Monday, April 27

తమిళపులి

దెబ్బతిన్న బెబ్బులి?

శ్రీలంక లో తమిళపులి ‘వేలుపిళ్ళై పిరభాకరన్ ‘ పట్టుబడడానికి సమయం దగ్గరకొచ్చిందంటున్నారు!

శాంతికాముకులకీ, తీవ్రవాద వ్యతిరేకులకీ చాలా సంతోషం గా వుంటుంది!
మన దేశం లో తమిళ రాజకీయులకి చాలా బాధగా వుంటోది!

మరి పిరభాకరన్ యెందుకు దెబ్బ తిన్నాడు?

ఒకటే సమాధానం—యే దేశమైనా తన సార్వభౌమత్వానికి సవాలు యెదురైతే, సహించలేదు, సహించ కూడదు!

భౌగోళికం గా, చారిత్రకం గా ఒక దేశం లో వుంటూ, సాంస్కృతిక కారణాలవల్లొ, మత సంబంధమైన కారణాలవల్లొ, వేరే దేశం గా విడిపోతామంటే అది విపరీతం! పైగా దానికి యెంచుకున్న పద్ధతి మరీ ముఖ్యం!

తెల్లవాడి ‘విభజించి పాలించు’ జిత్తులకి తలొగ్గకుండా, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యానికి తొందరపడకుండా వుంటే, ‘రెండు డొమీనియన్లు’ కి అంగీకరించకుండా వుంటే, మన పక్కలో బల్లెం—పాకిస్థాన్ తో మనకీ పాట్లు వుండేవి కాదు!

1948 లో పాక్ ని నియంత్రించడానికి జనరల్ కరియప్పకి అవకాశమిచ్చి వుంటే, కాంగ్రెస్ అతి నమ్మకంతో ఐక్యరాజ్య సమితికి పోకుండా వుంటే, మన కాశ్మీర్ సమస్యే వుండేదికాదు!

తరవాత, 1965, 1971 యుద్ధాల గురించీ, ప్రభుత్వం నిర్వాకం గురించీ ముందే మాట్లాడుకున్నాం!

భుట్టో మన దేశం మీద ‘వెయ్యేళ్ళ పవిత్ర యుద్ధం’ ప్రకటించడానికి కూడా ఈ సూత్రమే కారణం!

ఇక పద్ధతులకి వస్తే, తమిళ పులి యెంచుకున్నది—సాయుధ పోరాటం! అదీ ముక్కుపచ్చలారని పిల్లలతో! ఇంకా తీవ్రవాదాన్ని నమ్ముకోవడం!

రాజకీయం కోసం అప్పటిదాకా ‘ఈళం’ కి మద్దతు ఇచ్చిన రాజీవ్, మధ్యలో తెడ్డు జాపినట్టు ‘ఐ పీ కే ఎఫ్’ పేరుతో జొరబడి, చివరకి హత్య చెయ్యబడ్డాడు!

ఇక వాళ్ళ ప్రధాన మంత్రుల్నీ వదల్లేదు వాళ్ళు! హత్యలూ, హత్యా ప్రయత్నాలూ సాగించారు!

వాళ్ళ ప్రభుత్వం యెన్ని సార్లు చర్చలకోసం చెయ్యి సాచినా, యేదో వంకతో దాన్ని తిరస్కరించడం, కాల్పుల విరమణని పాటించకపోవడం లాంటివి కోకొల్లలు!

చివరికి ‘అల్టిమేట్ డెస్టినీ’ కి చేరక తప్పదు కదా?

ఇది ప్రతీ ఉద్యమానికీ, ఉద్యమ నాయకునికీ, ప్రభుత్వాలకీ, విద్రోహులకీ ఓ గుణపాఠం కావాలి!

అయితే బాగుండును!

పీ ఎస్ :- ఇప్పుడే అందిన వార్త--కరుణానిధి చిదంబరం మీదా, చిదంబరం మన్మోహన్ సింగ్ మీదా, మన్మోహన్ సోనియా మీదా, సోనియా భారత ప్రభుత్వం మీదా తెచ్చిన వత్తిడి ఫలితంగా, భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం మీద తెచ్చిన వత్తిడి ఫలించి, ఆ ప్రభుత్వం 'కాల్పుల విరమణ ' ప్రకటించిందట!

కరుణ తన 'నిరాహార దీక్ష ' విరమించారట!

2 comments:

నాగన్న said...

పిరభాకరన్ పోయి, తీవ్రవాదం అనేది తగ్గితే తమిళ ప్రజలు బాగుపడతారని శ్రీలంక ప్రభుత్వం, రాజకీయంగా నష్టపోతాం అని టీ.ఎన్ రాచకీయ యంత్రాంగం ఒకేసారి తెలుసుకున్నట్లుంది...

ఇక తెరవెనక జరిగింది ఏమిటో...

Krishna Sree said...

డియర్ నాగన్న!

తెరవెనుక జరిగింది--మన్మోహన్ ప్రభుత్వం శ్రీలంకతో 'మీరు వెంటనే మేము చెప్పినట్టు చెప్పకపోతే, మా రాయబారిని వెనక్కి పిలిపించేసుకుంటాము.' అని బెదిరించింది!

దౌత్య వ్యవహారాల్లో ఇది ఆ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకోవడంతో సమానం! అంతర్జాతీయం గా ఆ దేశానికి అవమానకరం!

అందుకని, శ్రీ లంక తలవొగ్గింది. కానీ వెంటనే 'ఇది కాల్పుల విరమణ కాదు--తమిళ శరణార్ధులు ఆ ప్రాంతం నించి బయటికి తరలివచ్చేవరకూ విమానదాడులు మాత్రం ఆపేశాం.' అని చెప్పింది.

ఈ లోపల కాగల కార్యం గంధర్వులే తీర్చి, కఋణానిథి దీక్ష విరమించేశాడు!

అదీ జరిగింది!