Thursday, July 2

'కొవ్వు ' ప్రతినిథులు

‘మంద’……నాధం!
ఓ గ్రామీణ బ్యాంకు మేనేజరుని మంద జగన్నాథం ‘మ్యాన్ హ్యాండిల్’ చెయ్యడం ‘దృశ్య మీడియా’ చక్కగా చూపించింది!

ఓకటి రెండు ఛానెళ్ళయితే, వాడు అటోసారీ, ఇటోసారీ విసిరిన చెయ్యిని, కనీసం పదహారు సార్లు ‘రిపీట్’ షాట్స్ చూపించి, సామాన్యులు ‘ఆ! అన్నిసార్లు కొట్టేశాడా! సచ్చినోడు!’ అనుకునేలా చూపించాయి!

ఆ బ్యాంకు మేనేజరు పాపం ఇంకా చాలా ‘భవిష్యత్తు’ వున్నవాడనుకొంటా! అందుకే, కాం గా వుండిపోయాడు!

మిగిలిన బ్యాంకు వుద్యోగులందరూ కట్టు కట్టి మంద చేత క్షమాపణ చెప్పించ వలసి వచ్చింది! (అది కూడా యెలా చెప్పాడు? ‘…..బాధ కలిగిస్తే, బహిరంగం గా……..అన్నట్టు!’ అని, తన నరం లేని నాలుకని వెయ్యి మెలికలు తిప్పి! దానికే బ్యాంకు ‘యూనియన్’ల ప్రతినిధులు ‘సంతోషం’ వ్యక్తం చేశారు!)

నేనే ఆ బ్యాంకు మేనేజరునైతే, వాడు నా దగ్గరకి వచ్చి, ఫలానా వాడికి లోన్ ఇంకా యెందుకు ఇవ్వలేదు?’ అని అడగ్గానే, ‘సార్! నేను మీకు బహిరంగ క్షమాపణ చెప్పాలి—మీడియా కూడా వున్నారు కదా, ప్లీజ్! బయటికి పదండి—చెపుతాను!’ అని బయటికి తీసుకెళ్ళి, ‘కెమేరా వైపు తిరగండి సార్’ అని వాడి వెనక్కాల కొంచెం దూరంగా నించొని, లాగి నడ్డి మీద తన్నేవాణ్ణి!

వాడు లుంగలు చుట్టుకు పడిపోగానే, మీడియా మైక్ లలో “నీ బ్రతుకేమిటిరా? అవిశ్వాస తీర్మానానికి వోటు వేసినీందుకు యెన్ని కోట్లు తిన్నావు? వీడికి రికమెండ్ చేసినందుకు యెంత తిన్నావు? నువ్వా నన్ను అడిగేది?” అని అరిచేవాణ్ణీ!

తరవాత సంగతి తరవాత!

(అలాంటి హీరో యెవరైనా వుంటే, వాడిని ఆహ్వానించండి—లేదా, నా దగ్గరకు వాణ్ణి పంపించండి)


9 comments:

చదువరి said...

మాస్టారూ, చప్పట్లు!

చిలమకూరు విజయమోహన్ said...

అలాంటి హీరోల్లేకనే వీళ్ళ దాష్టీకాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి.

Uyyaala said...

>>>>ఓకటి రెండు ఛానెళ్ళయితే, వాడు అటోసారీ, ఇటోసారీ విసిరిన చెయ్యిని, కనీసం పదహారు సార్లు ‘రిపీట్’ షాట్స్ చూపించి, సామాన్యులు ‘ఆ! అన్నిసార్లు కొట్టేశాడా! సచ్చినోడు!’ అనుకునేలా చూపించాయి! <<<<<<<

ఇంతగా చూపించినా మన సమాజం లో రావలసినంత స్పందన రావడం లేదు కదా.
మనలోని బాధని, ఆవేదనని, కసిని ఏదో ఇట్లా బ్లాగుల్లో రాసి, కామెంటి, చదివి చల్లార్చు కుం టున్నామే తప్ప మనమూ ఎం చేస్తున్నాం గనక.

టీవీ చానళ్ళు అట్లా చేస్తూ పోతుంటే నైనా చైతన్యం రగులు కుంటుంది అనిపిస్తోంది
ఏమైనా మీ పోస్ట్ చాలా బాగుంది.

సుజాత వేల్పూరి said...
This comment has been removed by the author.
సుజాత వేల్పూరి said...

విద్యాధికుడైన ఒక బాంక్ మేనేజర్ ని చొక్కా పట్టుకుని చెయ్యి చేసుకున్నాడంటే అతగాడి లిపిడ్ ప్రొఫైల్ ని డయాగ్నైజ్ చేయాలంటే సాధ్యమేనా? ఏ రేంజ్ లో ఉంటుందంటారు! అతని కొవ్వు సంగతేమో గానీ నాకు బీపీ రైజ్ అయిపోయి రక్తం మరిగిపోయింది ఆ దృశ్యం చూసి.మరి డి శ్రీనివాస్ గారేమో "అది పార్టీ అంతర్గత వ్యవహార"మంటున్నారు. పబ్లిక్ లో ఒక అధికారిని కొడితే పార్టీ అంతర్గత వ్యవహారంగా భావించడం కాంగ్రెస్ చమత్కారమన్నమాట.

సూపర్బ్! మీరు ఆ బాంక్ మేనేజరైనట్లు ఊహించుకుని సంతోషపడి సరిపెట్టుకుంటున్నాను సర్!

I deleted my earlier comment because of typos.

T V Phanindhar said...

don't worry sir...he will be punished soon..

Kathi Mahesh Kumar said...

MP చేసింది దారుణం. అమానవీయం. చట్టవిరుద్ధం. తక్షణం పార్టీనుంచీ బర్తరఫ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందే. కానీ ప్రభుత్వం మాత్రం....

చైతన్య.ఎస్ said...

సూపర్ సార్ :)

ఒక్క సారి ఆ బ్యాంక్ మేనేజర్ 'మందా'ని తన్నినట్లు ఉహించుకుంటే(కోట-బాబుమోహన్) కేకో కేక:)

A K Sastry said...

డియర్ చదువరులూ!

నిజంగా మీరందరూ ఇచ్చిన కామెంట్ లకి నా మనసు పులకించింది!

‘యేమీ చెయ్యలేక పోతున్నాము’ అనుకోకుండా, కొంతైనా, యేరూపం లో అయినా ప్రయత్నిస్తే, మార్పు సాధ్యపడుతుందనే నా నమ్మకం!

కనీసం ఈ రోజు, బ్లాగుల పుణ్యమా అని, మన బాధనీ, ఇతర ఫీలింగ్స్ నీ స్వేచ్చగా ప్రకటించగలుగుతున్నాము కదా?

మీ అందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు!