Thursday, May 6

"ప్రకటన"

చేస్తున్నవారు : "ఏకే రైట్ టు జస్టిస్.కామ్"

ప్రకటన యేమిటంటే :

"యెనభై ఆరో యెన్నో అభియోగాలు నిజమని నిరూపింపబడి, దోషిగా నిర్ధారణ అయిన 'అజ్ మల్ కసబ్' కి సరైన శిక్ష విధించే అవకాశం మా .కామ్ కి ఇవ్వాలని తగిన న్యాయస్థానం లో పిటిషన్ వెయ్యబోతున్నాం.

"ఆ శిక్ష అమలుచెయ్యడానికి ఉత్సాహపడే పౌరులెవరైనా ముందుగా మా .కామ్ లో రిజిష్టర్ చేసుకోవాలి. (రిజిష్ట్రేషన్ వివరాలకోసం మా .కామ్ సందర్శించండి)

"ఆ నేరస్థుడికి కూడా మానవహక్కులు వుంటాయనేవాళ్ళెవరైనా వుంటే, వాళ్ళని కూడా వీడితో సమం గా శిక్షించడానికి మాకు అనుమతి ఇవ్వాలని కూడా అదే న్యాయస్థానం లో పిటిషన్ వెయ్యబోతున్నాం.

"వాడికి విధించాలనుకుంటున్న శిక్ష యేమిటంటే--

"ఇండియా గేట్ లో మృతవీరుల స్మారక చిహ్నం యెదురుగా, ఓ స్థంభం పాతి, వాడిని గొలుసులతో కదలడానికి వీల్లేకుండా కట్టేస్తాం. అతని దగ్గరకి వెళ్ళడానికీ, అతని ముందు ఒకే సెకన్ వుండడానికీ, తిరిగి రావడానికీ ఒకే మనిషి పట్టే విధంగా క్యూ లైన్ యేర్పాటుచేసి, నడవక్కర్లేనివిధం గా యాంత్రిక పరికరాలని నిర్మిస్తాం.

"శిక్ష యేమిటంటే, యెవరైనా సరే తమ దగ్గర వున్న ఆయుధాలతో అతన్ని, తమకి తోచిన అతని అవయవాన్ని, కొయ్యడం గానీ, పొడవడం గానీ చెయ్యవచ్చు.

"అవి యెంత పదునైన ఆయుధాలైనా అయి వుండవచ్చు. 

"ముఖ్య నిబంధన యేమిటంటే--యే ఆయుధం అయినా 'మూడంగుళాలు పొడవూ, ఒక అంగుళం వెడల్పూ మించి వుండకూడదు '. (ఆయుధాలు ముందుగానే పరిశీలించబడి, అనుమతించబడతాయి).

"ఈ శిక్ష అమలవుతూండగా, మా సొంత టీవీ ఛానెల్లో 24 గంటలూ, ప్రపంచ వ్యాప్త 'లైవ్' కవరేజ్ వుంటుంది. (మధ్యలో ప్రకటనలకి మా వాణిజ్య విభాగాన్ని సంప్రదించండి)

"వాణ్ణి సమర్ధించే 'మానవహక్కులవాళ్ళకి' కూడా, వాడి ప్రక్కనే, ఇలాంటి శిక్షలకే యేర్పాట్లు చెయ్యబడతాయి.

"వాడి సానుభూతిపరులెవరైనా వున్నా, క్యూ లైన్లలో అందరితోపాటు వెళ్ళి, ఇదివరకు యెవరైనా కోసిన చోట కుట్లు వేసుకోవచ్చు, పొడవబడ్డ చోట, మందులు రాసుకోవచ్చు!

"ఈ మొత్తం కార్యక్రమం 48 గంటలపాటు మాత్రమే అమలవుతుంది. ఇంకొక్క సెకను కూడా పొడిగింపబడదు. గమనించండి. (ఒకళ్ళిద్దరు అటూ యిటూగా 1,72,800 మందికి మాత్రమే అవకాశం!) తొందరపడండి.

"గమనిక : ఈ శిక్షల ముఖ్యోద్దేశ్యం--ప్రపంచం లో యే తల్లైనా, 'తోటకూర నాడే' తన బిడ్డని 'ఉగ్రవాదివి కాకురా కన్నా!' అని వేడుకోవాలని.

"తరవాత మీ యిష్టం".

(ప్రకటన ఫూర్తయింది)

సూచన : యేమీ చెయ్యలేని నా కడుపు మంటని తీర్చుకోడానికి మాత్రమే ఈ ప్రకటనని రూపొందించాను. ఇది నిజమని యెవరూ నమ్మవద్దని నా మనవి. ఇట్లు : కృష్ణశ్రీ)

5 comments:

Anonymous said...

ఈ టపాతో ఉగ్రవాదిగా వాళ్ళతో చేతులు కలిపే అర్హత దక్కించుకున్నారు. కంగ్రాట్స్ !

Anonymous said...

పై ముక్క వ్రాసిన అనామకా, ఉగ్రవాదానికి ఇకెలాంటివి విధించమంటారు? పార్లమెంట్ మీద దాడిచేసినవాడిని కూకోపెట్టి మేపుతున్నట్లు మేపాలా? సరే మిగతా విధానాలేమయినా విజయవంతం అయ్యాయా?
టపాలో ఉన్న లోపమేమమంటే ముందు కసబ్ ను కాకుండా, వాడిని సమర్ధించే మన మానవహక్కులు పేరుతో మావోయిస్టు హక్కుల సంఘాలు, ఇంక ఎవో తొక్కలో హక్కులంటూ తిరిగే వెధవలను కుళ్లబొడిచి, ఆ తర్వాతే కసబ్ ను శిక్షాలని అనకపోవటం.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం ఎలా అనేది ఇజ్రాయెల్ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది!!

A K Sastry said...

మిత్రమా! అనామకా!

అంత త్వరగా అర్థం చేసుకొన్నందుకు చాలా సంతోషం.

కుళ్ళబొడవడం కన్నా, టపాలో వ్రాసినట్టు కసబ్ కి పక్కనే వీళ్ళకీ స్థంభాలు పాతి, అదే శిక్ష వెయ్యడమే బాగుంటుంది కదా?

అవి యే సంఘాలైనా, నేను ఇదివరకే వ్రాశాను 'రాక్షసులకి మానవహక్కులు వుండవు! వారి తరఫున మానవులు యెవరూ వాదించకూడదు.' అని.

ధన్యవాదాలు.

Anonymous said...

visit godsavemedia.wordpress.com

A K Sastry said...

డియర్ Anonymous!

చూశాను. నా టపాకీ, ఆ బ్లాగ్ కీ సంబంధం యేమైనా వుందా? యేమో నాకర్థం కాలేదు.

యేమైనా, ఓ కొత్త బ్లాగ్ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.