Friday, May 13

ప్లాస్టిక్ వినియోగం-2



సంచులపై నిషేధం

ప్రపంచ వ్యాప్తంగా, "ఫాసిల్ ఫ్యూయెల్స్" (మరో మాటలో చెప్పాలంటే--పెట్రో వుత్పత్తులు) అత్యధికంగా "తగలేసే" దేశం అమెరికా.

ఇప్పటికీ, వాళ్ల దేశాధ్యక్షుడు కూడా, తన విశ్రాంతి సమయంలో "చెట్లు నరుకుతాడు" తన యింట్లో "ఫైర్" కోసం! అది వాడికి "పేస్ టైమ్"!

మన దేశంలో, ఓ నలభై యేళ్ల క్రితమే, "ఓజోన్ పొరకి" చిల్లు పేరుతో, అమాయక గిరిజనులు అడివిలో యెండుపుల్లలు యేరుకొస్తూంటే, కేసులు పెట్టేవారు! "పొగలేని పొయ్యిలని" కనిపెట్టి, ప్రచారం చేసి, సబ్సిడీతో వాటిని ఇచ్చీ, ఇలా చాలా వేషాలు వెయ్యడం మొదలెట్టారు.

(మీకు అనుమానమైతే, అప్పటి "సన్‌డే"; "ది వీక్"; "ఇండియా టుడే"; "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ" లని వెదికి చూడండి--నెట్ లో దొరక్కపోవు)

ఈ రోజున, అమెరికాలో ప్రతీ "5 సెకన్లకీ" సుమారు "60 వేల" ప్లాస్టిక్ సంచులని వినియోగిస్తున్నారట! అంటే సెకనుకి 12 వేలు! అంటే రోజుకి, నెలకి, సంవత్సరానికి--యెన్నిమిలియన్లు?

మరి మనకెందుకండీ--ప్లాస్టిక్ సంచుల నిషేధం?.....గొంతులూ, గుడ్డలూ చించుకోడానికీ, వుద్యోగులు దండుకోడానికీ కాకపోతే?

పర్యావరణం వెర్రితో వింతపోకడలు పోతున్నాము మనం.....టూరిష్టు స్థలాలతో సహా!

ఆలోచించండి!  

11 comments:

Anonymous said...

కృష్ణశ్రీగారూ,
అమెరికాలో చెట్లు కొట్టడం ఎంతో, పెంచడంకూడా అంతకు ఎక్కువేనండీ. మామూలుగా మన ఇంట్లో చెట్టుకూడా మనం కొట్టకూడదండీ. ఆయా సిటీ పర్మిషన్ తీసుకుని, కొట్టాలి.
"నాకు తెలిసిన యినఫర్మషన్ ప్రకారం"

A K Sastry said...

పై అన్నోన్!

మీకుతెలిసిన 'యినఫర్మషన్' ప్రకారం మీరు కరక్టే!

కానీ, ఇవాళ మనం ఓ వంద మొక్కలు నాటడానికీ, ఓ వందేళ్లనించీ వున్న చెట్టుని కొట్టడానికీ తేడా లేదూ? (వాడి చెట్లు వాడు కొట్టుకోడానికి సిటీ పర్మిషన్ రావడం అసాధ్యమా? అయినా వాడి విశ్రాంతి గృహాలు వుండేది సిటీల్లోకాదు--కొండా కోనల్లో!)

వాడి ఇంటి చుట్టూ వున్న చెట్లని వాడు కొట్టడానికీ, మనవాళ్లు అడవిలో యెండుపుల్లలు యేరుకోడానికీ తేడా లేదూ?

అసలు విషయం అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. నిమిషానికి 60 వేల ప్లాస్టిక్ సంచులంటే........!!!!

(మీరుండేది అమెరికానా? యెక్కడనించి వొచ్చిందీ యినఫర్మషన్?)

Anonymous said...

అచ్చు తప్పువల్ల 'యినఫర్మషన్' అని పడిందండీ.. వ్యంగ్యం కాదు.
సిటీ పర్మిషన్ రావడం అసాధ్యం కాదుగాని, విచక్షణారహితంగా కొట్టకుండా యిలాంటి కంట్రోల్ వుంటే ఉపయోగపడుతుందేమోనని నాఅభిప్రాయం. ఎండుపుల్లలు ఏరుకునేవాళ్ళమీద ప్రతాపం చూపించే ఎదవలగురించి మనకు తెలియందేముంది చెప్పండి.
ప్లాస్టిక్ సంచులంటారా... వాడకుండా వుండడానికి,
వీలైనంతవరకు రీసైకిల్ చెయ్యడానికి ప్రయత్నిస్తూనే వున్నాం.
అవునండీ నేనుండేది అమెరికాలోనే.

A K Sastry said...

పై అన్నోన్!

అబ్బే! నేనూ అది వ్యంగ్యం అనుకోలేదు. పొరపాట్లు యెవరికైనా వస్తాయి. నేనుకూడా నా జవాబులో "5 సెకన్లకీ" బదులు, నిమిషానికి అని వ్రాసేశాను చూశారా?

చాలా సంతోషం!

అన్నోన్ గా కాకుండా, మీ బ్లాగ్ ద్వారా వ్యాఖ్యానిస్తే మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నట్టవుతుందికదా?

(బ్లాగ్ లోకంలో అఙ్ఞాతలకి వ్యతిరేకిని నేను.)

Anonymous said...

(బ్లాగ్ లోకంలో అఙ్ఞాతలకి వ్యతిరేకిని నేను.)

అబ్జక్షన్ యువర్ ఆనర్! అబ్జక్షన్!

పూర్వకాలం, అశోకుడు, సముద్రగుప్తుడు, భోజరాజు, ఖెష్ణదేవరాయలు, అజ్ఞాతలుగా సంచరిస్తూ, ప్రజల బాగోగులను చూడటమే కాక, దుష్ట శిక్షణ చేసినట్టు ఆధారాలున్నాయ్. "కస్ట్మర్లను బ్యాకులు ఎలా గౌరవిస్తాయో, బ్లాగర్లు అలా మసలుకోవాలి' అని నా అభిప్రాయం. వుత్తి మలాం రాసి, మసిపూసి మారేడుకాయ చేసే కామెంట్లిచ్చే జ్ఞాతలకన్నా, కొంచెం కరకుగా వున్నా పాలిష్‌లేని, కల్తీలేని సరుకందించే అజ్ఞాతలు మేలన్నది నా భావన. మరీ అకారణగా బూతు రాసే ఆజ్ఞాతలను తొలగించవచ్చు, ఆ ఆప్షన్ మీకు వుండనే వుంది.

అజ్ఞాతల్ని ఆడి పోసుకునే చాదస్తపు బ్లాగర్లంటే నాకు సరదా, మెల్లిగా నొప్పిలేకుండా గిల్లాలనిపిస్తుంది, అదేంటో! :)) :P

Anonymous said...

ముద్రారాక్షసముంది, గట్టిగా గొడవ చేయక కాస్త అడ్జస్టయిపోండి మేస్టారూ.. :))

Sudha Rani Pantula said...

@snkr గారు, మీరు మరీను. మరీ అంత మురిపించుకుంటారేంటండీ. వాళ్ళేదో సరదా పడుతున్నారు కదా.మీ ప్రొఫెల్ ఏదో పెట్టేయచ్చుగా. పేరు పెట్టుకొని ఎంత గిల్లినా పర్లేదంటున్నారుగా వాళ్ళు.

Anonymous said...

సుధ గారు, ఏదో ఒహ పేరు పడేస్తే బాగానే వుంటుందనుకోండి, కానీ సమస్య ఏంటి? మూలాలను శోధించాలని... :))
కృష్ణశ్రీ గారంటే ఏదో అభిమానం, మురిపించుకోవడం కాదు గాని, ఆయన కూడా ... చాదస్తపు బ్లాగర్ల లిస్ట్‌లో కలుస్తారేమో అని కొంచెం కంగారు, అంతే! :)
నాకు తగిలిన మరీ అగ్నిహోత్రావధానుల టైపు బ్లాగర్లు... వద్దులేండి, అసలే ... ఏడుస్తారు.

/పేరు పెట్టుకొని ఎంత గిల్లినా పర్లేదంటున్నారుగా వాళ్ళు./ :)) పేరు పెట్టుకున్నా, అడ్రస్,ఇంటిపేరు, వంశవృక్షం, నామ నక్షత్రం, గోత్రం కూడా ఇచ్చి మరీ గిల్లాలంటే .. మరీ సరదా ఏముంటుందండి?

Sudha Rani Pantula said...

గిల్లేవాళ్ళకు, గిల్లించుకునే వాళ్ళకు లేని అభ్యంతరం నాకెందుకని :)) సరే...అలాక్కానివ్వండి. ఒక సందేహం మాత్రం ఉండిపోయింది. గిల్లేవాళ్ళకి నొప్పి తెలుస్తుందా అని.

A K Sastry said...

డియర్ Snkr!

అబ్జక్షన్ ఓవర్ రూల్డ్.

మీరు వ్రాసినవాళ్లందరూ ప్రజల క్షేమం కోసమే అలా చేశారనీ, అలాంటి "అఙ్ఞాతం" యెక్కడ అవసరమో ఇదివరకే ఓ టపాలో వ్రాశాను అనీ మరువకండి.

శక్తివంతమైన ప్రభుత్వాలని సైతం యెదుర్కొంటున్న వికీలీక్స్ అసాంజ్ స్వంత పేరుతోనే, చిరునామాతోనే వ్యవహరిస్తున్నాడు.

ఓ టపా బాగుంది అనో, బాగోలేదు అనో అనడానికి అఙ్ఞాతంగా యెందుకు? ఆడో మగో చెప్పుకోడానికీ, వయసూ, అభిరుచులూ వ్రాసుకోడానికీ యెందుకు సిగ్గు? లేదా వాళ్లది పిరికితనమా?

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ Sudha!

పై వ్యాఖ్యతకి ఇచ్చిన సమాధానం చదవండి. వ్యాఖ్యలు యెంత సరదాగా వ్రాసినా, టపాలోని విషయాన్ని మాత్రం సీరియస్ గా తీసుకొని వ్రాస్తే సంతోషం.

ధన్యవాదాలు.