స్వవిషయం
ఈ మధ్య టపాలు వ్రాయడం లేదు.
కారణం....సమయం దొరకకపోవడమే! అంత యేమి పాటుపడిపోతున్నారు.....అనెయ్యకండి.
దీపావళికి బెంగుళూరు నించి మా అబ్బాయీ, కోడలూ మనవణ్ణి తీసుకొని వచ్చారు 20 రోజులు పైగా సెలవు పెట్టుకొని. ఇంక నిజం గా బయటి ప్రపంచం తెలియలేదు.
రాత్రి 8 అయ్యేసరికల్లా, అమెరికానించి మా మనవలు (అమ్మాయి కొడుకులు) ఇద్దరూ వెబ్ కేమ్ లో వాళ్ల విద్యా ప్రదర్శనలూ, మమ్మల్నందరినీ ఇంటర్వ్యూలు.
దీపావళి తరవాత నవమి నాడు మా తండ్రిగారి ఆబ్దీకం--మా అన్నదమ్ములూ, చెల్లెళ్లూ, వాళ్ల పిల్లలూ, మనవడూ, మనవరాలూ అందరూ వచ్చారు--మా చిన్నతమ్ముడూ, మరదలూ, వాడి ఇద్దరుకొడుకులూ తప్ప.
మొన్న 22న మా మనవడి మూడో పుట్టిన రోజు (రెండు నిండాయి). అదో హడావిడి.
ఇక, మా బ్యాంకు నించి నాకు రావలసిన దాదాపు పాతిక లక్షలని ఇవ్వకుండా, వేలికీ కాలికీ వేస్తూ, జాప్యం చేస్తున్న బుర్రోవాదులూ! ఇప్పటికి వాళ్ల బుర్రలు వుపయోగించి, నా సొమ్ము నాకు ఇవ్వడం ప్రారంభించారు విడతలుగా!
వీటన్నింటి మధ్యా ఇంక సమయం యెక్కడ! మెయిల్స్ చెక్ చేసుకోడానికి కూడా సమయం లేదు.
కంప్యూటర్ ఆన్ చెయ్యగానే, మా మనవడు వొళ్లో చేరి, వరసగా బా బా బ్లాక్ షీప్ నుంచీ, చందమామ చందమామ నుంచీ, ఆటల దగ్గరనుంచీ, వాడిష్టం వచ్చినట్టు అన్నీ నొక్కేసి, "క్లోజ్", "షట్ దౌం" అనేవరకూ! ఇంకెక్కడి ఇంటర్నెట్!
ఇదిగో, ఇప్పటికి మళ్లీ మేమిద్దరూ మిగిలాం లంకంత కొంపలో!
మళ్లీ మొదలెట్టాను--మిమ్మల్ని సుత్తితో బాదడం.
రడీయేనా?
2 comments:
అందరూ ఒక్కసారి ఏటోళ్ళు అటు వెళ్ళేసరికి, మీరు బోరు కొడుతుండాలే?
డియర్ పానీపూరీ123!
'నాకు' బోరుకొట్టకుండానే ఈ కాలక్షేపం!
'నేను' బోరుకొడుతున్నానా అని చెప్పవలసింది 'మీరు'!
జవాబు ఆలస్యం అయ్యింది. క్షంతవ్యుణ్ని!
Post a Comment