Wednesday, January 5

మన ఆచారాలు - 5 మీద....2.

వ్యాఖ్యాతలకి....

నా ఇంతకు ముందు 5 టపాలనీ, తరవాతి టపాలనీ కూడా శ్రధ్ధగా చదవండి.....నేనెక్కడైనా 'సుష్టు భోజనాల గురించి' వ్రాశానా?

'.....వదలండి' అన్నది యెవరు? శరత్ దాన్ని అపాన వాయువు అన్నాడంటే అది అతని తప్పా? 

ఇంక ఆ వెధవలకి యెప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూనే వున్నాను. యెవరూ మాట్లాడలేదు......మళ్లీ!

మన పంచ ప్రాణాలూ.....పంచ వాయువుల్లో వున్నాయి.....అవి 'ప్రాణ....' వగైరాలు. ఇవి చెట్లనించీ, మనుషులనించీ, జంతువులనించీ, నీళ్లనించీ, రాళ్లూ--నేల నించీ వ్యుత్పత్తి అవుతాయి. 

పల్లెల్లో, ఓపెన్ లెట్రిన్ల నించి ఈ అపానవాయువులు మిగిలిన అన్నివాయువులతో గాలిలో కలిసేవి. ఇప్పుడు అవి లేవు.....ఫలితం.....రకరకాల రోగాలు! 

రాజేష్ జి(ల)గాడి మద్దతుదారు అన్నోన్ వ్రాస్తాడూ...."Andhra పిత్తు (Fart), అపానవాయువు (Fart) శ్రధ్ధు (Fart). Additional references: Amdhra, India, Fart." అని!

ఒరే వెధవా! ఇంటర్నెట్లో సెర్చ్ చెయ్యడం కాదు....అసలు విషయం తెలుసుకో!

'ఆంధ్ర' అంటే, మన భూమి. నువ్వు కెలికింది 'ఆంత్ర'ము . అంటే మన పేగుల్లోనూ అక్కడా వుండేది.

మన ప్రాచీన నాడీనిదానంలో వైద్యుడు తన కుడిచేతి మూడు వేళ్లతో, రోగి చేతి మణికట్టుకి కొంచెం పైన నాడి పట్టుకోడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ వైద్యుడి వుంగరం వేలుకి నాడి బలంగా తగిలితే, 'వాతం'; మధ్యవేలికి తగిలితే, 'పిత్తం'; చూపుడువేలికి తగిలితే, 'శ్లేష్మం' అనేవారు. అంటే వరుసగా--'చలవ చేసింది'; 'వేడి చేసింది'; 'రెండూ కలిసి, వూపిరితిత్తుల్లో ఖఫం చేరింది' అని! (పిత్తం యెక్కువైతే, పైత్యం అనేవారు! మిస్సమ్మ సినిమాలో అల్లు రామలింగయ్య అలాంటి వైద్యుడు...వాతం ఒక పాలు, పైత్యం రెండుపాళ్లు...అంటూ)

(ఇంకా ఈ వైద్యం గురించి, ఫణిబాబుగారు వ్రాసిన 'అగ్నితుండి మాత్రలూ' వగైరాల గురించీ, యెవరైనా అడిగితే ఓ టపా వ్రాస్తాను)

ఇంకోడంటాడూ.....'తన ఙ్ఞాపకాలని గుర్తు చేసుకొంటున్నాడు.... వదిలెయ్యండి....'అని. అంతేగానీ....నేను వ్రాస్తున్నవి పచ్చి నిజాలనీ, మూర్ఖులకి కనువిప్పులనీ వొప్పుకోరు!

'వెధవలూ, పందులూ' అంటూ తిట్టుకున్నారు తప్ప, 'అసలు విషయం' మీద 'ఱొమ్ము విరుచుకుని' నన్నెదుర్కున్న వెధవగానీ, పంది గానీ లేడు.....గమనించండి!


విఙ్ఞులు క్షమించాలి. చిన్న.....కాదు....పెద్ద పొరపాటే! పై వాక్యం వ్రాశాక మళ్లీ దాని వంక చూడకుండా ప్రచురించేశాను. మిత్రులు చెప్పిన తరవాత, రెండు మూడు సార్లు చదివితే, అవును నిజమే కదా.....'యెదుర్కున్న.....' (అందరూ....) అనే అర్థం వస్తుంది కదా? అని.

దాన్ని--'....నన్నెదుర్కున్న మనిషెవడూ లేడు......' అని సవరిస్తున్నా.

మరోసారి క్షమాపణలతో....

......ఇక వన భోజనాల ముగింపే తరవాయి.

2 comments:

Anonymous said...

మన ప్రాచీన నాడీనిదానంలో వైద్యుడు తన కుడిచేతి మూడు వేళ్లతో, రోగి చేతి మణికట్టుకి కొంచెం పైన నాడి పట్టుకోడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ వైద్యుడి వుంగరం వేలుకి నాడి బలంగా తగిలితే, 'వాతం'; మధ్యవేలికి తగిలితే, 'పిత్తం'; చూపుడువేలికి తగిలితే, 'శ్లేష్మం' అనేవారు. అంటే వరుసగా--'చలవ చేసింది'; 'వేడి చేసింది'; 'రెండూ కలిసి, వూపిరితిత్తుల్లో ఖఫం చేరింది' అని! (పిత్తం యెక్కువైతే, పైత్యం అనేవారు).

krishna Sri Garu,

You are providing good information. Please keep it up. Some people want to show their ignorance in the blog world. The best medicine for them is ignoring them.

A K Sastry said...

1st Commentor!

I have many more pearls (పాఠక దేవుళ్లకి అర్పించడానికీ) to throw before such........!

Thanks.