తాటాకు చప్పుళ్ళు
ఆ మధ్య ఓ యువహీరో తన అభిమానులతో సహా పైరసీ పేరుతో సీడీ షాపుల మీద దాడి చేసి తల బొప్పి కట్టించుకున్నాడు.
ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం పరిశ్రమకి సపోర్టు చెయ్యాలి అనీ, పైరసీ ని నిరోధించి, కోట్లలో నిర్మాతలకి వస్తున్న నష్టాన్ని నివారించాలి అనీ కోరితే, మన ము. మం. గారు, 'అలాగే, అలాగే, అలాగలాగే' అన్నారట.
{తమిళనాడులో ఓ జాతీయ నాయకుడు (వీడు కాంగీరేసు కాదు--ఇందిరాగాంధీని నాయకత్వం లోకి రాకుండా శతవిధాల ప్రయత్నించిన, తన 'ప్లాన్ ' తో నెహ్రూ మంత్రివర్గాన్ని కాపాడిన, తన పేర ఓ కాంగ్రెస్ స్థాపించిన--కామరాజ్ నాడార్!) యెవరేమడిగినా, నవ్వుతూ ఒకే మాట అనేవాడట--'పార్కలాం' అని. అంటే 'చూద్దాం' అని! అలాగ మన ము. మం. కి కూడా 'అలాగే, అలాగే, అలాగలాగే' అనేది వూతపదం అయిపోతుందేమో!}
ఇంతకీ ఇంత గోలకీ కారణమేమిటి?
కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం, మేం తీసిన సినిమాని మేం చెప్పినన్ని డబ్బులు ఖర్చుపెట్టేవాళ్ళు మాత్రమే చూసి, మాకు కొన్ని పదులో, వందలో కోట్లు మాత్రమే కురిపించాలి--అనే వాదన నిర్మాతల్నించీ, నిర్మాతలు మా స్టార్ వాల్యూ తో మమ్మల్ని బుక్ చేసి, కొన్ని కోట్లు ఇస్తున్నారు, అలా ఇవ్వాలంటే--వాళ్ళు ఇచ్చిన కోట్లకి కొన్ని రెట్లు రాబట్టుకోవాలికదా? అది జరగాలంటే, నిర్మాతల వాదన నిజమే! కాబట్టి.....అంటారు యువ, ముసలి హీరోలు!
అసలు మిమ్మల్ని అన్ని కోట్లు ఖర్చుపెట్టి, అంత ఖరీదైన హీరోల్ని (పాత హీరోల, దర్శకుల, సంగీత దర్శకుల, హాస్య నటుల, కొడుకుల్నీ, మనమల్నీ హీరోలుగా) పెట్టి సినిమాలు తియ్యమని యెవరు దేబిరించారు?
తీశారుపో, ఫలానావాళ్ళే, ఫలానా అంత డబ్బుచెల్లించే, చూడాలని అనడానికి మీకేం హక్కుంది?
మీరు చేస్తున్నది వ్యాపారం అయితే, అందరూ చేసేది వ్యాపారాలే కదా? వాళ్ళు బాగు పడకుండా, మీరే బాగుపడాలని, దానికి ప్రభుత్వం సహాయపడాలని కోరడం యెంతవరకూ సబబు?
(మిగతా ఇంకోసారి!)
6 comments:
మీరు పెట్టుబడి పెట్టి మీరు నిర్మించుకున్న ప్రోడక్ట్ పై సర్వ హక్కులు మీకే వుంటాయి. ఎవరైనా దొంగిలిస్తే, చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని అర్దించడంలో తప్పు లేదు.
"వీడు కాంగీరేసు కాదు"-మీరు ఇలా రాయటం నాకు ఆశ్చర్యం కలిగించింది.
డియర్ a2zdreams!
మీరన్నది నిజమే. కాని, మీడియాలో యేదైనా విడుదల అయ్యేవరకే ఆ హక్కులు వుంటాయి. ఒకసారి విడుదల అయ్యాక, అది పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది.
వార్తాపత్రికల్లో వార్తలకి కాపీ రైట్ వుండదుకదా?
(కొంతమంది సిండికేటెడ్, లేదా ఫ్రీలాన్స్ పాత్రికేయులు తమ ఆర్టికిల్స్ కి కాపీ రైట్ ప్రకటించుకోవచ్చు. అంతే)
ఇదే అన్ని మీడియాలకీ వర్తిస్తుంది.
ధన్యవాదాలు!
డియర్ రాజేంద్ర కుమార్ దేవరపల్లి!
నా వుద్దేశ్యం కాంగీరేసు అంటే, ఇందిరాగాంధి స్థాపించిన Cong (I) పార్టీ. కామరాజ్ ఆ పార్టీకి చెందినవాడు కాదు--అని.
ధన్యవాదాలు!
కామరాజ నాడార్ ను వీడు అని సంబోధించటం గురంచి సార్ నేను అన్నది.
డియర్ రాజేంద్ర కుమార్ దేవరపల్లి!
ఓ అదా! అంతట్లో వాడి గౌరవానికి వొచ్చిన లోపం యేమిటి?
మదురై యూనివర్సిటీ కి యెప్పుడో వాడి పేరు తగిలించారుకాబట్టిగానీ, ఇప్పుడు ఆ రాష్ట్రం లోనే యెవరూ తలుచుకోడం లేదు. అలాంటి ప్రసిధ్ధి పొందాడు. యెందుకంటే--పార్టీనీ, దేశాన్నీ అలా నాశనం చేశాడు కాబట్టి.
అంబేద్కర్ లా మనుషుల 'విగ్రహీకరణ' కి పూర్తి వ్యతిరేకం నేను. మీకు తెలుసో లేదో--గాంధీజీని యెప్పుడూ మహాత్మా అని పిలవలేదు అంబేద్కర్. 'మిష్టర్ గాంధీ' అనే పిలిచేవాడు.
అయినా పబ్లిక్ లైఫ్ లో వున్నవాళ్ళని, దేవుడితో సహా, వాడు, వీడు అనే అంటారు.
ఇంకా వివరణ కావాలంటే ఇంకో టపా రాస్తాను.
ధన్యవాదాలు.
Post a Comment