Monday, May 18

'ఆఖరి మజిలీ'

తమిళ పులి 'వేలుపిళ్ళై పిరభాకరన్ ' చివరికి వేటాడబడ్డాడు! (కాబట్టే అది 'చివర ' అయ్యింది!)
మొన్నేకదా అనుకున్నాము--'అల్టిమేట్ డెస్టినీ' చేరక తప్పదు--అని!

'గమ్యాన్ని చేరుకోవడమే ముఖ్యం కాదు--అది చేరుకొనే మార్గం కూడా ముఖ్యమే' అన్న సూక్తికి ఓ మంచి ఉదాహరణ పిరభాకరన్!

పనిలో పని, తమిళనాట యెన్నికలు అయిపోయి, ఫలితాలూ వచ్చేశాయి కదా! ఇక అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా యేర్పాట్లు చేశారట!

మంచిదేగా!

5 comments:

శరత్ కాలమ్ said...

దుష్టుడు మరణించాడు. సంతోషిద్దాం.

Anonymous said...

దుష్టులకు అందరు దుష్టులు గానె కనిపిస్తారు.

A K Sastry said...

డియర్ Anonymous!

'దుష్టులు ' అన్నది నన్నా? శరత్ 'కాలం' నా?

నిజంగా తను నమ్మిన సిద్ధాంతాన్ని తనకు తోచిన విధంగా అమలు చెయ్యాలని నిర్ణయించుకొని, బలై పోయిన పిరభాకరన్ ని 'దుష్టుడు ' అనఖ్ఖర్లేదు కదూ?

Bhãskar Rãmarãju said...

నా వల్ల ఇంకొకరి ప్రాణం పోతే నేను దుష్టుణ్ణే.
ప్రభాకర్ ఎంతమంది అమాయక పిల్లల ప్రాణాల్ని హరించాడు ప్రత్యక్షంగా ఐన ప్రోక్షంగా అయినా.

A K Sastry said...

డియర్ భాస్కర్ రామరాజూ!

'.......మార్గాలు కూడా ముఖ్యం' అని నేనన్నది అందుకే!

కానీ, 'దుష్టుడు ' అనఖ్ఖర్లేదు అంటే, చెప్పానుగా, తను నమ్మిన సిద్ధాంతాలకోసం..........' అని!

మరి మీ అంత తీవ్రంగా అంటే, మన గాంధీ దగ్గర నించి, జార్జ్ వాషింగ్టన్, అబ్రహాం లింకన్, నెల్సన్ మండేలా, యాసిర్ అరాఫత్, రాబర్ట్ ముగాబే, నిన్న మొన్నటి జూనియర్ బుష్ వరకూ అందరూ దుష్టులే కదా!