగా, పత్రికలు తమ సంపాదకీయాల్తో సహా, సెన్సారు చేయబడ్డ మేటర్ స్థానంలో యేమీ ముద్రించకుండా, తెల్లగా వదిలేసేవి! అది చూసి, మరో ప్రభుత్వ ఉత్తర్వు—పత్రికల్లో యెక్కడా ఖాళీలు వుంచకుండా తప్పనిసరిగా అచ్చుతో నింపాలని!
అలా వుండేది!
అప్పటి కాంగీ—ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐ—అంటే ఇందిర!) నినాదం
“దేశ్ కీ నేతా—ఇందిరా గాంధీ!
యువాఓంకా నేతా—సంజయ్ గాంధీ!” అని వుండేది.
అప్పట్లోనే, రాజీవ్ గాంధీ కి కొడుకు పుట్టేడు.
అప్పుడు మేము పుట్టించాం—‘బచ్చోం కే నేతా—రాహుల్ గాంధీ’ అని కూడా కలుపుతారు! ఆని.
ఆ బచ్చా, ఈ రోజు యువా అవనే అయ్యాడు!
అప్పట్లో సంజయ్ వెనకాల, వయో వృద్ధ నాయకులు కూడా, వాడి చెప్పులు మోస్తూ తిరిగారు!
తరవాత, రాజీవ్ వృద్ధ నాయకుల్ని గెంటేసి, పార్టీని వశం చేసుకున్నాడు—ఇదంతా చరిత్ర.
ఇప్పుడీ యువ (పిల్లకాకి) పేలుతున్నాడు!
మావంశంలోవాళ్ళు అధికారంలో వుంటే బాబ్రీ మసీదు కూలేదేకాదు……వగైరా వగైరా! (వీళ్ళ వంశం నిర్వాకాలు యెవరికీ తెలియవనుకుంటున్నాడు…..పాపం)
సరే, అవన్నీ అటుంచండి. మొన్న టీవీ వార్తల క్లిప్పింగుల్లో ‘మా నాన్న హత్య జరిగి ఇన్నేళ్ళయినా—నాకింకా న్యాయం జరగలేదు’ అని బుక్కు బుక్కుమంటూంటె, ఆహా, తన వంశంవారి ఆధ్వర్యంలో నడుస్తున్న పాలనని విమర్శించేంత దమ్ము వచ్చిందా అని ఆశ్చర్య పోయారు జనం!
తరవాత తెలిసింది—సందర్భమూ, అసలు విమర్శా యేమిటని!
యెవరో ఓ విద్యార్థి ‘అఫ్జల్ గురుని గవర్నమెంటు ఇంకా యెందుకు ఉరి తియ్యలేదు?’ అని అడిగినందుకట ఈ కోపం! యెవరి మీద అని ఆయనే వివరణ ఇచ్చాడు---మన న్యాయ వ్యవస్థ చాలా నెమ్మది---కాబట్టే నాకింకా న్యాయం జరగలేదు---అని.
అవాకులూ, చెవాకులూ కాకపొతే యేమిటి?
అఫ్జల్ గురు విషయంలో న్యాయ వ్యవస్థ చెయ్యవలసినది చేసి (ఉరి శిక్ష వేసి) యేళ్ళు గడుస్తున్నాయనీ, అమలు పరచనిది ఈ చేతగాని ప్రభుత్వమేననీ, దానికి వేరే కారణాలు కూడా వున్నాయని మరిచిపోయాడా?
మీ నాన్న విషయంలో నువ్వు నిరీక్షిస్తున్న న్యాయం యేమిటి?
నీయక్క జైలుకి వెళ్ళి మరీ నళినిని పరామర్శించి, తిరిగొచ్చాక ‘ఆడ కూతురు—చంటిపిల్లతో వుంది—విడుదల చేసెయ్యచ్చుకదా’ అని వాపోయిందే? థాను కూడా ఈ రొజు బ్రతికే వుండి, నళిని వున్న స్థితిలోనే వున్నా, ఇదే మాట అనగలిగేదా?
నీ అక్కది వేరే న్యాయం, నీది వేరే న్యాయమా?—అని యెవరైనా అడిగారా?
యెందుకైనా మంచిది—ఏ ఫారిన్ నిపుణుడిచేతో వీడికి కౌన్సెలింగ్ చేయిస్తే మంచిదేమో ఆలోచించండి!
లేకపోతే—‘ప్రధాని కావడానికి అన్ని లక్షణాలూ వున్నాయి’ అనే ముసలీ, ముతకా, మధ్య వయస్సు నాయకులూ, నాయకురాళ్ళ పుణ్యమా అని వీడు ప్రధాని అయితే (పాపము శమించుగాక)—మనలాంటి వాళ్ళ గతి—మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో ఢిల్లీ నించి దేవగిరికీ, దేవగిరి నించి ఢిల్లీ కి ప్రయాణాలు చేస్తూ, లక్షల్లో చచ్చిన వాళ్ళలా—పడుతుందేమో!
6 comments:
నీ అక్కది వేరే న్యాయం, నీది వేరే న్యాయమా?—అని యెవరైనా అడిగారా?----కాస్త ఆవేశం లో..ఇలా అన్నట్టున్నారు,ప్రియాంక రాహుల్ గాంధీ చెల్లెలు సార్,
రాహుల్ గాంధీ(1970-) ప్రియాంక (1972-)ఇలాంటి చిన్నచిన్న పొరబాట్లు అసలు విషయానికి క్రెడిబిలిటీ లేకుండా చేస్తాయి,గమనించండి.
హేమిటీ... రాహుల్ మీద వచ్చే వార్తలు కూడా చదువుతున్నారా.. ఎంత ఓపిక మీకు.
చూశారా, మరిచేపోయాను!
డియర్ క్రిష్ణా రావ్!
ఓపిక లేక పోయినా తెచ్చుకోవాలి మరి!
ఆ కుటుంబానికీ, పార్టీకీ వీరాభిమానులున్న ఈ దేశంలో......నా భయం గురించి చెప్పానుగా? మరందుకే!
Many Indians have the same information available to them as you have about their age.
Priyanka was exposed to media much earlier than Rahul. And she was projected as futur PM, before she was married off. After she was married, they bring Rahul to forefront.
So, many Indians think that she is elder to him. Who care about their birth dates!. They are average persons. Keep writing. The message is more valuable than minor mistakes in facts.
Did any body know who is the Father-in-law of Indira Gandhi? Many Indians think that Mahatma Gandhi was her Father-in-law, and that is how she got "Gandhi" family Name.
No body know her Father-in-laws's name. His name was Nawab Khan. It is a mystery, no official documents recorded this. Every where Feroze Gandhi was mentioned as Parsi. But his father was not a Parsi, he is a Muslim, and he married to a Parsi women after her conversion to Islam. How can a son born to Muslims be a Parsi?
Poor Indians. They were duped in a big way.
Feroze Gandhy, Feroze Khan, Feroze Gandhi are the three different names for the same person, the husband of Indira Gandhi.
Dear Mr. Anonymous!
I know pretty well that Rahul is the Elder and I have already admitted that it is only a slip of the tongue!
Regarding the husband of Smt. Indira Gandhi, the record is straight!
Please follow my next post and offer your comments if any!
Post a Comment