ముడి చముఱు ధర పీపా 50 డాలర్ల లోపుకి పడిపోయింది(ట)!
అమెరికా లో లీటరు 4 డాలర్లకి పెరిగిన గాసోలిన్ ఇప్పుడు మళ్ళీ 1 డాలరుకి తగ్గిందట.
మనకి మాత్రం పెరిగినప్పుడు పెరగడమేగాని, తగ్గినప్పుడు తగ్గడం వుండదు!
దగ్గర దగ్గర 150 డాలర్లనించి తగ్గింది కదా? మరి మన విత్త/ఇంధన మంత్రులు యేమంటున్నారు?
‘చముఱు కంపెనీల పేరుకున్న నష్టాలు తగ్గుతున్నాయ'ట—అందుకని 'ఇప్పుడప్పుడే తగ్గించరట!’
ఇదివరకు ఎన్ డీయే గవర్నమెంట్ చముఱు ధరలు పెరగడం మొదలవగానే, ఓ వందో యెన్నో కోట్లతో ‘ఆయిల్ పూల్ ‘ యేర్పాటు చేసి, దాని నుంచి పెరుగుదలనీ, తగ్గుదలనీ సర్దుబాటు చేసేది.
ధరలు స్థిరపడగానే, ఆ పూల్ ని రద్దు చేసింది. అక్కడనించీ, మార్కెట్ మీద ఆధారపడి, లీటరుకి రెండు పైసలో, ఐదు పైసలో పెరగడమో తగ్గడమో జరిగేది!
మరి ఈ గవర్నమెంట్ పీపా యే డెబ్భై డాలర్లకో గబ గబా పెరగ్గానే ఆ పని చేసి వుంటే, ద్రవ్యోల్బణం ఈ రోజు ఈ స్తితికి వచ్చేది కాదుగా?
వీళ్ళకి ‘సామాన్యుడంటే’ లెఖ్ఖ వుంటేగా?
సాహిత్యం -- గ్రంథాలూ
-
*బుచ్చి బాబు కథలు**-*-
*ఆ ఉ ఓ లు*
“............ఆ ఊళ్లో రోడ్డు ప్రక్కన చాప మీద పరచిన పాత పుస్తకాల
వ్యాపారసంస్థను చూసి ఆశ్చర్య పడ్డాను.........
పుస్తకాలు ఈత...
4 years ago
2 comments:
Krishna Sree గారు,
Very well written. Today the Gallon gas (petrol) is selling for $1.60 to 1.81 in NY State.
As you pointed out the Gallon gas price came down drastically in USA. In some state it is selling as low as $1.37
డియర్ శ్రీనివాస్!
కొద్ది రోజుల క్రితం, గాసొలిన్ కోసం 'ఇరవై మైళ్ళు ' వెళ్ళవలసొస్తోంది--అని చెప్పాడు, అట్లాంటాలో వుంటున్న మా అల్లుడు! మరి ఇప్పుడా స్థితి లేదుగా?
పైగా, అమెరికాలో అమ్మే గాసొలిన్ యెక్కడా! మన వూళ్ళలో అమ్ముతున్న, కిరసనాయిలూ, చెత్తా కలిసిన 'పెట్రోలు ' యెక్కడా!
Post a Comment