Monday, September 7

స్మారక......


దోపిడి రాజకీయం


మాజీ ముఖ్యమంత్రి మరణం తరవాత, మొదటి మంత్రివర్గ సమావేశం లో తీసుకొన్న ముఖ్య నిర్ణయాల్లో ఒక అతి ముఖ్యమైనది--వై యెస్ హెలికాప్టరు 'కూలిన చోట ' ఒక బ్రహ్మాండమైన 'స్మారక చిహ్నాన్ని ' నిర్మించి, ప్రతి రోజూ ప్రజల సందర్శనకి యేర్పాట్లు చెయ్యలి--అనిట!  


ఇంకేం! కొన్ని వందల కోట్ల అంచనాలూ, కాంట్రాక్టులూ, అంచనా వ్యయాలు మించడాలూ, మళ్ళీ కొన్ని వేల కోట్ల అంచనాలూ, ఓ పది పదిహేనేళ్ళు గుత్తదారుల, ఉప గుత్తదారుల, ఉప-ఉప గుత్తదారుల, వాళ్ళక్రింద వేలాదిమందీ--పంట పండినట్లే!  


మరి, 15 కిలోమీటర్లు కాలినడకన, దారి తెలియకుండా (జీ పీ యెస్ వున్నా) తప్పిపోయే అవకాశం వున్న దారి తెలియని దారుల్లో నడిచి, అక్కడకి చేరుకోవాలే? 


అక్కడున్న చెంచులూ వగైరాలకీ, అస్తమానూ అక్కడ తిరిగే మావోయిష్టులకీ కూడా సాధ్యం కాని చోటుకి, ప్రతిరోజూ ప్రజల సందర్శనానికి యెలా యేర్పాట్లు చేస్తారో?  


బహుశా, 'బెల్ 430' హెలికాప్టర్లలో వేలాది రూపాయల టిక్కెట్లు కొనుక్కొని, రాత్రి పూట మాత్రమే--లేదా తెల్లవారుజామునగానీ, సాయంత్రం పూటగానీ మాత్రమే (మధ్యాన్నం దాన్ని మూసేసి)--సందర్శించే యేర్పాట్లు చేస్తారేమో!  


జగన్ ముఖ్యమంత్రి సంగతేమోగానీ, ఓ నా కార్యకర్తల్లారా! ఆ డబ్బుతో యెంతమందికి 'ఆరోగ్య శ్రీ' పడుతుందో ఆలోచించండి!  


ఇలాంటివాటికి వ్యతిరేకంగా నిరాహారదీక్షలూ, ధర్నాలూ, ర్యాలీలూ చెయ్యండి!  


లేదూ--అలాగే కానివ్వండి!  

11 comments:

Unknown said...

What u said 100% true.

A K Sastry said...

డియర్ స్నేహితుడు!

మరింకేం? చెప్పండి అందరికీ!

ధన్యవాదాలు!

పునర్వసు said...

nice post sir.

చింతా రామ కృష్ణా రావు. said...

డియర్ కృష్ణశ్రీ! మీరు చెప్పినది అక్షర సత్యం.

Ruth said...

Hi, sorry for diviating from your topic, but I think we should not mention a CM who died while holding office as EX (maagi). we should mention as Late CM (in telugu, divangata mukhya mantri).
I hear people mentioning him as "maagi" even in big news channels etc..
My apologies in advance if I am wrong.

A K Sastry said...

డియర్ Ruth!

మీరన్నది కొంతవరకు సరియైనదే!

కాని, సామాన్యంగా ఇంకో ముఖ్యమంత్రిని యెన్నుకొనే/నియమించే వరకూ--అంటే ఆయన పదవిలో వున్నట్టే లెఖ్ఖ అయినప్పుడు, 'దివంగత ' అని వాడతారు.

ఇక మిగిలినవాళ్ళెవరినైనా, ప్రధాని, రాష్ట్రపతి--ఇలాంటి పదవీనామాలతో వ్యవహరించేటప్పుడు 'మాజీ' అనే అంటారు.

దివంగత ప్రధాని నెహ్రూ, దివంగత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్--అనం కదా?

ధన్యవాదాలు!

Anonymous said...

అక్కడికి రోడ్లు వేయింస్తారు ఏలినవారు, అక్కడో గుడికట్టిస్తారు ప్రభ్వులవారు :( అక్కడికి వెళ్ళినవారికి అకామిడేషన్ గెస్టుహౌసులు కట్టిస్తారు సర్కారువారు (పనిలో పనిగా సర్కారు కోసం ప్రైవేటు ప్రభుత్వ గెస్టుహౌసులు కట్టిస్తారు)
ఇకనేం అదో టూరిస్టు స్పాటొ క్షేత్రమో అవుతుంది పనిలో పనిగా కమర్షియల్ కాంప్లెక్సులూ హోటల్లూ, అక్కడికెళ్ళేవారి వినోదం కోసం ఇతరత్రా సౌకర్యాలు.... ప్రజలసొమ్మేగా పోతే పోనీ.

Anonymous said...

అసలే భూమి ప్రియం, అక్కడంత డిమాండ్ వుంటే మన నాయకులు తలాకాస్త అడవి కబ్జాచేసి రియల్ ఎస్టేట్ మొదలెడతారు.
వైఎస్ చావుకి కారణమైన నల్లమల అడవుల అంతు చూస్తారు .

A K Sastry said...

డియర్ పునర్వసు!

మీలాంటివాళ్ళకి నేను వ్రాసింది నచ్చడం నాకు చాలా సంతోషం!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ చింతారామకృష్ణారావు!

మీలాంటి అనుభవఙ్ఞులకి నేను వ్రాసింది నచ్చడం నాకు చాలా సంతోషం!

మరి మీ సందేశాన్ని (మీ టపాలో) వ్రాయరూ?

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ !

ఇవన్నీ సాధ్యమేనంటారా?

50 మంది పనివాళ్ళు ఒక ఇంటిని 100 రోజుల్లో కట్టగలిగితే, అదే ఇంటిని 500 మంది పనివాళ్ళు యెన్నిరోజుల్లో కట్టగలరు? 5000 మంది యెన్ని రోజుల్లో కట్టగలరు?

అది సాధ్యమైతేనే, ఇది సాధ్యం! వొప్పుకుంటారా?

ధన్యవాదాలు!