అంతా అయిపోయింది!
ఓ అప్పారావు గుండాట ఆడుతూ, బాగానే నెగ్గాడట అప్పటివరకూ. ఓ ఐదువేలు సంపాదించాడట అప్పటికి.
'ఆ ఐదు వేలనీ ఐదోనెంబరుమీద వెయ్యి' అని వినిపించిందట చెవిలో.
అలాగే చేశాడు. పదివేలొచ్చాయి!
అలా చెవిలో వినపడిన మాటలని అనుసరించి, ఆడసాగాడు. అప్పటికి ఐదు లక్షలు వచ్చాయి.
'ఆ ఐదు లక్షలూ యేడు మీద కాయి' అని వినిపించి, అలాగే కాశాడు.
మొత్తం డబ్బు పోయింది!
'అర్రే! సరిగ్గా ఇలాగే జరిగి నేను ఆత్మహత్య చేసుకొన్నాను!' అని వినిపించింది సుబ్బారావుకి ఫైనల్ గా.
సరిగ్గా అలాంటి స్థితిలోనే వున్నాడు 'ఐకాస' కన్వీనర్ కోదండరామ్--1973 లో మాలాంటివాళ్ళు వున్న స్థితిలోనే!
అప్పట్లో, ఉద్యమం వుధృతం గా వుండగా, అన్ని సంఘాలూ ఒకే త్రాటి పై వుండగా, బ్యాంకుల్లాంటి ప్రభుత్వ సంస్థలు సైతం వారానికి రెండు రోజులే పనిచేస్తున్న రోజుల్లో, ఆంధ్ర రాష్ట్రం కనుచూపుమేరలో కనిపిస్తూ వుండగా, ఉప ముఖ్యమంత్రి బీ వీ సుబ్బారెడ్డి ప్రత్యేకాంధ్రోద్యమానికి మద్దతుగా రాజీనామా చెయ్యడంతో, మా లాంటి వాళ్ళం "ఇంకేముంది! ప్రత్యేకాంధ్ర రాష్ట్రం వచ్చేసినట్టే!" అనుకున్నాము.
జరిగిందేమిటి? ప్రత్యేకాంధ్ర చంక నాకిపోయింది. జరిగింది కేవలం ముఖ్యమంత్రి మార్పు మాత్రమే!
మరి ఇప్పుడు?
ఐ కా స చంక నాకి పోయింది. కాంగ్రెస్ బయటికి వెళ్ళిపోయింది. టీ డీ పీ ని బహిష్కరించారు. బీ జే పీ ని నమ్మం--పక్కన పెడతాం అంటున్నారు. మరింక కోదండరామ్ దేనికి కన్వీనర్?
ఇప్పుడైనా మించిపోయింది లేదు--శ్రీ కృష్ణ కమిటీని రద్దు చెయ్యమని అందరూ ఆందోళన చేస్తే, కనీసం సామాన్య ప్రజలకి కొన్ని కోట్ల భారం తప్పుతుంది.
ముఖ్యమంత్రి మార్పు అధిష్ఠానం కోరినప్పుడే జరుగుతుంది.
ఈ మాత్రానికి యెందుకొచ్చిన ఆందోళనలు; బందులు; రాస్తా రోకోలు; ఆత్మ హత్యలు; సూడో ఆత్మహత్యలు?
ఆలోచించండి!
2 comments:
Ituvanti paishachika abhiprayalavalle, andhravallante telangana yuvathaku virakti, nirasana. A nirasana mari thama vyakthitvam leni nayakula patla asahyam kalisin phalithame aa athmahatyalu. Deenni artham chesukoleni sahithyakarulu, medhavulu soodo medhavulugaane migilipotharu. Sri krishna garu meeru meelantivallu Aswamedhayagamlo chakravarthullantivaaru. Better, sringarakrishna ke parimithamaithe
డియర్ nagireddy!
ఆవేశానికి ముందు ఆలోచిస్తే బాగుండేది!
ఆంధ్రావాళ్ళని అందర్నీ ఒకే గాటన కట్టేముందు, 1969 లో మీ తెలంగాణా నాయకులు చేసిన నిర్వాకం గురించి తెలుసుకోండి! ఇప్పటి రాజకీయులు చేస్తున్నదీ అదే అని గ్రహించండి!
ప్రస్తుత వుద్యమాల తీరుతెన్నులపై, ఆత్మహత్యలపై అవేదన చెంది మాత్రమే ఈ టపా వ్రాశానని గ్రహించండి.
కోదండరాం వల్లా, శ్రీకృష్ణ కమిటీ వల్లా యేమీ వొరగదని గ్రహించండి.
ఇకనైనా రాజకీయ ద్రోహులకి బుధ్ధి చెప్పండి. ఆప్పుడు మీ ఆవేశానికి అర్థం వుంటుంది.
అలాగే, 'అశ్వమేధం లో...........' అంటే యేమిటో నాకు అర్థం కాలేదు!
ధన్యవాదాలు.
Post a Comment