Monday, April 5

చొప్పించబడ్డ వార్తలు

బీటీ--2

(కాయతొలుచుపురుగు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం పై, పరిష్కారం యేమిటి అని అడిగిన ప్రశ్నకు)

గుజరాత్ తో పాటు చుట్టుపక్కల వున్న రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల లో (6 రాష్ ట్రాల్లో--యెన్నివేల యెకరాల్లోనో!) 'బోల్గార్డ్-1' రెండు మూడేళ్ళు మానేసి, 'బోల్గార్డ్-2' వెయ్యాలట. (ఈ రెండూ మొనోశాంటో నే అమ్ముతుంది మరి!)

ఈ సాగులో కూడా, పత్తికాయలు అభివృధ్ధి చెందే సమయం లో, "కనీసం రెండు మూడు సారులు పురుగు మందు పిచికారీ చెయ్యాలట."

6 రాష్ట్రాల్లోని వేల యెకరాల్లో, రెండు మూడేళ్ళపాటు వాళ్ళ పంటనే వేస్తూ, పురుగు మందులు కూడా చల్లుతూ వుండడానికి యెంత ఖర్చు అవుతుంది? మరింక బీటీ యెందుకు?

చైనాలో నిబంధనలు చాలా కఠినం గా వుంటాయట. రైతులకు రెఫ్యూజియా విత్తనాలను సరఫరా చెయ్యవలసిందే నట. (లేక పోతే మొనోశాంటో కి పగులుతుంది మరి!)

బీటీ వల్ల దిగుబడి పెరగలేదంటున్నారు కదా అన్న ప్రశ్నకి, ఆయన యెంత అందం గా జవాబిచ్చాడో చూడండి.

దిగుబడి పెరగదు--అన్నాడు. కాని, ఓ మొక్కకి 100 గ్రాముల దిగుబడిని ఇవ్వగల శక్తి వుంటే, బీటీ వల్ల జన్యుబలం పెరగడం వల్ల, పూర్తి స్థాయి దిగుబడి వచ్చి తీరుతుంది--అంటున్నాడు. (అంటే వందకి వంద గ్రాములు అన్నమాటేకదా?) ఇదెలా సాధ్యం?

విత్తనాలకి మొనోశాంటో మీదే ఆధార పడాల్సి వస్తుంది కదా అంటే, బోల్గార్డ్ మాత్రమే మోనోశాంటోవి--ఇంకా చైనా, ఖరగ్ పూర్, ధార్వాడ్, బెంగుళూరు ల నించి కూడా మొత్తం 4 రకాల బీటీ లని తిసుకున్నారట. ఇంకో మూడు రకాలు పరీక్ష దశలో వున్నాయట. మరి ఇవన్నీ యెవరు అమ్ముతున్నారు? యెప్పటికి అందరికీ అందుబాటులోకి వస్తాయి?

1996 లో బీటీ పత్తి, మొక్కజొన్న, ఆలుగడ్డ పంటలు వచ్చాయి గానీ వివిధకారణాలవల్ల ఆలుగడ్డ ఆగిపోయిందట. (ఈ మొక్క జొన్న, ఆలుగడ్డ లని కోళ్ళకీ, పశువులకీ మాత్రమే వాడారని, అదికూడా ఇప్పుడు అనేక దేశాల్లో మానేశారనే నిజాన్ని దాచిపెడుతున్నాడీయన.)

వంకాయ మనకి ముఖ్యమైన కూరగాయ. మన పెరటితోటల్లో పెంచుకునే కూరగాయ! దాదాపు అన్నికాలాల్లోనూ లభిస్తుంది. సీజన్లో తక్కువ రేటుకే దొరుకుతుంది. అలాంటిదాన్ని బీటీ చేసి, మేమే అమ్ముకుంటాం, మీరు చచ్చినట్టు తినండి (దీన్ని పశువులమీదకూడా ప్రయోగించం--మీ పాట్లు మీరు పడండి!) అంటే--వొప్పుకోడానికి మనకన్నా వెఱ్ఱివెధవలు యెవరూ వుండరనుకున్నాడేమో!

ఇలాంటి ఆలోచనలని చీల్చి చెండాడండి! 

5 comments:

శరత్ 'కాలమ్' said...

మనకన్నా అనకండి. భిటి ని సమర్ధించే నాలాంటి వెర్రి వెధవలు (మీ భాషలో) కూడా వున్నారు.

Anonymous said...

ఎందుకు సమర్థిస్తున్నారో తెలివిగా, తార్కికంగా చెప్పేవరకూ మనలాంటిలో మీరు వుంటారు. ఏదో ఫ్రీగా వస్తోందనో / గతి లేకనో తినడం వేరు, సమర్థించడం వేరు.

కృష్ణశ్రీ said...

డియర్ శరత్ 'కాలమ్'!

నిజంగా సమర్థిస్తానంటున్నారా?

మీరేమైనా పత్తి రైతా? లేక బీటీ శాస్త్రవేత్తా?

వంకాయలో బీటీ వల్ల మాలాంటి వెర్రి వెధవలకి యేమైనా లాభమేమో చెప్పగలరా?

ధన్యవాదాలు!

కృష్ణశ్రీ said...

డియర్ Anonymous!

బాగా అన్నారు. సంతోషం.

ధన్యవాదాలు.

Ekalavya said...

మీకు ఇవన్నీ రీసెర్చి చెయ్యడానికి యెలా కుదురుతుందో?

వూరుకొంటే, మనుషుల్ని కూడా బీటీ చేస్తారేమో అనిపిస్తుంది. నిజం గా అలా చేసినా జనాభా తగ్గుతుందేమో!

చీల్చి చెండాడండి గురూగారూ.