భస్పీ మాలబబ్రహ్మణ్యం
కొంతమంది 'గొప్పవాళ్ళుగా పుడతారు', కొంతమందికి 'గొప్పతనం వాళ్ళ నెత్తిమీద రుద్దబడుతుంది', కొంతమంది 'గొప్పతనాన్ని స్వయంకృషి తో పొందుతారు'! అంటారు.
ఆఖరి కోవకి చెందే, మన జాతి గర్వించదగ్గ తెలుగు రత్నం మన యెస్పీ!
మొన్న (18-01-2010) '....ట్ పాడుతా తీయగా' ఎపిసోడ్ ముగింపులో, కీరవాణి 'అమ్మా సరోజినీదేవీ' పాట పాడితే 'అది ఆయన సంస్కారం' అన్న బాలూకి సమాధానం గా, కీరవాణి....
'సినిమావాళ్ళందరూ వీ ఐ పీ ల్లా శ్రీపతిని దర్శించుకుని తమ కోరికలు కోరుకుంటే, బాలూ కాలినడకన కొండ యెక్కి, స్వామి సమక్షం లో తను ఈ రోజు ఈ స్థితికి రావడానికి కారణమైన వాళ్ళందరినీ పేరు పేరునా తలుచుకుని, వారి తరఫున స్వామిని ప్రార్థించాడు!' అన్నాడు!
దటీజ్ బాలసుబ్బు!
(యెప్పుడో ఆయన సరదాగా చెప్పిన ఆయన పేరుని--అలాగే వుపయోగిస్తున్నందుకు యస్పీకి క్షమాపణలు.)
4 comments:
నిజమే!బాలసుబ్రహ్మణ్యం గారి వ్యక్తిత్వం చాలా గొప్పది.నాకు అత్యంత ఇష్టమైన మహానుభావుడు.
"కొండ అద్దమందు కొంచెమై ఉండదా" అనేది ఆయన విషయం లో కరక్టండి. గొప్పవాళ్ళు ఎంత ఎత్తుకి ఎదిగితే అంత అణకువగా ఉంటారట.
డియర్ చిలమకూరు విజయమోహన్!
సంతోషం!
ఆయన 'మహానుభావుడు' అవునో కాదో నాకు తెలియదు గానీ, ఖచ్చితంగా--మహా అనుభవుడు!
ధన్యవాదాలు!
డియర్ Amrapaali!
బాలూ ఆయనమీద ఆయనే వేసుకొని ఎంజాయ్ చేసే జోకు ఇది! (ఆయన ఒక కొండలా వుంటాడని, టీవీలో కొంచెమ్ గా కనిపిస్తున్నానని--ఆయన కవిహృదయం!)
'తరువు లతిరస ఫలభార గురుతగాంచు....' అని చెప్పనే చెప్పారు!
ధన్యవాదాలు!
Post a Comment