Saturday, December 5

స్వాతంత్ర్యోద్యమం



వందేమాతరం ఉద్యమం


చరిత్రలో లిఖించబడిన ప్రకారం, అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ 1905 జూలై 7న, ‘పరిపాలనా సౌలభ్యం’ పేరిట బెంగాల్ ను రెండు రాష్ట్రాలుగా విభజించాడు.  


దీన్ని భారతీయులు వ్యతిరేకించారు. పెద్ద ఉద్యమం జరిగింది. దీన్నే ‘వందేమాతరం ఉద్యమం’ అని వ్యవహరించారు. ఉద్యమం లో పాల్గొన్నవాళ్ళు సామూహికం గా బంకిం చంద్ర చటర్జీ వ్రాసిన వందేమాతరం గీతాన్ని గానం చేసేవారు.  


ఆంగ్లేయులు తమ ‘విభజించి పాలించు‘ పధ్ధతి ప్రకారం—హిందూ ముసల్మానులని విడదీయాలని కుట్ర పన్నారు—అనే బలమైన భావనతో పెద్ద యెత్తున ఈ ఉద్యమం జరిగింది—దేశమంతటా!  


దీనికి ‘లాల్, బాల్, పాల్’ త్రయం గా పేరొందిన లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్ నాయకత్వం వహించారు.  


1906 నుంచి 1911 వరకూ ఆంధ్రదేశం లో కూడా విశేషం గా, ఉధృతం గా ఈ ఉద్యమం జరిగింది. ఇందులో భాగం గా—విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం, ఆంగ్లపాఠశాలలు మాని, జాతీయ పాఠశాలలు స్థాపించడం, ఆంగ్ల న్యాయ స్థానాల బహిష్కరణ, శాంతియుత శాసనోల్లంఘనం, పన్నుల చెల్లింపుకి నిరాకరణ—ఇలా అనేకవిధాలుగా సాగింది ఆ ఉద్యమం!  


ఇదే మొదటి పెద్ద జాతీయోద్యమం—మన దేశం లో!  


ఆ రోజుల్లో జోక్ యేమిటంటే, యెవరైనా యే మామిడికాయలో బేరం చేస్తూ, “వందేమాత్రం?” అని అడిగితే, అడిగినవాళ్ళని సైతం పోలీసులు అరెష్టు చేసేవారట—ఆ ప్రశ్న "వందే మాతరం” లా వినిపించి!  


మరి ఈ రోజున కొన్ని ముసల్మాన్ సంఘాలు ‘వందే మాతరం పాడడానికి వీల్లేదు‘ అని “ఫత్వా” జారీ చేస్తున్నాయట.  


దీనికి కేంద్రమంత్రులు కూడా వత్తాసు ట.  


యెంత సిగ్గులేని జాతి అయిపోయింది మనది!  


ఈ రోజు కూడా, మన సైనిక దళాలు కవాతు చెయ్యడానికి మహాకవి ఇక్బాల్ వ్రాసిన ‘సారే జహాన్ సే అచ్చా……’ ట్యూన్ నే వాయిస్తారే? దానికి యేమతం వాళ్ళూ వ్యతిరేకత కనబరచలేదే?  


అసలు ‘ముస్లిం సోదరులు‘ అంటూ ఓ ప్రత్యేక జాతిని సృష్టించి, ఆ పేరుతోనే ఫలానా మతస్థులని వ్యవహరిస్తున్న పేపర్లనీ, టీవీ చానెళ్ళనీ ప్రజలందరూ బహిష్కరిస్తే యెంత బాగుండును!  


మన 'ఈనాడు' ఆ దిశలో ముందడుగు వేస్తుందని ఆశిద్దామా?








2 comments:

సంతోష్ said...

‘సారే జహాన్ సే అచ్చా……’ వ్రాసిన
మొహమ్మద్ ఇక్బాలే ..
కొంతకాలం తర్వాత "మొహమ్మద్ అలీ జిన్నా "ను ముస్లిం ల కొరకు పాకిస్తాన్ దేశంగా విడిపోవడానికి నాయకత్వం వహించమని ప్రేరేపించింది కూడా ఇక్బాలే అని ఎక్కడో చదివాను ..ఇది నిజమేనా .?

A K Sastry said...

డియర్ సంతోష్!

బహుశా అది నిజం కాకపోవచ్చు--నేనెక్కడా వినలేదు!

అయినా, కవిత్వం వ్రాయడానికీ, తన నమ్మకాలకి అనుగుణం గా వ్యవహరించడానికీ సంబంధం లేదు కదా?

పైగా, 'నిరంకుశాః కవయాః'!

ధన్యవాదాలు!