Friday, November 13

నైతికత


తప్పుడుబిల్లులకి శిక్ష


యెట్టకేలకు యెర్నేని రాజా రమచందర్ కి బోగస్ మెడికల్ బిల్లులు పెట్టి మోసం ద్వారా ప్రభుత్వం నించి డబ్బు తీసుకొన్న కేసులో, నేరం నిరూపణ కావడం తో 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది సీ ఐ డీ న్యాయస్థానం.  


అప్పుడే న్యాయం జయించింది అని మనం అనుకోకుండా, శ్రీ నేతగారు 'పై కోర్టులో అప్పీలుచేసి, నిర్దోషిగా బయటికి వస్తాను' అంటున్నారు.  


మరి చూద్దాం!

4 comments:

చిలమకూరు విజయమోహన్ said...

ఖచ్చితంగా బయటకు వస్తారు, చివరాఖరుకు న్యాయం జయిస్తుంది.

A K Sastry said...

డియర్ చిలమకూరు విజయమోహన్!

పొరపాటేమో!

చివరాఖరుకు జయించేది న్యాయం కాదు--చట్టం, దాని చుట్టాలూను అనుకుంటా!

అలాకాకుండా వుంటే బాగుండును అనీ అనుకుంటా!

ధన్యవాదాలు.

చిలమకూరు విజయమోహన్ said...

ఎన్ని తప్పులు చేసినా చట్టాన్ని,న్యాయాన్ని చుట్టాలుగా చేసుకుని బయటకు వచ్చి వాళ్ళు అనే మాటనే నేను చెప్పింది.

A K Sastry said...

డియర్ చిలమకూరు విజయమోహన్!

దాసరి నారాయణరావులా, 'చట్టం వేరు, న్యాయం వేరు--చట్టం న్యాయం కాదు, న్యాయం చట్టం కాదు--చట్టం చట్టమే, న్యాయం న్యాయమే--' అంటూ డైలాగులు చెప్పను--మీ కవిహృదయం అర్థం అయ్యింది కాబట్టి.

ధన్యవాదాలు మరోసారి!