బలుపుకాదు.....వాపు!
అమెరికాకి కాబోయే అధ్యక్షుడు బరాక్ ఒబామా బుష్పరిపాలనపై, రిపబ్లికన్ పార్టీ పై సారించిన ముఖ్యమైన ఆరోపణాస్త్రం యేమిటి?
“షేర్ మార్కెట్ కి అలవిమాలిన ప్రాముఖ్యం కట్టబెట్టి, తక్కిన రంగాల్నినిర్లక్ష్యం చేసిన అవకతవక విధానాల పర్యవసానంగానే ‘మహామాంద్యం’ పునరావృతమయ్యే దుస్థితి దాపురించింది” అని!
ఆయనంటున్న ‘మహా మాంద్యం’ 1929 నాటి ప్రపంచ (అంటే అప్పట్లో యూరప్, అమెరికా ఖండాలు) ‘గ్రేట్ డిప్రెషన్’ అనబడే ఆర్ధిక మాంద్యం!
దీని గురించి ఓ చిన్న జోక్ లాంటి నిజం—
తండ్రి చనిపోయాక, కొడుకులిద్దరు సమానంగా ఆస్థి పంచుకున్నారట. తరవాత అన్నగారు చాలా జాగ్రత్తగా తన డబ్బుని పెట్టుబడులుగా పెట్టాడట.
తమ్ముడు మాత్రం, డబ్బంతా తగలేసి, కొన్నివేల సీసాలు మద్యం తాగుతూ గడిపాడట!
ఈ లోగా రానే వచ్చింది ‘గ్రేట్ డిప్రెషన్’!
దాంతొ అన్నగారు ఒక్కసారిగా బికారి అయిపోయాడు!
మాంద్యం పోగానే, తమ్ముడు, ఖాళీ మద్యం సీసాలు అమ్ముకొని, కోటీశ్వరుడు అయ్యాడు!
అదండీ సంగతి!
మన విత్త మంత్రి గారేమో ‘వ్హిప్పింగ్ ది డెడ్ హార్స్’!
ఈ రోజు (04-11-2008) బ్యాంకర్లని ఋణాలమీద వడ్డీ రేట్లు తగ్గించాలని కోరి, అందుకు వప్పించాడట!
ఈ రొజున కూడా వయో వృద్ధులకి 11%, మిగిలినవాళ్ళకి 10.50% వడ్డీతో డిపాజిట్లు సేకరిస్తున్నాయి బ్యాంకులన్నీ! ఈ నెలాఖరు వరకూ బహుశా ఇదే కొనసాగుతుంది!
మరి ఋణాల వడ్డీలు ఎలా తగ్గుతాయి? బహుశా కోటి రూపాయల పైబడిన ఋణాలకి ఓ 0.5% తగ్గిస్తారేమో!
బై ది బై, మీ రిజర్వ్ బ్యాంకు ఆర్ధిక వ్యవస్థ లోకి విడుదల చేసిన 2,50,000 కోట్లేమయ్యాయి?
సెన్సెక్స్ ని అతి కష్టం మీద 10,000 పాయింట్లు దాటించాయి!
ఇప్పటికైనా ఒప్పుకుంటారా—ఇది బలుపు కాదు…..వాపు అని?
3 comments:
రిజర్వు బ్యాంకు నుంచి వచ్చిన 2,50,000 కోట్లును బ్యాంక్స్ బయటికి రిలీజ్ చెయ్యకపోవటానికి కారణం కూడా ఆర్థిక మాంద్యమే .బ్యాంక్స్ అన్ని ఇప్పుడు వచ్చిన డబ్బుని to the maxim extent తమని తామూ బలపర్చుకోవటానికి చూస్తున్నాయి.
డియర్ తేజా!
మీ పరిచయంలేదు! ఏదేమైనా, మీ కామెంట్ కి ధన్యవాదాలు.
బ్యాంకులూ, సీఆరార్, ఎస్.ఎల్.ఆర్, రెపోరేటు లాంటివాటిపై మీకు కనీస అవగాహన లేనట్టుంది!
బ్యాంకులెప్పుడూ బలంగానే వున్నాయి--వుంటాయి--ఈ రాజకీయులు ఋణ మేళాలూ, ఋణ మాఫీలూ అని వాటిల్తో ఆడుకోకుండా వుంటే. ఇంకా 'ఆడపదుచుల్ని--అందర్నీ--పావలా వడ్డీకి ఋణాలిచ్చి, లక్షాధికారుల్ని చేస్తాం' అనేలాంటి హామీలు ఇవ్వకుండా వుంటే!
నాబ్లాగుల్ని చూస్తూ వుండండి. ప్రత్యేకంగా http://ammanamanchi.blogspot.com/
http://amkrisas.blogspot.com/
చదువుతూ వుండండి!
మీ మెయిల్ ఐడి ఇవ్వగలరా? నాకు హోమ్ లోన్ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి.
my id:chkrman@gmail.com
Post a Comment