Sunday, September 12

కబుర్లు

అవీ ఇవీ-2

అతడే ఓ సైన్యం! పేరు జూలియన్ పాల్ అస్సాంజ్. ఆస్ట్రేలియన్.

చేసిందేమిటి? ప్రపంచ ప్రఖ్యాత వికీలీక్స్ స్థాపకుడు. ప్రపంచానికి తెలియని, అమెరికా యెవరికీ తెలియ కూడదనుకున్నవీ, తన వెబ్ సైట్ లో విడియోలతో సహా పెట్టి సంచలనం సృష్టించాడు. అగ్రరాజ్యం వెన్నులో వణుకు పుట్టించాడు.

అన్నిదేశాల మాజీ పోలీసు అధికారులూ, అసమ్మతి నేతలూ, ప్రభుత్వోద్యోగులూ, మానవహక్కుల కార్యకర్తలూ అనేకమంది "అఙ్ఞాతం" గా, తమంతట తామే, రహస్య సమాచారం అందిస్తున్నారట ఈ వెబ్ సైట్ కి. (మన అఙ్ఞాతలు నేర్చుకుంటే బాగుంటుంది!)

విషయమేమిటంటే, అస్సాంజ్ సృష్టించిన 'ద ఆనియన్ రూటర్ ' అనే ప్రొటోకాల్ వల్ల, అసలు సమాచారం యెక్కడినించి వచ్చిందో పట్టుకోవడం అసాధ్యం ట.

అఫ్గాన్ యుధ్ధానికి సంబంధించిన 90 వేల కీలక పత్రాలను బయటపెట్టాడు ఇప్పటివరకూ!

ఇప్పుడు ఇక, ఇరాక్ యుధ్ధ రహస్యాలని బయట పెడతాననీ, అవి మూడు రెట్లు తీవ్రమైనవి అనీ ప్రకటించాడట. బెస్టాఫ్ లక్ చెపుదామా?

ఇదివరకులా కాకుండా, పాకిస్తాన్ ప్రభుత్వ పాలకుల తప్పిదం (దింపేసిన పాలకుణ్ని వురి తీసెయ్యకపోవడం) వల్ల, ఇప్పుడు ముషారఫ్ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి  వస్తాడట. కొత్తపార్టీ పెట్టి, 2013 యెన్నికల్లో పాల్గొంటాడట. దీన్ని పాక్ పార్టీలన్నీ వ్యతిరేకిస్తూ, దేశరాజకీయాల్లో ఆయనకు స్థానం లేదంటున్నారట! తీరిగ్గా ఇప్పుడు వగచి లాభమేమిటో!

అన్నట్టు, పాకిస్థాన్ లో నిన్న విడుదల అవవలసిన సల్మాన్ ఖాన్ చిత్రం 'దబాంగ్' నిషేధించారట. ఇంకా తమ అన్ని టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే భారతీయ కార్యక్రమాలన్నీ నిషేధించారట.

ఓ పక్క పండగరోజునే వేర్పాటువాదులు శ్రీనగర్ లో ప్రభుత్వ కార్యాలయాల్ని దహనం చేసే కార్యక్రమం మొదలు పెట్టారు.

భద్రతాదళాల ప్రత్యేక చట్టాన్ని రద్దు చెయ్యడం కాదు, వాళ్లకి మరిన్ని అధికారాలు ఇచ్చి, వాళ్లని యేరిపారేసే ప్రయత్నం చేస్తే బాగుండును.

అసలు మన సిగ్గులేని ప్రభుత్వం పాకిస్తాన్ ని "శాశ్వత శత్రు దేశం" గానూ, బంగ్లాదేశ్ ని 'అవాంఛిత దేశం ' గానూ ప్రకటించేస్తే, దేశం లో మూడు వంతులు నేరాలు తగ్గిపోతాయేమో!

అదేదో దేశం లో, హేరిస్ మూర్ అనేవాడు చిన్నా పెద్దా దొంగతనాలకి అలవాటు పడ్డాట్ట. ఓ సారి అలా పోలీసుల్నించి పారిపోతూ, దగ్గర్లో వున్న విమానాశ్రయానికి చేరి, అక్కడున్న ఓ విమానం యెక్కి, దాన్ని యెగరేసుకుంటూ తీసుకెళ్లిపోయి, బహమాస్ లోని అబాకో ఐర్లాండ్ లో దింపాడట.

"విడియోగేములు ఆడిన అనుభవం తో, ఇంటర్నెట్ ద్వారా నేర్చుకున్న విద్యతో" ఆ పని చేశానని చెప్పాడట.

అంతేకాదు--అలా మొత్తం ఐదుసార్లు విమానాలని యెత్తుకెళ్లాడట!

ఇదేదో "నమ్మూ-నమ్మకపో" లో వుండవలసిందిగా కనపడడం లేదూ? కనీసం బులేనా లైనా నమ్మేలాగుందా?

యేమో!

.......అవీ ఇవీ ఇంకోసారి.

(బ్లాగ్ మిత్రులు చాలా మంది, నా అన్ని బ్లాగుల్లోనూ, వినాయక చవితి శుభాకాంక్షలు అందించారు. చాలా సంతోషం. వాళ్లందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనుగ్రహించబడాలని ఆశిస్తాను. విడివిడిగా అందరికీ జవాబు ఇవ్వలేకపోతున్నందుకు క్షంతవ్యుణ్ని.)

4 comments:

Sujata said...

Thanks for leaving ur wishes for Vinayaka chaviti in my blog. I reciprocate the same here.

కృష్ణశ్రీ said...

డియర్ Sujata!

సంతోషం.

ధన్యవాదాలు.

RSReddy said...

@ "పాకిస్థాన్ లో నిన్న విడుదల అవవలసిన సల్మాన్ ఖాన్ చిత్రం 'దబాంగ్' నిషేధించారట.
పాపం మన కండల వీరుడు తన సినిమాను అలా అయినా ఆడనిస్తారేమో అనుకొని 'బొంబాయి అల్లర్లకు పాకిస్తానుకు సంబంధం లేనేలేదని సన్నాయి నొక్కులు నొక్కినా' ఫలితం లేకుండాపోయిందన్నమాట. తగిన శాస్తే జరిగింది.
@"మరిన్ని అధికారాలు ఇచ్చి, వాళ్లని యేరిపారేసే ప్రయత్నం చేస్తే బాగుండును."
ఎవరిని ఏరి పారెయ్యాలి సార్. తీవ్రవాదుల పేరుతో సామాన్యులనా? కాశ్మీర్‌లో ఉన్నంతమాత్రాన వారిని (పర మతస్తులు అవ్వడంవళ్ళ కూడా) తక్కువచేసి మాట్లాడుతున్నామేమో? తీవ్రవాదుల పేరుతో చాలామంది సామాన్యులను చంపేస్తున్నందు వల్లనే (అటుపక్క ఈశాన్య రాష్ట్రాల్లోకూడా ఇదే సమస్య) అక్కడ పౌరులు అంతగా తిరగబడుతున్నారనేది వాస్తవమని గమనించగలరు. మన సైనికులను తప్పుపట్టడమనికాదుగానీ కొంత అతిజరుగుతున్నదనేది వాస్తవం. పాపం వారి సమస్యలు వారికుంటాయి.
@"శాశ్వత శత్రు దేశం, అవాంఛిత దేశం "
పాక్ మరీ అంత అమాయకంగా కనిపిస్తుందా సార్? నువ్వు నా శాస్వత శత్రువు అనగానే మన జోలికి రాకుండా ఉంటానికి, లేదా ఇప్పుడేమైనా మనం మిత్ర దేశం అని అన్నామా? అయినా రాజకీయనాయకులే అంతకన్నా ప్రమాదకారులైనప్పుడు ఇలాంటివెలా ఆశిస్తాంలెండి.

కృష్ణశ్రీ said...

డియర్ RSReddy!

కొన్నాళ్లు కొంతమంది సామాన్యులు ఇబ్బంది పడ్డా ఫరవాలేదు, తీవ్ర వాదుల్ని మాత్రం యేరెయ్యండి--అంటే, ఈ ఆందోళనలూ, కర్ఫ్యూలూ, అమాయకుల మరణాలూ వుండవు కదా?

మన మేతావులు చాలా మంది, చర్చలు కొనసాగాలి, ద్వారాలు తెరుచుకోవాలి అంటూ వాగుతూంటారు కదా! ఒకసారి అలా ప్రకటిస్తే, యెవరిసొమ్మూ పోదు. పైగా వాళ్లు చైనాతో అంటకాగుతున్నారాయె! ఒక వేళ చేస్తే, వాళ్లు ఇప్పటికన్నా యేమి చెయ్యగలరు? ఒకేసారి యుధ్ధం ప్రకటించలేరు కదా? (భుట్టో వెయ్యేళ్ల యుధ్ధం అనగానే, మనం యుద్ధం ప్రకటించామా!)

శ్రధ్ధగా చదివి, చక్కగా ప్రతిస్పందించినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు.

జవాబు ఆలస్యం అయింది. యేమీ అనుకోకండి.