Saturday, August 28

వోటింగ్ మెషీన్లూ..........

...........యెన్నికలూ

నేనిదివరకే చెప్పాను--ఎలెక్ట్రానిక్ వోటింగ్ మేషీన్లని టాంపరింగ్ చెయ్యడం అసాధ్యం--అని.

ఇప్పుడు, జేపీ (లోక్ సత్తా) ఈవీయెం లతో రిగ్గింగ్ జరుగుతుందనడానికి యెలాంటి ఆధారాలూ లేవనీ, కొందరు సదుద్దేశ్యం తో, కొందరు దురుద్దేశ్యం తో వీటిపై అనుమానాలు రేకెత్తిస్తున్నారు అనీ అన్నారు!

మరి సాంకేతిక నిపుణుడు హరి ప్రసాద్ మాటేమిటి?

వివిధ ప్రదేశాలనించి ఈవీయెం లని రప్పించి, సభాముఖం గా వాటిని టాంపరు చేసి చూపించమన్న యెన్నికల సంఘాం సవాలుని స్వీకరించి, యెవరూ నిరూపించలేక పోయారు.

మరి హరి ప్రసాద్ ఓ మెషీన్ ని దొంగిలించి, తన యింట్లోనో లాబ్ లోనో దాని పనిచేసే విధానం మార్చేసి, ప్రదర్శన ఇస్తాను, ఇది తప్పుగా ప్రవర్తిస్తుంది--అనడం యెంత హాస్యాస్పదం!

ఒక మెషీన్ ని మారిస్తే, అదేవిధం గా అన్ని లక్షల మెషీన్లూ యెలా మారిపోతాయి?

(ఆయన మీద దొంగతనం కేసుపెట్టడం వేరేసంగతి--ఆయన్ని విడుదల చెయ్యాలని కోరడం సమంజసమే)

ఇక, ఢిల్లీ మాజీ ముఖ్య కార్యదర్శి ఒమేశ్ సైగల్, సమాచార హక్కు ద్వారా తాను, ఈవీయెం చిప్ లపై ప్రోగ్రాం లు వ్రాయడానికి విదేశీ సంస్థల నుంచి బెల్, ఈసీఐఎల్ సేవలు వినియోగించుకున్నాయి అని వెల్లడించారు.

మెషీన్లు చక్కగా పని చేస్తున్నంతవరకూ, ప్రొగ్రాం యెవరు వ్రాశారు అనే మీమాంస అనవసరం కదా? అయినా ఆయన అన్నట్టు విచారణ జరిపిస్తే పోయేదేమీ లేదు.

ఇంక, అమెరికా లాంటి దేశాలూ, ఇతర ప్రజాస్వామిక దేశాలూ ఈ మెషీన్లని వాడక పోవడానికి కారణం వొక్కటే--వోటు వేసినట్టు నిర్ధారిస్తూ 'బీప్' వస్తుంది గానీ, ఫలానా గుర్తుకే వోటు పడింది అని నిర్ధారణగా వోటు వేసినవారికి తెలియదు!

దీనితో నేనుకూడా యేకీభవిస్తాను.

ఈవీయెం లలో గుర్తులు అంటించే ప్రాంతాన్ని పారదర్శకం చేసి, క్రింద ప్రతి గుర్తుకీ ఓ చిన్న బల్బు పెట్టి, వోటు వెయ్యగానే సంబంధిత గుర్తు క్రింద బల్బు వెలిగేలాగ చెయ్యగలిగితే, సమస్య పరిష్కారం అయిపోతుంది!

మన శాస్త్రఙ్ఞులు ప్రయత్నిస్తే బాగుంటుంది.

15 comments:

Wit Real said...

I saw hariprasad & team demonstrating it on TV9.

i didnt understand their claim.

they did as follows
1. They get an EVM
2. they change a display or program the display
3. then they remotely manipulate the display

Now, if you snatch an EVM & program it, then you can do anything with it! isnt it?

if you program it to display "rubbish" then it displays "rubbish"!

It is as good as snatching a ballot box and filling it with ballot sheets of our choice.

i was just wondering, whether my understanding was right or did I miss something?!!!

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

Anonymous said...

@క్రిష్ణ శ్రీ గారు,

EVM ల తో ప్రాబ్లం అదే, ప్రొగ్రాం ను మార్చేయవచ్చు. మన దేశం లో అదీ కెంద్రం లో అధికారం లో ఉన్న వారు, మెషిన్ల(లో) మార్చటం/మార్పించటం కష్టం అంటారా? నిజంగా ట్యాంపర్ ప్రూఫ్ అంటె, ఒకరి వోటు వేస్తే ఇంకొకరికి వేయటమో, అసలే కౌంట్ కాకుండా చేయగలిగే అవకాశమో ఉండనది అయి ఉండాలి.

మీరు అనవచ్చు, మరి పేపర్లు ఉన్నప్పుడు, రిగ్గింగ్లు జరగవా అని, అదే రిగ్గింగ్ EVM లు ఉన్నప్పుడూ చేయవచ్చు కదా. అలాగే పేపర్ బ్యాలెట్లు ఉన్నపుడు ఇంకు ఎలా పోయవచ్చో, అలాగే ఓ సుత్తిపెట్టి కొట్టటమో లేక అసలే ఎత్తుకు పోవటమో కూడా EVM లతో చేయవచ్చు కదా?

రెండు, అన్నిటికంటే EVM ల వలన చేటు ఏమిటి అంటే, ఏ పోలింగ్ బూతు వాళ్ళు ఎవరికి వోట్ల్లు ఎన్నెన్ని వేసారు అని తెలిసిపోవటం, దాని వలన, మా ఊర్లో అపర నరకాసురిడి లాంటి మన ప్రియతం ముఖ్యమంత్రి గారి కుడిభుజం మరియు ఆయన వసూళ్లకు రాజ అయిన మా MLA, కొన్ని వీధులలో రోడ్లు వేయనీయకపోవటం, నిధులున్నా లాంటివి చేస్తున్నాడు.

అదే పేపర్ బ్యాలెట్లు అయితే, అన్నీ కలిపి (కనీసం మండల స్థాయి లో) లెక్కపెట్టేవారు, దానివలన కచ్చితంగా మాత్రం తెలియకపోయేది. అందుకోసమయినా ఈ సారి ఓ 60 మందితో నామినేషన్ వేయించాలిరా అని నా మితృడు అన్నాడు.

Anonymous said...

ఇంకొక విషయం హరిప్రసాద్ గారి బ్లాగ్ ను బట్టి
"వివిధ ప్రదేశాలనించి ఈవీయెం లని రప్పించి, సభాముఖం గా వాటిని టాంపరు చేసి చూపించమన్న యెన్నికల సంఘాం సవాలుని స్వీకరించి, యెవరూ నిరూపించలేక పోయారు" అన్నది కేవలం కొంత నిజం మాత్రమే.

ఎన్నికల సంఘం తెప్పించిన మాట నిజమే కాని, వారు ట్యాంపరింగ్ కు ఇచ్చిన అవకాశం పెద్దగా లేదు, కేవలం కొద్ది సమయం అదీ అప్పటికప్పుడు చేసి చూపమనటమే. అదే నిజానికి ప్రభుత్వం అండతోనో, ఇంక దేనికో ఆశపడి ట్యాంపరింగ్ చెసే వాళ్లకు, ఆ మెషిన్లు కొద్ది సమయం కాదు, వారాలు, నెలల టైం కూడా ఉంటుంది.

కాబట్టి, ఎన్నికల సంఘం పెద్దగా విశ్వతనీయత నిరూపించటానికి చేసింది అంటూ ఏమీ లేదు.

seenu said...

మెయిన్ ఫ్రేం కంప్యూటర్లను హేక్/టేంపర్ చేస్తున్న కాలమిది.తొక్కలో EVM ఎంత. ఒక మనిషి తయారు చేసిన యంత్రాన్ని ఇంకో మనిషి చెడగొట్టడం లేదా బాగు చేయడం పెద్ద బ్రహ్మ విద్యేం కాదు ... ఎందుకంటే EVM లు డైరెక్టుగా దేవుడు దగ్గరనుండి రాలేదు. అందుకే EVMలు ఎప్పటికీ సందేహాస్పదమే.

seenu said...

ఇదంతా ఎందుకు ... మా EVM లను టేంపర్ చేసిన వాడికి బహుమతి అని ఎన్నికల సంఘం ప్రకటిస్తే సరిపోయేది కదా. అప్పుడు దేశంలోని కొమ్ములు తిరిగిన Software/ Hardware ప్రొఫెషనల్స్ అంతా ప్రయత్నిస్తారు. అప్పుడు EC విస్వసనీయత కూడా పెరుగుతుంది. ఇదంతా చేయకుండా మా మెషీన్లు 100% ప్రూఫ్, వాటిని చేధించడం మానవ మాత్రులకు సాధ్యం కాదు అని ప్రగల్భాలు పలకడం ఎందుకు? అప్పటికీ EC తన మంకుపట్టు వీడకపోతే EVMలతో పాటు EC విస్వసనీయత కూడా సందేహాస్పదమే.

Anonymous said...

I agree with KrishnaSree gaaru. Nothing is 100% safe. EVMs have the follwing advantages over ballot boxes:
1) Small size, easier transportation
2) Faster in counting votes
3) Longer life
4) Less expensive in long-run
5) Tamper-proof

tactical disadvantage:
" అన్నిటికంటే EVM ల వలన చేటు ఏమిటి అంటే, ఏ పోలింగ్ బూతు వాళ్ళు ఎవరికి వోట్ల్లు ఎన్నెన్ని వేసారు అని తెలిసిపోవటం," - Anon1
This can be corrected by giving a random number to the EVMs before counting at district hqrs.
Safety of the EVM can be improved if they are regularly put to use.

Nrahamthulla said...

బ్యాలెట్ పేపర్ తో కౌంటింగ్ లో ఎంతో సమయం వృధా అవుతూ,ఉద్యోగులు నిద్రలేక అవస్థలు పడుతుంటారు. ఇ.వి.యం.ల విస్వసనీయత మొన్న ఉప ఎన్నికలలో ఋజువయ్యింది.టెక్నాలజీ పెరిగేకొద్దీ సవాళ్లూ పరిష్కార మార్గాలూ పెరుగుతూనే ఉంటాయి.ఇది నిరంతర ప్రక్రియ.మళ్ళీ పాత యాతనలకు తీసికెళ్ళి ఉద్యోగులను బాధించేకంటే ఆ యంత్రాలలో లోపాలుంటే పరీక్షించి సవరించటమే మంచిది.

సూర్యుడు said...

There is no logic in the statements of the politicians who are opposing EVMs as BJP came to power in center with EVMs that too when Congress+ is ruling at the center.

So, if we go by their logic, Congress could have tampered the EVMs and retained the power.

They are not able to digest the fact that people have rejected them.

కృష్ణశ్రీ said...

మంచి చర్చే జరుగుతోంది.

చాలా సంతోషం.

వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు.

seenu said...

@ రహమతుల్లా గారు ...
>> బేలెట్ పేపరుతో సమయం వృధా అవుతుంది పైగా EVMల విశ్వసనీయత మొన్న ఉప ఎన్నికలలో(తెలంగాణ ఉప ఎన్నికలు) ఋజువయ్యింది.
బేలెట్ వోటింగ్లో జరిగే ఆలస్యం, ఇబ్బందుల కంటే లోపభూయిష్టమైన వోటింగ్ విధానం వలన ప్రజాస్వామ్యానికి జరిగే నష్టమే ఎక్కువ ( అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం నాలుగు పాదాల మీద నడిచేస్తుందని కాదు నా ఉద్ధేశ్యం). బేలట్ ఓటింగ్లో సిబ్బంది ఇబ్బందులున్న మాట వాస్తవమే. అయితే ఆ ఇబ్బందులకు సిబ్బందికి తగిన ప్రతిఫలం ప్రభుత్వం ముట్టచెపుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ ఇబ్బందులు మహా అయితే రెండు మూడు రోజులుంటాయి. కానీ తప్పుడు దారిలో వచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలు 5 ఏళ్ళు భరించాలి . ఆ ఇబ్బందులతో పోల్చితే సిబ్బంది పడే ఇబ్బంది ఎంత ? మొన్న తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల మీద కూడా ప్రజలకు అనుమానాలున్నాయి. ఆ ఎన్నికలు తెలంగాణ సెంటిమెంటును పరీక్షించడం కోసం జరిగిన ఎన్నికలు ... EVMల విశ్వసనీయతను పరీక్షించడం కోసం కాదు ... పచ్చిగా చెప్పాలంటే తెలంగాణ సెంటిమెంటును బ్రతికించడం కోసం జరిగిన ఎన్నికలు.

Anonymous said...

చర్చ EVM ల వలన ఉపయోగాలు లేవని కాదు. అవి చిన్నవి, తక్కువ ఖర్చు, లెక్కించటం సులభం అన్నీ కూడా.

కాకపోతే అవి ట్యాంపర్ ప్రూఫ్ నా కాదా అన్నది? దానికి మొన్న ఎన్నికలో, అటుమొన్న ఎన్నికల ఫలితాలు కూడా కొలమానాలు కాదు, ఎందుకంటే అవి అప్పుడు చేసి ఉండకపోవచ్చు, లెదా చేయటానికి అప్పుడు ఎవరు పెద్దగ ప్రయత్నించక పోయి ఉండవచ్చు!!

పైన ఓ అజ్ఞాత అవి Tamper Proof అని చెప్పారు, కచ్చితం గా ఎలా చెప్పగలరు ? ఇంతవరకు ఎన్నికల కమిషన్ వాటిని unconditional గా ఏ IIT లకో, Bits, Pilani వాటికో ఇచ్చి ఓపెన్ గా Test చేయమని చెప్పి చాలెంజ్ చేయటమో, లేక కాస్తో కూస్తో credibility మరియు conflict of interest లేని వారితో (ఒకటికంటే ఎక్కువ కంపెనీలతో) independent study చేయించటమో చేయలేదు అని చెప్పవచ్చు.

అవి Tamper Proof అవునో కాదు చెప్పటానికి, ముందు అందులో వాడిన chipset , circuit, అంతే కాక software ఎంత easy overload చేయగలరు, అన్నది అంతే కాక వాటికి రిమోట్ అమర్చటం ఎంత సులభం అనేది స్టడీ చేయాలి , ఈ EVM తీసుకొచ్చి గట్టిగా ఓపెన్ కూడా చేయనీయకుండా, ఇప్పటికప్పుడు proof చేయండి అని సభాముఖం గా అడగటం, వాళ్లు చేయలేకపోయారు అని, ఇది Tamper Proof అని చంకలు గుద్దుకోవ్వటం ఎంతవరకు సమంజసం?

అవి Tamper Proof కావచ్చునేమో!!, కాని అది మాత్రం proof చేయటానికి EC చేసింది అంటూ ఏమీ లేదు, అంతే కాక వాటి access కూడా సరిగా ఇవ్వలేదని చెప్పవచ్చు ఇప్పటివరకూ.

ఇక బూతు లెవెల్ కౌంటింగ్ తెలియకుండా చేయవచ్చు అని చెప్తున్నారు, ఎలానో చెప్తారా? ప్రతి EVM కు ఓ నెంబెర్ ఉంటుందు, దేన్ని ఏ బూతుకు పంపించారో లాగ్ ఒకటి ఎవరో ఒకరు మైంటైన్ చేయాల్సిందే, వాటిని వెనక్కు తీసుకొచ్చి నెంబర్లు కనిపించకుండా బ్లాక్ చేసి (స్టిక్కర్లు వేసి) కౌంట్ చేయాలి, కాకపోతే కౌంటింగ్ అప్పుడు కాని, ఆ తర్వాత కాని , ఆ నెంబర్లు, లాగ్ తెలుసుకోవటం ఈ రాజకీయనాయకులకు అంత కష్టం ఏమీ కాదు, అదే బాధ. అంతేకాక స్టిక్కర్లు వేసి తీసుకొస్తే, అసలు ఆ EVM లు ఆ బూత్లవనే నమ్మకం ఏమిటి? అదే బ్యాలెట్ పేపర్ మీద అయితే, బాక్సుల మీద సంతకాలు ఉంటాయి. ఇలాంటి practical బాధలు ఎక్కువ, సరే దీన్ని ఎలాగో అలాగా అధిగమిద్దాం అనుకుని వదిలేద్దాం.

చివరగా మన కంటే ముందు EVM లు మొదలెట్టి, తర్వాత బ్యాలెట్టు లకు దిగిన మనకంటే ఎంతో advanced దేశాలు ఎందుకు దిగినాయో ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది!! కౌంటింగ్ అది చేయటానికి మనకంటే వారికి తక్కువ మ్యాన్ పవర్ ఉంది అని కుడా మరచి పోవద్దు!!

చివరగా, బ్యాలేట్టు లలో ఇంకులు పోయటం లాంటివి చేయవచ్చు, లేదా కౌంటింగ్ అప్పుడు ఒకరో ఇద్దరు ఉద్యోగస్తులు ఓ కట్ట దాసిపెట్టే ప్రయత్నం కుడా చేయవచ్చు, కాకపొతే అవి తెలుస్తాయి, అవి రాష్ట్రమంతా చేయటం కష్టం, EVM లు Tampering అన్టూ జరిగితే ఒకరో, ఇద్దరు తో కొన్ని వందల, వేల వాటిని ఎవ్వరికీ తెలియకుండా చేయవచ్చు, software or hardware upgrade appudu,
అందుకే ప్రస్తుతం మనం వాడుతున్న EVM లు Tamper చేయబడ్డవా లేదా అనేదానికంటే భవిషత్తులో వాటిని ఎవరయినా చేయాలనుకొంటే ఎంత సులభం, ఎంత కష్టం అన్నదే ఇప్పటి ప్రశ్న, దానికి సమాధానం మాత్రం సంతృప్తికరం గా ఇప్పటివరకు EC ఇవ్వలేకపోయింది అని చెప్పవచ్చు. దాని గురించి కుడా పెద్దగా పట్టించుకొన్న దాఖలాలు అయితే బయటకు పెద్దగా కనిపించలేదు కుడా.

ఇక వాటినే వాడాలో, సమాధానాలు వచ్చేవరకు ఆగాలో ఎవరికీ వారు ఆలోచించుకోవాలి వాళ్ళ కంఫర్ట్ లెవెల్ ను బట్టి, దాదాపు 20 సంవస్తరాలు IT (both hardware and software ) లో పనిచేసిన వాడిగా పైన వాటికి సమాధానాలు వచ్చేవరకు, బ్యాలేట్లు వాడటమే మంచిది అని నా అభిప్రాయం.

ఈ విషయం లో irony ఏమిటి అంటే, ఈ టెక్నికల్ మెషిన్లను, టెక్నికల్ గా ఎంతో కొంత తెలిసిన వారు , వీటికి సముఖంగా లేకపోతె , బ్యాలేట్టు పేపర్ల తో నానా తంటాలు బడిన (౩౦ ఏళ్ళు ఎన్నికలలో వివిధ హోదాలలో పనిచేసిన) మా నాన్న లాంటి వాళ్ళు వీటిని కోరుకోవటం :))

Anonymous said...

Tamper proof in the sense usual disrupting methods like 1. pouring water/ink in ballots 2. setting them on fire etc can not affect. EVMs can be fitted with well encripted (secured) wireless communications with hqrs.

I didn't mean 100% tamper proof. Even internet is not 100% secured. Fake notes are being printed similar to original. Let it be studied by any technical institute and come out with better solutions. That is possible only if they are put in use. Unless there is need people wouldn't look for solutions.

ఇక బూతు లెవెల్ కౌంటింగ్ తెలియకుండా చేయవచ్చు అని చెప్తున్నారు, ఎలానో చెప్తారా?

Each machine will send the data to a central machine that only would display total. area level information can be made accessable only to higher level EC official. If EC is corrupt any data may be accessable to corrupt politician. That problem is there with present ballot boxes also.

Anonymous said...

Nice dispatch and this mail helped me alot in my college assignement. Gratefulness you as your information.

కృష్ణశ్రీ said...

డియర్ Anonymous!

మీకు ఈ టపా కొంత లాభం చేకూర్చినందుకు, మీరామాట చెప్పినందుకు, చాలా సంతోషం.

తరవాత--

1. You need not be anonymous to offer such a comment.

2. This is called a "post" and not a dispatch.

3. This is also not a "mail" but a blog.

Please try to improve your vocabulary regarding Internet.

అమ్మాయికి ప్రేమలేఖ వ్రాస్తే, దానిలోని తప్పుల్ని దిద్ది, మార్కులువేసి, మీకే పంపించిన పిల్ల తండ్రిలా--ఈ మేష్టారు యెవడ్రా బాబూ.......అనుకోవద్దు.

దొరికితే యెవరికీ పాఠం చెప్పకుండా వదలను నేను మరి!

ధన్యవాదాలు.