Friday, February 18

సమూల నాశనానికి



శ్రీకారం చుట్టుకొన్నారా?

అజాత శత్రువు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మీద లాఠీ దెబ్బలు పడ్డాయి....ఇందిరా గాంధీ మళ్లీ అధికారం లోకి రావడానికి, బురదల్లో యేనుగు మీద "బెల్చి" కి యాత్ర చెయ్యవలసి వచ్చింది.

ఇప్పుడు మరో జే పీ 'తల మీద ' దెబ్బలు పడ్డాయి. మరి చాణక్యుడు నందవంశ నిర్మూలనానికి శపథం చేసినట్టు, ఈయన "ప్రత్యేక తెలంగాణా అంశాన్ని భూస్థాపితం చేసేవరకూ, కే సీ ఆర్ పార్టీని సమూలంగా నాశనం చేసేవరకూ, నా జుట్టు కత్తిరించుకోను" అని యేమైనా భీషణ ప్రతిఙ్ఞ చేస్తాడా?

ఇప్పటికైతే చెయ్యలేదు. ముందు సంగతి చూద్దాం!

10 comments:

శివాజీ said...

బెల్చి అంటే ఏంటి మాస్టారు? ఎక్కడుంది? ఏంటా కధ?

Anonymous said...

JP = Panikirani Chetha

Anonymous said...

aa JP alaa pratigna cheyyagaane,

ikkada tapa tapaa support

tapaalu padipogalavu

Anonymous said...

JP - a new hope of politics in AP/India.

KrishnaSree, you are utterly wrong that JP would avenge this. He is m with will, not a street goon like TRS, Jagan nor crooked like CBN better not to compre with Congress/Chiru.

A K Sastry said...

డియర్ శివాజీ!

బెల్చి అనేది మన దేశం లోని ఓ కుగ్రామం. అదెక్కడుందో ఇప్పుడు నాకు ఇదమిథ్థంగా గుర్తులేదు గానీ, బీహార్లోనో, యూపీలోనో, ఎం పీ లోనో వుండేదనుకుంటా. ఇప్పుడు ఛత్తీస్ గడ్ లోనో, వుత్తరాంచల్ లోనో వుండొచ్చు అనుకుంటా.

ఇక, ఆరోజుల్లో, ఆవూళ్లో, ఓ దళిత స్త్రీమీదో, కుటుంబం మీదో, అత్యాచారమో, హింసో జరిగింది--అగ్రకులాల చేతుల్లో!

దాంతో, తాను ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిందే అని నిశ్చయించుకున్న ఇందిరాగాంధీ, ప్రతిపక్ష నేతగా అక్కడికి అఘమేఘాలమీద, అన్ని రకాల వాహనాలనీ వుపయోగించి, ఆ వూరికి ఓ 10 కి మీ దూరంలో ఆగిపోవలసి వచ్చిందట. అది వర్షాకాలం కూడా కావడంతో, చెప్పులు చేత్తో పట్టుకొని నడిచి వెళ్లే వీలు కూడా లేకుండా అడుగులోతు బురదతో నిండివుందట ఆ మార్గం. అధికారులు తలలు పట్టుక్కూర్చొంటే, ఓ గిరిజనుడు సలహా ఇచ్చాడట--యేనుగుమీదైతే వెళ్లిపోవచ్చు అని. వెంటనే ఓ యేనుగుని రప్పించి, మావటివాడితో, ఆవిడని యేనుగుమీద యెక్కించి, ఇంకో ఇద్దరు మావటివాళ్లతో ఆ వూరికి పంపించారట.

ఆవిడ వాళ్లని తీరిగ్గా పరామర్శించి, మళ్లీ అవే వాహనాలపై గూటికి చేరిందట.

మరి, ఈ విషయం మీడియా వాళ్లకెలా తెలిసింది? ఫోటోలు యెవరు, యెలా తీశారు? ఆవిడ వొక్కత్తీ 10 కి మీ ప్రయాణించిందా? లాంటి ప్రశ్నలు అడగొద్దు.

జనతావాళ్లు ఇదంతా పబ్లిసిటీ స్టంటు అని తీసిపారేస్తే, కాంగీ నేతల దృష్టిలోనూ, ఆ పార్టీకే వోటువేసే వాళ్ల దృష్టిలోనూ, ఆవిడ ఓ మహోన్నత వ్యక్తిగా యెదిగి పోయింది.

త్వరలోనే మళ్లీ అధికారం హస్తగతం చేసుకొంది!

అదీ కథ.

ధన్యవాదాలు.

A K Sastry said...

పై మొదటి అన్నోన్!

మీ అభిప్రాయం మీది.

A K Sastry said...

పై రెండో అన్నోన్!

టపాలు పడిపోగలవంటారా? "పడి" పోగలవంటారా?

A K Sastry said...

డియర్ Snkr!

"ఎం విత్ విల్"; లాంటివి నాకర్థం కాలేదు. సీబీఎన్ అంటే న్యూస్ ఛనెల్ వాళ్లా?

ఆయన తన "సత్యాగ్రహాన్ని" ప్రకటించడంటారా?

గాంధీ రైల్లోంచి గెంటివేయబడ్డప్పుడు ఆయనకి సత్యాగ్రహం రాకపోతే, మనకి స్వాతంత్ర్యమే వచ్చేది కాదు కదా?

సరే. మరి జేపీ వుద్దేశ్యమేమిటో చూద్దాం.

ధన్యవాదాలు.

Anonymous said...

ఏదో ఎగిరి పోయినట్లుందండి. మాన్ విత్ విల్(పవర్) అనుకుంటా.

సి.బి.ఎన్ అంటే మన హైటెక్-నార గారే సందేహం లేదు. :)

A K Sastry said...

డియర్ Snkr!

ఆసక్తిగా నా టపాలు చదివి వ్యాఖ్యానిస్తున్నందుకు చాలా సంతోషం.

ధన్యవాదాలు.