‘……..ఆయనా! చాలా మంచివాడు—దైవ భక్తీ, పాపభీతీ వున్నవాడు!’ అంటూంటారు సామాన్యం గా యెవరైనా మంచివాళ్ళు అని చెప్పాల్సి వచ్చినప్పుడు.'గాలి ' దాతృత్వం
కానీ, ‘దైవ భక్తి’ అన్నది—సూరదాసూ, తులసీదాసూ, కబీరుదాసూ, రామదాసూ, తుకారాం, జయదేవుడు, చైతన్యప్రభు, గాంధీ—లాంటి వాళ్ళకే సాధ్యమౌతుంది! మనది ‘అవసరార్థం’ భక్తి!
ఇక పాపభీతి అంటారా! శ్రీపతి, షిరిడీ, శబరిమల—ఇలాంటివేకాదు—యే వూరిలోని చెరువుగట్టూ, కాలవగట్టూ వీధిమూలా వేంచేసిన యే దేవుడి గుడి దగ్గర చూసినా అక్కడ మూగుతున్న ‘భక్త’ జనాలే సాక్ష్యం!
మరి మన గాలి జనార్దనరెడ్డి యే బాపతు?
యెందుకంటే, పాపం 45 కోట్లు ఖర్చుపెట్టి, 7 వేలకి పైగా వజ్రాలతో, కోటీ యెనభైమూడు లక్షల ఖరీదైన ఒకే పచ్చతో కూడా ఓ బంగారు కిరీటం చేయించి, శ్రీగిరి శ్రీపతి వేంకటేశ్వర స్వామి కి ‘దానం’ చేశాడట!
ప్రపంచం మొత్తానికే కోటీశ్వరుడు ‘వారెన్ బఫెట్’ తన యావత్తు ఆస్థినీ, ఒక ట్రస్టు కి అప్పగించాడు—మానవ సేవకి ఉపయోగించమని! ఇంకా యేమన్నాడంటే, ‘నా సంతానాన్ని రోడ్డున పడవలసిన అవసరం లేకుండా కావలసినంత మాత్రమే వాళ్ళకు ఇచ్చాను! మిగిలినదంటా ఈ ట్రస్టు కే!’ అన్నాడు!
మా డ్రైవర్ కామెంట్—‘……45 కోట్లు పట్టికేళ్ళి వాడి నెత్తిమీద పెట్టాడట! యెవడికేమి వొరిగింది? దాంతో యెన్ని కోట్ల కుటుంబాలు బాగుపడేవో! ఈళ్ళంతా యెందుకు సంపాదిస్తన్నారో….అదంతా యేమి చేసుకుంటారో!’
ఆయన వయసు 67 యేళ్ళు!
ఇక మనం ‘నో కామెంట్’!
No comments:
Post a Comment