Wednesday, April 15

ఫ్యాషన్

ఫ్యాషన్

సరిగ్గా నలభై యేళ్ళ క్రితం, మేం పీయూసీ లో వుండగా, మా బిజినెస్ ఆర్గనైజేషన్ ఉపన్యాసకులు చెప్పిన జోక్ ఇది!

(ఆ మహానుభావుడికి అప్పట్లో ఓ 35 యేళ్ళు వుండి వుంటాయి. నీటుగా టక్ చేసుకొని వచ్చి, కుర్చీలో కదలకుండా కూర్చొని, ఉపన్యాసం ఇచ్చేవారు! మేము ఈ మాత్రం వాణిజ్యం గురించి నేర్చుకున్నామంటే, అది ఆయన భిక్షే! నేను చెయ్యెత్తి నమస్కరించేవారిలో ఆయనొకడు. ఆ తరవాత కాలేజ్ ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇంతకీ ఆయన ఆ సంవత్సరంపాటూ మాకు చెప్పింది—సోల్ ట్రేడర్, పార్ట్ నర్ షిప్, జాయింట్ స్టాక్ కంపెనీలగురించి మాత్రమే!)

ఇక జోక్!

ఒక యువకుడు పారిస్ నగర వీధుల్లో, చంకలో ఓ ప్యాకెట్ పెట్టుకొని వేగం గా పరుగెడుతున్నాడట.

అంతలో ఓ స్నేహితుడు కనిపించి అడిగాడట “యెందుకలా కొంపలు మునిగిపోయినట్టు పరిగెడుతున్నావు?” అని.

పరుగు ఆపకుండానే జవాబిచ్చాడట ఆ యువకుడు—“మా ఆవిడ లేటెస్ట్ ఫేషన్ గౌను తెమ్మంది—పట్టుకెళ్తున్నాను—ఇంటికి చేరేలోగా మళ్ళీ ఫేషన్ మారి పోతే, మళ్ళీ ‘లేటెస్ట్’ ఫేషన్ తెమ్మంటుంది—అందుకే ఫేషన్ మారేలోగా ఇల్లు చేరాలి” అని వగర్చుకుంటూ పరుగు సాగించాడట!

అదీ జోకు!

మరి ఇప్పుడో?

ఈ నాటికికూడా ఫేషన్ రాజధాని పారిస్ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు కదా?

2 comments:

Bhãskar Rãmarãju said...

ఆరోజుల్లోనే మీ గురువుగారు ఇలాంటి జోకు చెప్పారు అంటే ఆయన మహా మేధావి.

A K Sastry said...

డియర్ భాస్కర్ రామరాజూ!

మీరన్నది కొంత నిజం. యెందుకంటే, ఆయన నిజంగా మేథావే!

ఇక జోకు సంగతి....ఆయనా యెక్కడో చదివిందే!

అందుకే 'కొంత ' నిజం అన్నాను!

ధన్యవాదాలు!