Friday, December 18

"ప్రధాన మం..."



రాజకీయ మోసం


"'.....పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో వున్నాయనుకుని, తెలంగాణా ప్రకటన చేశా'మని, 'ఒక మాట చెప్పి, మరోపని చేస్తారని 'తమకు' తెలియలేదని' " ప్రధాని మన్మోహన్ సింగ్--తనతో 'ఆవేదన' వ్యక్తం చేశారని--లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ్ అన్నారట!  


ఇంకా, ".....పార్టీలు బాధ్యతతో, నిజాయితీగా అభిప్రాయాలు వెల్లడించాలని, 'భారత ప్రభుత్వానికి' మాటిచ్చే ముందు 'ఆచి తూచి' వ్యవహరించాలని, ప్రజల జీవితాలతో ఆడుకోవడం ప్రమాదకరమని" ఆయన అన్నట్టు కూడా జేపీ తెలిపారట!  


కాసేపు ఈ మాటలన్నీ నిజం అనుకుందాం!  


యెంతటి అక్షర సత్యాలవి!  


(రాజకీయానికి కొత్త అయిన రాజీవ్ గాంధీ, వోట్ల కోసం రామ జన్మ భూమి లో 'శిలాన్యాస్' చేయించారు!)  


యే రాజకీయం తెలియని మన్మోహన్ సింగే ఇలా అంటే, రాజకీయ ధురంధరుడు, అపర చాణక్యుడు, మహా పండితుడు, బహుభాషా కోవిదుడు, మన తెలుగు తేజం పీ వీ నరసిం హా రావు--"ఆ రోజుల్లో" యెంతటి మానసిక హింస అనుభవించాడో వూహించగలమా?  


ఆయనకి రాజకీయ పార్టీల సంగతీ, ముఖ్యం గా బీజేపీ సంగతీ, కల్యాణ్ సింగ్ గురించీ, చాలా బాగా తెలుసు--కానీ, ఆయన చేస్తున్న వుద్యోగం--పార్టీలని తిట్టడమో, దేబిరించడమో కాదు! ప్రధాన మంత్రిత్వం!  


పైగా, భారతదేశం లోని 'బ్యూరాక్రసీ' నియమాలకి కట్టుబడి వున్నవాడు! 


అందుకే 'భారత ప్రభుత్వానికి' బీజేపీ నుంచీ, రాష్ట్రప్రభుత్వం--కల్యాణ్ సింగ్ ప్రభుత్వం--దగ్గరనించీ, ప్రతీ క్షణం నివేదికల్ని--మౌఖికం గా, లిఖిత పూర్వకం గా--అందుకొంటూ, ప్రతీ క్షణం యేమి జరిగిందో దస్త్రాల్లో నిక్షిప్తం చేశారు! (కావాలంటే ఆయన స్వయం గా వ్రాసిన పుస్తకం చదవండి!)  


బై ది బై, మన 'లిబర్హాన్ కమిషన్' పీవీని యేవిధం గానూ తప్పు పట్టలేదు కదా--ఇప్పుడు 'అధిష్టానం'--ఇంతకాలం-- వోట్లకోసం, వోట్ బ్యాంకుల కోసం, అంటరానివాడిగా చూసిన పీవీ కి ఈ రోజు సరైన న్యాయం చేస్తుందా? అంత దమ్ము వారికుందా?  


'చేటపెయ్య' సోనియాని ముందు పెట్టుకుని, చిదంబరాలూ, పిళ్ళైలూ, ముఖర్జీలూ, మొయిలీలూ, అహ్మద్ పటేళ్ళూ, వయలార్లూ, శరద్ పవార్లూ ఆడుతున్న నాటకాలకి, వారికి వత్తాసు పలికే 'యాదవ్' లకీ, మిగిలిన వాళ్ళకీ, ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టే రోజు యెంతో దూరం లేదు.  


దానికోసమే నిరీక్షణ!




12 comments:

సంతోష్ said...

గత కొన్నేళ్లుగా భారతదేశానికి "ప్రధానమంత్రి కూడా నామమాత్రం అయిపోయాడు లెండి .
అంతా అమ్మ చెప్పిన మాట ప్రకారమే జరగాలి .
ఈ విధానం మన రాజ్యాంగం లో వుందో లేదో నాకు తెలిదు గాని...
నాకో సందేహం ..
మనది ఇంకా ప్రజాస్వామ్యమేనా ...?
లేక వారసత్వనియంతరాజ్యమా...?

శిశిర said...

>>> ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టే రోజు యెంతో దూరం లేదు.

ప్రజలు పుల్ స్టాప్ పెట్టడమా. కొన్ని దశబ్దాల నుండి అందరు అంటున్న, ఆశిస్తున్న మాట ఇది.
కాని అంత చైతన్యం ఉందంటారా ప్రజలలో? ప్రజలు అవకాశవాదులకి పుల్ స్టాప్ పెట్టడం మాట అటుంచి తమకు తామే పుల్ స్టాప్ పెట్టుకుంటున్నారు. నాయకులు బానే ఉంటున్నారు. సామాన్య ప్రజలే మనకు మనమే నిప్పు పెట్టుకుంటున్నామని తెలియక ప్రభుత్వ ఆస్థులకి నిప్పు పెడుతున్నారు. తమ బస్సులని తామే కాల్చుకుంటున్నారు. తిరిగి ఇదంతా మన మీద పడే భారమే అని ఆలోచించడం లేదు. ఈ గొర్రెలకి అర్థమవ్వాలంటే ఇంకో గాంధీ పుట్టినా సరిపోదేమో.

Anil Dasari said...

పుట్టాడుగా ఇంకో గాంధీ ఆల్రెడీ - తెలంగాణ గాంధీ!

నెహ్రూ కుటుంబం దయతో ఇప్పటికే గాంధీ వంశనామం పరువు సగం పోయింది. ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే తాగుబోతులకీ, ఫ్యాక్షనిస్టులకీ (వైఎస్‌నీ అపర గాంధీ అన్నారెవరో) గాంధీ బిరుదనామం తగిలించటం మొదలెట్టిన నాడే ఆ మిగతా సగం విలువా పోయింది.

ఇప్పుడు దేశానికి కావలసింది బయటి దొంగల్ని తరిమేసే గాంధీ కాదు, ఇంటిదొంగలకి బుద్ధి చెప్పే సర్దార్ పటేల్. అయితే అది సాధ్యమేనా? గొప్ప ప్రజలోంచే గొప్ప నాయకత్వం పుట్టుకొస్తుంది, పరిమళిస్తుంది. ప్రస్తుతం దేశంలో ప్రజలున్న ధోరణికి మహానాయకులు రావటం, ఎవరన్నా వచ్చినా మనగలగటం అసాధ్యం. మార్పు మనలో రాందే, మన గతి ఇంతే.

చిలమకూరు విజయమోహన్ said...

"ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టే రోజు యెంతో దూరం లేదు." నాకైతే నమ్మకం లేదు గురువుగారూ!

శిశిరగారూ! అలనాటి గాంధీగారు చేసిన నిర్వాకమే ప్రస్తుత మనస్థితికి కారణం.ఆయన తగిలించిన నెహ్రూ కుటుంబమే మనదేశానికి శాపమై కూర్చుంది.

prasanna said...

అవునండి మన ఎంపిలు చేతకానితనం వల్లె ఇది అంతా. ఎప్పుడు అన్నింట్లొ ఆంధ్రకి అన్యాయం జరుగుతుంటె వీళ్ళు మాత్రం మనకి ఏమి మన పదవులే మనకి ముఖ్యం అని ఆలోచిస్తారు తప్ప
ఒక్కరైనా నిజంగా కేంద్రంతో గొడవపడి మనకి రావాల్సిన నిధుల గురించి ఆలోచిస్తారా చెప్పండి.
మిగిలిన రాష్ట్రాల వాళ్ళు మాత్రం బెదిరించి మరీ అన్ని వాళ్ళ స్టేట్స్ కి తీసుకెళ్తున్నారు.
ఇంత మంది ఎంపిలని కేంద్రానికి పంపి కూడ ఏమి ఉపయోగం చెప్పండి?
ఆధిష్టానం ఎవరండి ఇంత మంది ఆంధ్ర ప్రజల అత్మ గౌరవన్ని కించపరచాటినికి?
మన ఏంపిలోమో చోద్యం చూస్తున్నారె తప్ప ఒకరిద్దరు తప్ప ఎవరు పెద్దగా స్పందిచట్లేదు.
ఇప్పుడు కూడా ఇంత జరుగుతుంటే వాళ్ళ పదవుల గురించి ఆలోచిస్తున్నరే తప్ప రాజీనామాలు చేస్తే కేంద్రం దిగి రాదా చెప్పండి?…

Anonymous said...

ఆనాటి పి వి నరసింహారావు పరిస్థితే నేటి రోశయ్య పరిస్థితి.

A K Sastry said...

డియర్ సంతోష్!

మనం ఇలా స్వేచ్చగా మాట్లాడుకొంటున్నామంటే, ఖచ్చితం గా మనది ప్రజాస్వామ్యమే!

ఎటొచ్చీ, కొంతమంది కొంచెం యెక్కువ గొప్ప ప్రజలు! అంతే!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ శిశిర!

ఒక గాంధీ మళ్ళీ పుడితే, ఒక గాడ్సే కూడా పుడతాడు!

ఒక ఇందిరాగాంధీ మళ్ళీ పుడితే, ఒక రాజ్ నారాయణ్ కూడా పుడతాడు కదా?

మరి సోనియాకి కూడా యెవరో పుట్టే వుంటారు--ఫుల్ స్టాప్ పెట్టడానికి!

అవునా?

మరో లోక్ నాయక్ కూడా పుట్టే వుంటాడు--ఆయన్ని వెతుకుదాం! సరేనా?

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ అబ్రకదబ్ర!

మార్పు మనలో రావాలి--అది నిజం!

నా పై సమాధానం చదవండి!

మన ప్రయత్నం కొనసాగిద్దాం! సరేనా?

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ చిలమకూరు విజయమోహన్!

మనం ఆశావాదులమే!

అలనాటి గాంధీగారి వెనుక మన పట్టాభిలూ, కళా వెంకట్రావులూ వున్నారు!

నెహ్రూ కుటుంబం భూస్థాపితం అయ్యిందనుకున్నారు--1977 లో! కానీ, ఆ ఫీనిక్స్ ఇందిర బెల్చి వరకూ పాద యాత్ర, యేనుగు యాత్ర చేసేసరికి, కొంతమంది ఆలోచనలు మారాయి--ద్వంద్వ సభ్యత్వాలనే బూచిలు చూపించడానికీ, ముసుగులు తొడుక్కోడానికీ అవకాశాలొచ్చాయి!

ప్రథాన మంత్రిత్వానికి అవకాశాలు తలుపులు తట్టాయి!

మిగిలిందంతా చరిత్ర!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ ప్రసన్న!

మన ఎం పీ ల సోకాల్డ్ చేతకాని తనానికి కారణం--ఈనె పుల్లల్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి, ప్రచారం చేసి, గెలిపించినవాళ్ళు! తమ స్వంత అలోచనలని కార్యాచరణలో పెడితే, రావలసిన పదవులు రావు--మళ్ళీసారి టిక్కెట్ రాదు అనే భయం!

2004 లో--వై యెస్ గెలిచి తనవాళ్ళందరినీ గెలిపించుకోడానికి కారణం--ఆయన పాద యాత్ర అనుకునే అమాయక ప్రజలూ, నాయకులూ మనవాళ్ళు.

నిజానికి దానికి కారణం--చంద్రబాబూ, ఎలక్షన్ కమిషన్ నాన్పుడు!

చంద్రబాబు తనకి పరిస్థితులు తనకు అనుకూలంగా వున్నాయని సరిగ్గానే వూహించి ముందస్తు కి వెళ్ళాడు! కానీ ఎలక్షన్ కమిషన్ వెంటనే ఎన్నికలని ప్రకటించకుండా తాత్సారం చేసింది.

ఈ లోగా, 'నేను నిద్రపోను--మిమ్మల్ని నిద్రపోనివ్వను ' అనే గర్జనలతో ప్రభుత్వ వుద్యోగుల్ని నమిలేస్తున్న చంద్రబాబుకి వ్యతిరేకంగా--వై యెస్ చేసిన 'మీరేం చేసినా, చెయ్యకపోయినా మీకు అడ్డురాను ' అనే వాగ్దానం--అద్భుతాలు చేసింది!

దాంతో, అధిష్టానం వై యెస్ కి పూర్తి స్వేచ్చ ఇచ్చింది--ఆయన తన క్రింది నాయకులనించి, కార్యకర్తలవరకూ అందరికీ స్వేచ్చ ఇచ్చారు!

అధిష్టానం ముందు చేతులు కట్టుకోకుండా నిలబడే స్థాయి సాధించారు ఆయన!
(అందుకే కేకేలూ, జీవీలూ, వీహెచ్ లూ నోరెత్తలేదు!)

మళ్ళీ జగన్ వస్తే, తలెగరేస్తాడని భయపడిన అధిష్టానం--వృధ్ధ త్రిమూర్తులని రెచ్చగొట్టి, పడుకోబెట్టింది!

మరి వీళ్ళకి తగ్గ నాయకత్వం యేది?

అదీ సంగతి!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ bonagiri!

ఒక విధం గా కరక్టే!

ఇక పీవీ గురించి చెప్పాలంటే, 1969 లో పీవీ శాసనసభలో పూర్తి మెజారిటీ వున్న నాయకుడూ, ముఖ్యమంత్రి!

తెలంగాణా కరణపోణ్ణి పదవినించి తప్పించాలని, తెలంగాణా చెన్నారెడ్డి పథకం ప్రకారం ప్రారంభించిన వుద్యమం 'జై తెలంగాణ '--దానికి తెలంగాణా నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ, బద్రీ విశాల్ పిట్టి లాంటివాళ్ళు పూర్తి మద్దతు ఇచ్చారు! ఎన్ జీ వో ల నాయకుడు కే ఆర్ ఆమోస్ కి రాజకీయ వాగ్దానాలు చేసి ఆకట్టుకున్నాడు చెన్నా!

తెలంగాణాకి వ్యతిరేకం గా ఆంధ్రలో సమైక్య వుద్యమం కూడా బలపడుతోందని గమనించిన చెన్నా, హైదరాబాదులో 'విధ్వంసం' సృష్టించేసరికి, అప్పటి అధిష్టానం పీవీ చేత రాజీనామా ఇప్పించి, చెన్నా కి ముఖ్యమంత్రిత్వం కట్టబెట్టేసరికి, జై తెలంగాణా చంక నాకి, చెన్నా తులాభారాలు చేయించుకోవడం మొదలుపెట్టాడు!

ఇక నేను వ్రాసింది పీవీ దేశ ప్రథానిగా వున్నప్పటి స్థితి గురించి! దనికీ ఇప్పటి రోశయ్య పరిస్థితికీ పోలికే లేదు!

ఇప్పటి రోశయ్య రాజ్యం పాదుకల రాజ్యం--అసలు రాముడే లేడు! అదీ మన దీన స్థితి!

ధన్యవాదాలు!