Thursday, May 5

ఈనాడు/న్యూస్ టైమ్రామోజీరావు

వార్తా పత్రికలు చదవడం నేర్చుకున్నప్పటి నుంచీ, "ఆంధ్ర పత్రిక" చదివేవాడిని. ఆ పత్రిక ఆగిపోయాక, "ఆంధ్ర ప్రభ". 

ఈనాడు పత్రిక మొదటి సంచిక/సంపుటి నుంచీ అదే చదువుతున్నాను తెలుగులో. (ఇంగ్లీషులో కొన్నాళ్లు "న్యూస్ టైమ్" చదివేవాణ్ణి.....చక్కగా కంటికింపైన "ఫోంట్స్" తో, పొందిగ్గా వెలువడే ఆ పేపర్, ఇప్పటికీ "ది బెస్ట్!". కొన్ని వూళ్లలో అది దొరకకపోవడంతో మానేశాను. ఇప్పుడు వెలువడుతోందో లేదో మరి.)

అందుకే, ఈనాడులో కూడా "పెయిడ్ న్యూస్" వస్తోందని బాధపడ్డాను. వారికేమి ఖర్మ అని?! 

ఇప్పటికీ, కొన్ని ఆడంబరాలూ, భేషజాలూ లేకపోతే, "క్రెడిబిలిటీ" సరిపోయినంతగా వార్తలు ఇచ్చేది ఈనాడు వొక్కటే.

కానీ, ఇప్పుడు కొందరు విలేకర్లు అధికారులతో "కుమ్మక్కై" వాళ్లగురించి గొప్పవార్తలే వ్రాస్తున్నారు. 

గత మూడురోజులుగా, మా ఆర్డీవో ఆఫీసుల్లో జరుగుతున్న తతంగాన్ని వారి దృష్టికి తెచ్చినా, ఇప్పటివరకూ అధికారులని నిలదియ్యలేదు! వార్త రాలేదు!

ఇంకా, రామోజీరావు ది యూనివర్సిటీల్లో డాక్టరేట్ కోసం "రీసెర్చ్" చెయ్యవలసిన వ్యక్తిత్వం.

తెలుగు వాళ్లలో చట్టబధ్ధంగా మొట్టమొదటి కోటీశ్వరుడు ఆయన. యే పని చేపట్టినా, యే రంగం లోనైనా,  నిబధ్ధతతో, చక్కగా ప్రణాళిక రచించే వాళ్లని "రిక్రూట్" చేసుకొని, "సక్సెస్" అనే పిరమిడ్ పైనే నిలిచాడు యెప్పుడూ! (అలాంటివాళ్లకు కూడా కొన్ని "ఫెయిల్యూర్స్" వుండే వుంటాయి--నాకు గుర్తు లేవు).

2001 లో అనుకుంటా, ఆయన మొత్తం యేడో, పదకొండో (బుడుగు లెఖ్ఖల్లో) "ఈనాడు" యెడిషన్లని హైదరాబాదులో కూర్చొని, "టచ్ స్క్రీన్" తో "ఆవిష్కరించడం", వెంటనే పేపర్లు ప్రింటయి వస్తున్నట్టు టీవీలో కనిపించడం (చెన్నై యెడిషనే కొంచెం ఆలస్యం అయిందనుకొంటా--సాంకేతిక కారణాలతో) "అత్యద్భుతం"!

అలాంటి "సక్సెస్" గురూ కి పాదాభివందనాలు!

(ఇప్పటికే యెక్కువ వ్రాసేశాననుకుంటా. వుండవిల్లి యేమంటాడో? మార్గదర్శి ఫైనాన్సియర్స్ మీద పడ్డాడుగానీ, "ముథూట్"; "మణప్పురం" ల మీద పడే ధైర్యం వుందా?)

10 comments:

శరత్ 'కాలమ్' said...

న్యూస్ టైం నాకూ నచ్చేది. చూడటానికి బావుండేది. టాక్సుల్లో లాస్ చూపించడం కోసమనే ఆ పత్రికను తెచ్చి అంత బాగా నడపలేదని ఒక పుకారు.

Anonymous said...

Madhyapana Nishedham kosam Eenadu paper lo neethi sukthulu gurthunnaya.... mari avi thanaki varthinchavu... aa rojullo Ramoji Hotels lo matram No Ban on Liquor.

Meeru cheppinatlu AP lo nijayithi gala modati kotiswarudu Ramoji...:-) Adhi mana dourbhagyam!!!

Anonymous said...

వుండవల్లిని అలా ఉంచండి. అమ్మ వొడి బ్లాగర్ ఈ టపా చూస్తే మిమ్మల్ని కూడా నకిలీ కణికుడి పదకొండో అవతారంగా మార్చి,రామోజీ రావు చెంచా అని వర్ణిస్తూ ఒక పది వేల ఎపిసోడ్ల బ్లాగు టపాలు రాస్తారు జాగ్రత్త

కృష్ణశ్రీ said...

డియర్ శరత్!

చాలా సంతోషం.

నాదో చిన్న పొరపాటు--"చట్టబధ్ధంగా" అనడానికి బదులు "న్యాయబధ్ధంగా" అని వ్రాసేశాను. (వీటికి తేడా యండమూరి యెప్పుడో చెప్పాడు.) ఇప్పుడు సవరించాను.

వాళ్ల ఆడిటర్లకీ, ప్రభుత్వానికీ యేమీ అభ్యంతరం లేదు మరి!

అలాగే "ప్రియ" ఆవకాయల డెలివరీ స్కీమూ, విపుల, చతుర లతో సాహితీ సేవ, "ప్రియ" స్నాక్స్, ఫ్లాపు సినిమాలు తియ్యడం.....ఇలా.

నేనిదివరకే వ్రాశాను "ఆడిటర్లని" బాగా మేనేజి చేసుకోండి....సత్యం వాళ్ల లాగా అని!

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

పై మొదటి అన్నోన్!

అప్పటి పరిస్థితుల్లో, ఈనాడు "మద్య" (మొన్నెవరో పాడుతా తీయగాలో "మధ్య" అని పాడదానికి "మద్య" అనిపాడుతుంటే సవరించాడు బాలు) నిషేధానికి త్రికరణ శుధ్ధిగా కృషి చేసింది. నిషేధింపచేసింది--ఎన్‌టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యగానే--ఆయన ఆ ఫైలు మీద "మొదటి" సంతకం చెయ్యడం ద్వారా!

వొళ్లు బలిసినవాళ్లకీ, అది నిత్యావసర వస్తువైన వాళ్లకీ మద్యాన్ని సరఫరా చెయ్యడం ఓ వ్యాపార నీతి. అప్పటి ప్రభుత్వం (అంటే "సర్వాధికారులూ") నిర్ణయించిన "పోలసీ" ప్రకారమే అవి జరిగాయి.

దయచేసి "తేడాలు" తెలుసుకోండి.

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

పై రెండో అన్నోన్!

నాకా భయం లేదు. నేను అసలు "కణికుడి"నో కాదో నాకు తెలీదు. ఇంక నకిలీ?!!!......!

అమ్మ ఒడి వ్రాసేవి కూడా పచ్చి నిజాలే!

అయినా "దేన్‌దార్దాన్‌దే" (ఇది యండమూరి వ్రాసిన ఓ చిన్న కథ టైటిల్!) మరి!

ధన్యవాదాలు.

phaneendra said...

నేను ఈజేయెస్ లో చేరిన 2003లో న్యూస్ టైం వస్తుండేది. 2004 కొత్త సంవత్సరం ముఖం చూసినట్టు లేదా పేపర్.

సోమా పండ్ల రసం, కంఫెక్షనరీ వ్యాపారం, ఇంకా అలాంటి ఒకటో రెండో ఫ్లాపులు ఉన్నట్టున్నాయి ఆయన ఖాతాలో.

న్యాయబద్ధంగానా? చట్టబద్ధంగానా?

2001 నాటివి పేపర్ ఎడిషన్లు కాదేమో! టీవీ ఛానళ్ళేమో అని గుర్తు.

ఫణీంద్ర పి, ఈటీవీ2

phaneendra said...

dUbagumTa ghaTana tarvAta sArApai samaram modaleTTinaTTunnAru, madyam paina kAdEmO. nishEdham kUDA sArA painE vidhimchinaTTu gurtu... tappaitE savarimchagalaru.

phaNImdra pi, ITIvI2

phaneendra said...

దూబగుంట ఘటన తర్వాత సారాపై సమరం మొదలెట్టినట్టున్నారు, మద్యం పైన కాదేమో. నిషేధం కూడా సారా పైనే విధించినట్టు గుర్తు... తప్పైతే సవరించగలరు.

ఫణీంద్ర పి, ఈటీవీ2

కృష్ణశ్రీ said...

డియర్ phaneendra!

"సోమా" గుర్తు చేసినందుకు సంతోషం. అసలు బావుండేవి కాదు.

శరత్ వ్యాఖ్య తరవాత సవరించాను--చట్టబధ్ధంగా అని.

2001 గానీ, 2000 గానీ--ఖచ్చితంగా పేపర్ యెడిషన్లే--నేను సరిగ్గా ఆ టైముకి టీవీ పెట్టుకొని చూశాను. అప్పుడే మా తాడేపల్లిగూడెం, చెన్నై, ముంబై, బెంగుళూరు యెడిషన్లు ప్రారంభమయ్యాయి.

దూబగుంట తరవాత సారాతోపాటు అన్ని రకాల మద్యాలనూ (ఐ ఎం ఎఫ్ ఎల్ తో సహా) నిషేధించారు. చక్కగా అమలు కూడా చేశారు.

అప్పట్లో కొంతమంది ప్రభుత్వ "పర్మిట్లు" తెచ్చుకొనేవారు, బోర్డర్లలో వున్నవాళ్లు ప్రక్క రాష్ట్రాలకి వెళ్లి, తాగి వచ్చేసేవారు. కాకినాడవాళ్లు యానాం వెళ్లీ--ఇలాగ.

రాయదుర్గం అనే వూరికి కర్ణాటక బోర్డరు 15 కిలోలనుకుంటా. ఆ రోజుల్లో "నిషేధం స్పెషల్" "తాగుడు స్పెషల్" లాంటి బస్సులు నడిపి, సాయంత్రం 7-00 కల్లా అక్కడ చేర్చి, మళ్లీ రాతి 10-00 కల్లా ఇళ్ళదగ్గర దింపేసేవారట. ఇంక ఆ బస్సుల్లో వినోదమే వినోదం ట.

కొంతమంది మిలిటరీ వాళ్ల దగ్గర యెక్కువ రేటుకి కొనుక్కొనే వారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అనుకుంటా నిషేధం యెత్తేశారు--అమలు చెయ్యడం కష్టమైపోతూంది అంటూ.

ధన్యవాదాలు.