నాకూ స్వాతంత్ర్యం వచ్చింది
నిజం!
కారణాలేమయితేనేం--నా వుద్యోగానికి నేను సమర్పించిన రాజీనామా 13-08-2010 నించీ ఆమోదించబడింది.
ఇక నాకు స్వాతంత్ర్యం వచ్చినట్టేకదా?
దాదాపు 37న్నర సంవత్సరాలుగా, తెల్లారి లేచి, ఓ ప్రక్క కాలకృత్యాలు తీర్చుకుంటూనే, "ఇవాళ బ్యాంకులో చెయ్యవలసిన ముఖ్యమైన పనులేమిటి, రాబోయే సమస్యలేమిటి, వాటిని యెలా అధిగమించాలి, ముఖ్యం గా సహనం కోల్పోకుండా, అన్నీ భరిస్తూ వుద్యోగం యెలా చేసుకోవాలి" ఇలాంటి ఆలోచనల్తో సమయానికి బ్యాంకుకి చేరుకొని, సీట్లో కూర్చొని--పొద్దుణ్ణించీ చేసుకున్న ఆలోచనలు గాలికి పోగా, రొటీన్ గా చక చకా పని చేసుకొని, మధ్యలో లంచి చేసి, సాయంత్రం బయటపడి, కాసేపు కొలీగ్స్ తో ఖబుర్లాడుకొని, ఇంటికి చేరడం అనే రొటీన్ నించి విముక్తి--యెంత స్వాతంత్ర్యం!
ఇక నించీ 'ఫ్రీ బర్డ్' అనుకొంటే సంతోషం గానే వుంది.
ఇక చెయ్యవలసిన పనులు, వాటి ప్లానింగ్ వీటిపై దృష్టి పెట్టాలి అనుకుంటూండగానే, ముందు ఈ జీవితానికి అలవాటుపడడానికి ప్రయత్నిస్తున్నాను!
మిగిలిన ముచ్చట్లు తరవాత.
11 comments:
Happy retired life. All the best.
ఆ మధ్య పుస్తకరచనేదో చేపడతాను అన్నారు కదా,కానివ్వండి ఎదురుచూస్తున్నాము.
ఇంక మీరు 24 గంటలూ ఫ్రీ గా ఉంటారు అని అందరూ అనుకుంటారు కాబట్టి ముందరే మీ స్వంత సమయము కేటాయించు కొని అందరికీ చెప్పండి(భార్య దగ్గర నుండి ఒప్పందం తీసుకోండి).
పూర్వం మనవాళ్ళు జపం అని చెప్పి ఇంట్లో స్వంత సమయం కేటాయించు కొనేవాళ్ళు. నేను హఠాత్తుగా జపాలు మొదలెట్టానంటే ఎవరూ నమ్మటల్లేదు సరికదా ఎక్కువ పనులు చెయ్యాల్సి వస్తోంది.
హ్యాపీ రిటైర్మెంట్.
నువ్వు పని చేసే బ్యాంకేదో నాకుతెలీదుగానీ .. ఆ బ్యాంకుకి ఇవాళ్టితో దరిద్రం మాత్రం వదిలింది,
ముగ్గురు మిత్రులకీ, ధన్యవాదాలు!
మీ సలహాలని గుర్తుంచుకుంటాను.
ఇక, నాలుగో వాడైన పినాకొ!
బ్లాగులోకానికి ఈ పినాకొల దరిద్రం యెప్పుడు తీరుతుందో మరి!
Hope you will most out of your retired life..
All the best sir,
-Karthik
హాపీ రిటైరడ్ లైఫ్ సార్:)
సాధ్యమైనంత బిజీగా వుంచుకోండి జీవితాన్ని. అంటే మా నాన్నగారు లాంటివారిని చూసాను కదా! చాలా నిరుత్సాహంగా వుంటారు. ఊసుపోదు అని ఒకటే గొడవ :) ఇద్దరం కలిసి ఒక లైబ్రరీ తయారు చేసె పనిలో వున్నాము అనుకోండి. ఈ అవిడియా పని చేస్తే బాగుంటుంది.
డియర్ karthik!
చాలా సంతోషం.
ధన్యవాదాలు.
డియర్ krishna!
చాలా సంతోషం. మీ సలహా తప్పక పాటిస్తాను.
ధన్యవాదాలు.
మీ నిష్పక్షపాతంగా, సూటిగా ఆలోచించే మనస్సుని, మన ఆదిగ్రంధాలైన భగవద్గీత,రామాయణం,భారతాలమీద పెడితే, మాలాంటి వారికి, కొన్ని ఆణిముత్యాలు, మీ బ్లాగుద్వారా దొరికే అవకాశం వస్తుంది.
ప్రధానంగా పిల్లల మీద కాంసెన్ ట్రేట్ చేస్తూ, అత్యంత నిమ్న స్థాయిలో ఓటమి ఎదురయితే ఎలా ఎదిరించి నిలవాలి,
మనని మోసం చేసే వారిని ఎలా గుర్తించాలి.. వారితో ఎలా బిహేవ్ చేయాలి, జీవితంలో తృప్తి అనేది ఎందుకు కావాలి, నిరంతర విద్యాభ్యాసం ఎలా మనని ఉన్నతంగా ఉంచుతుంది, అన్నింటా పాజిటివ్ హోప్ ఎలాంటి సత్ఫలితాలని ఇస్తుంది.............లాంటి.... చక్కటి విషయాలు మీనుంచి రావాలని కోరుకుంటున్నాము.
డియర్ venkateswara rao!
చాలా పెద్ద బాధ్యతే పెట్టారు నామీద. అయినా మీ సూచనలు శిరోధార్యం గానే భావిస్తాను.
ఇక, '......భగవద్గీత, రామాయణం, భారతాలమీద'--వాటిని చదివి, ఆకళింపు చేసుకునే వయసే నాది కానీ, వాటిని వివరించగలిగే వయసు నాకింకా రాలేదనుకుంటాను!
అయినా మీరోసారి నా వెబ్ సైట్ చూసి, ఇతర బ్లాగులు కూడా చదవండి.
మీరు పెట్టిన బాధ్యతని నెరవేర్చడానికి తప్పక ప్రయత్నిస్తాను!
ధన్యవాదాలు.
Post a Comment